< 4 Mózes 11 >
1 És lőn, hogy panaszolkodék a nép az Úr hallására, hogy rosszul van dolga. És meghallá az Úr, és haragra gerjede, és felgyullada ellenök az Úrnak tüze és megemészté a tábornak szélét.
౧ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది.
2 Kiálta azért a nép Mózeshez, és könyörge Mózes az Úrnak, és megszünék a tűz.
౨అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి.
3 És nevezé azt a helyet Thaberának; mert felgyulladt vala ellenök az Úrnak tüze.
౩యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది.
4 De a gyülevész nép, a mely köztök vala, kívánságba esék, és Izráel fiai is újra síránkozni kezdének, és mondának: Kicsoda ád nékünk húst ennünk?
౪కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?
5 Visszaemlékezünk a halakra, a melyeket ettünk Égyiptomban ingyen, az ugorkákra és dinnyékre, a párhagymákra, vereshagymákra és a foghagymákra.
౫ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.
6 Most pedig a mi lelkünk eleped, mindennek híjával lévén; szemünk előtt nincs egyéb mint manna.
౬ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.
7 (A manna pedig olyan vala mint a kóriándrum magva, a színe pedig mint a bdelliomnak színe.
౭ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది.
8 Kiomol vala pedig a nép, és szedik vala a mannát, és őrlik vala kézimalmokban, vagy megtörik vala mozsárban, és megfőzik vala fazékban, és csinálnak vala abból pogácsákat: az íze pedig olyan vala, mint az olajos kalácsé.
౮ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.
9 Mikor pedig a harmat leszáll vala a táborra éjjel, a manna is mindjárt leszáll vala arra.)
౯రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
10 És meghallá Mózes, hogy sír a nép, az ő nemzetsége szerint, kiki az ő sátorának nyílása előtt; és igen felgerjede az Úr haragja, és nem tetszék az Mózesnek.
౧౦ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.
11 És monda Mózes az Úrnak: Miért nyomorítád meg a te szolgádat? és miért nem találék kegyelmet a te szemeid előtt, hogy ez egész népnek terhét én reám vetéd?
౧౧అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
12 Avagy tőlem fogantatott-e mind ez egész nép? avagy én szűltem-e őt, hogy azt mondod nékem: Hordozd őt a te kebleden, a miképen hordozza a dajka a csecsemőt, arra a földre, a mely felől megesküdtél az ő atyáinak?
౧౨ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
13 Hol vegyek én húst, hogy adjam azt mind ez egész népnek? mert reám sírnak, mondván: Adj nékünk húst, hadd együnk!
౧౩ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు.
14 Nem viselhetem én magam mind ez egész népet; mert erőm felett van.
౧౪ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.
15 Ha így cselekszel velem, kérlek ölj meg engemet, ölj meg ha kedves vagyok előtted, hogy ne lássam az én nyomorúságomat.
౧౫నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”
16 Monda azért az Úr Mózesnek: Gyűjts egybe nékem hetven férfiút Izráel vénei közül, a kikről tudod, hogy vénei a népnek és annak előljárói, és vidd őket a gyülekezet sátorához, és álljanak ott veled.
౧౬అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.
17 Akkor alá szállok, és szólok ott veled, és elszakasztok abból a lélekből, a mely te benned van, és teszem ő beléjök, hogy viseljék te veled a népnek terhét, és ne viseljed te magad.
౧౭అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.
18 A népnek pedig mondd meg: Készítsétek el magatokat holnapra, és húst esztek; mert sírtatok az Úr hallására, mondván: Kicsoda ád nékünk húst ennünk? mert jobban vala nékünk dolgunk Égyiptomban. Azért az Úr ád néktek húst és enni fogtok.
౧౮నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
19 Nem csak egy napon esztek, sem két napon, sem öt napon, sem tíz napon, sem húsz napon;
౧౯ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.
20 Hanem egy egész hónapig, míglen kijön az orrotokon, és útálatossá lesz előttetek; mivelhogy megvetettétek az Urat, a ki közöttetek van; és sírtatok ő előtte mondván: Miért jöttünk ide ki Égyiptomból?
౨౦ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”
21 És monda Mózes: Hatszáz ezer gyalogos e nép, a mely között én vagyok, és te azt mondod: Húst adok nékik, és esznek egy egész hónapig?!
౨౧దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు.
22 Nemde juhok és ökrök vágattatnak-é nékik, hogy elég legyen nékik? vagy a tengernek minden hala összegyűjtetik-é nékik, hogy elég legyen nékik?
౨౨ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
23 Akkor monda az Úr Mózesnek: Avagy megrövidült-é az Úrnak keze? Majd meglátod: beteljesedik-é néked az én beszédem vagy nem?
౨౩అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
24 Kiméne azért Mózes, és elmondá a népnek az Úr beszédét, és összegyűjte hetven férfiút a nép vénei közül, és állatá őket a sátor körül.
౨౪మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.
25 Akkor leszálla az Úr felhőben, és szóla néki, és elszakaszta abból a lélekből, a mely vala ő benne, és adá a hetven vén férfiúba. Mihelyt pedig megnyugovék ő rajtok a lélek, menten prófétálának, de nem többé.
౨౫అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.
26 Két férfiú azonban elmaradt vala a táborban; egyiknek neve Eldád, a másiknak neve Médád, és ezeken is megnyugodott vala a lélek; mert azok is az összeírottak közül valók, de nem mentek vala el a sátorhoz, és mégis prófétálának a táborban.
౨౬ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.
27 Elfutamodék azért egy ifjú, és megjelenté Mózesnek, és monda: Eldád és Médád prófétálnak a táborban.
౨౭అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
28 Akkor felele Józsué, a Nún fia, Mózes szolgája, az ő választottai közül való, és monda: Uram, Mózes, tiltsd meg őket!
౨౮మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు.
29 És felele néki Mózes: Avagy érettem buzgólkodol-é? Vajha az Úrnak minden népe próféta volna, hogy adná az Úr az ő lelkét ő beléjök.
౨౯దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
30 Ezután visszatére Mózes a táborba, ő és az Izráel vénei.
౩౦అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.
31 És szél jöve ki az Úrtól, és hoza fürjeket a tengertől, és bocsátá a táborra egynapi járásnyira egy felől, és egynapi járásnyira más felől a tábor körül, és mintegy két sing magasságnyira a földnek színén.
౩౧అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
32 Akkor felkele a nép és azon az egész napon, és egész éjjel, és az egész következő napon gyűjtének magoknak fürjeket, a ki keveset gyűjtött is, gyűjtött tíz hómert, és kiteregeték azokat magoknak a tábor körül.
౩౨కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
33 A hús még foguk között vala, és meg sem emésztették vala, a mikor az Úrnak haragja felgerjede a népre és megveré az Úr a népet igen nagy csapással.
౩౩ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.
34 És elnevezék azt a helyet Kibrot-thaavának: mert ott temeték el a mohó népet.
౩౪మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది.
35 Kibrot-thaavától elméne a nép Haseróthba; és ott valának Haseróthban.
౩౫ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.