< Zsoltárok 149 >
1 Dicsérjétek az Urat! Énekeljetek az Úrnak új éneket; dicsérje őt a kegyesek gyülekezete!
౧యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి.
2 Örvendezzen Izráel az ő teremtőjében: Sionnak fiai örüljenek az ő királyukban!
౨ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్తను బట్టి సంతోషిస్తారు గాక. సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందిస్తారు గాక.
3 Dicsérjék az ő nevét tánczczal; dobbal és hárfával zengjenek néki.
౩వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక.
4 Mert kedveli az Úr az ő népét, a szenvedőket szabadulással dicsőíti meg.
౪యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.
5 Vígadozzanak a kegyesek tisztességben; ujjongjanak nyugvó helyökön.
౫ఆయన భక్తులు ఘనమైన స్థితిలో సంతోషంతో ఉప్పొంగిపోతారు గాక. తమ పడకలపై వాళ్ళు సంతోషంగా పాటలు పాడతారు గాక.
6 Isten-dicsőítés legyen torkukban, kétélű fegyver kezeikben;
౬దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి.
7 Hogy bosszút álljanak a pogányokon, és megfenyítsék a nemzeteket!
౭వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు.
8 Hogy lánczra fűzzék királyaikat, főembereiket pedig vas-bilincsekbe.
౮వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు.
9 Hogy végrehajtsák rajtok a megírott ítéletet. Dicsőség ez az ő minden kegyeltjére! Dicsérjétek az Urat!
౯తీర్పులో శిక్ష పొందిన వాళ్లకు శిక్ష అమలు పరుస్తారు. ఆయన భక్తులందరికీ ఈ ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. యెహోవాను స్తుతించండి.