< Máté 9 >
1 És hajóra szállva átkele, és méne a maga városába.
౧యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
2 És ímé hoznak vala hozzá egy ágyban fekvő gutaütött embert. És látva Jézus azoknak hitét, monda a gutaütöttnek: Bízzál fiam! Megbocsáttattak néked a te bűneid.
౨కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది, అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.
3 És ímé némelyek az írástudók közül mondának magukban: Ez káromlást szól.
౩ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు.
4 És Jézus, látva az ő gondolataikat, monda: Miért gondoltok gonoszt a ti szívetekben?
౪యేసు వారి ఆలోచనలు గ్రహించి, “మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు?
5 Mert mi könnyebb, ezt mondani-é: Megbocsáttattak néked a te bűneid; vagy ezt mondani: Kelj föl és járj?
౫‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా?
6 Hogy pedig megtudjátok, hogy az ember Fiának van hatalma a földön a bűnöket megbocsátani (ekkor monda a gutaütöttnek): Kelj föl, vedd a te ágyadat, és eredj haza.
౬అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, “నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు.
7 És az felkelvén, haza méne.
౭అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
8 A sokaság pedig ezt látván, elálmélkodék, és dicsőíté az Istent, hogy ilyen hatalmat adott az embereknek.
౮ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
9 És mikor Jézus onnét tovább méne, láta egy embert ülni a vámszedő helyen, a kinek Máté volt a neve, és monda néki: Kövess engem! És az felkelvén, követé őt.
౯యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూశాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అన్నాడు. అతడు లేచి ఆయనను అనుసరించాడు.
10 És lőn, a mikor ő letelepedék a házban, ímé sok vámszedő és bűnös jött oda és letelepedtek Jézussal és az ő tanítványaival az asztalhoz.
౧౦యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసే వారూ పాపులూ వచ్చి ఆయనతో, ఆయన శిష్యులతో కూర్చున్నారు.
11 És látva ezt a farizeusok, mondának az ő tanítványainak: Miért eszik ez a ti Mesteretek a vámszedőkkel és bűnösökkel együtt?
౧౧పరిసయ్యులు అది గమనించి, “మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యులను అడిగారు.
12 Jézus pedig ezt hallván, monda nékik: Nem az egészségeseknek van szüksége orvosra, hanem a betegeknek.
౧౨యేసు అది విని, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం.
13 Elmenvén pedig tanuljátok meg, mi az: Irgalmasságot akarok és nem áldozatot. Mert nem az igazakat hivogatni jöttem, hanem a bűnösöket a megtérésre.
౧౩నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్ళి ‘మీరు బలులు అర్పించడం కాదు, కనికరం చూపించాలనే కోరుతున్నాను’ అనే వాక్యభావం నేర్చుకోండి” అని చెప్పాడు.
14 Akkor a János tanítványai jövének hozzá, mondván: Miért hogy mi és a farizeusok sokat bőjtölünk, a te tanítványaid pedig nem bőjtölnek?
౧౪అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గానీ నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?” అని ఆయనను అడిగారు.
15 És monda nékik Jézus: Vajjon szomorkodhatik-é a násznép a míg velök van a vőlegény? de eljőnek a napok, a mikor elvétetik tőlök a vőlegény, és akkor bőjtölni fognak.
౧౫యేసు వారికిలా జవాబిచ్చాడు. “పెళ్ళికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి వారు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వారు ఉపవాసం ఉంటారు.
16 Senki sem vet pedig új posztóból foltot az ócska ruhára; mert a mi azt kitoldaná, még elszakít a ruhából és nagyobb szakadás lesz.
౧౬“ఎవడూ పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది. ఆ చినుగు మరింత పెద్దదవుతుంది.
17 Új bort sem töltenek ó tömlőkbe; máskülönben a tömlők szétszakadoznak, és a bor kiömöl, a tömlők is elvesznek; hanem az új bort új tömlőkbe töltik, és mindkettő megmarad.
౧౭పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.”
18 Mikor ezeket mondá nékik, ímé egy főember eljövén leborula előtte, mondván: Az én leányom épen most halt meg; de jer, vesd reá kezedet, és megelevenedik.
౧౮ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు.
19 És felkelvén Jézus követé őt tanítványaival együtt.
౧౯అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
20 És ímé, egy asszony, a ki tizenkét év óta vérfolyásban szenved vala, hozzájárulván hátulról, illeté az ő ruhájának szegélyét.
౨౦అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి,
21 Mert ezt mondja vala magában: Ha csak ruháját illetem is, meggyógyulok.
౨౧“నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది.
22 Jézus pedig megfordulván és reá tekintvén, monda: Bízzál leányom; a te hited megtartott téged. És meggyógyult az asszony abban az órában.
౨౨యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
23 És Jézus a főember házához érvén, látván a sípolókat és a tolongó sokaságot,
౨౩అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు.
24 Monda nékik: Menjetek el innen, mert a leányzó nem halt meg, hanem aluszik. És kinevették őt.
౨౪“వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు.
25 Mikor pedig a sokaság eltávolíttaték, bemenvén, megfogá annak kezét, és a leányzó felkelt.
౨౫ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది.
26 És elterjede ez a hír abban az egész tartományban.
౨౬ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
27 És mikor Jézus tovább ment onnét, két vak követé őt, kiáltozva és ezt mondva: Könyörülj rajtunk, Dávidnak fia!
౨౭యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు.
28 Mikor pedig beméne a házba, oda menének hozzá a vakok, és monda nékik Jézus: Hiszitek-é, hogy én azt megcselekedhetem? Mondának néki: Igen, Uram.
౨౮యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, “నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?” అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు.
29 Akkor illeté az ő szemeiket, mondván: Legyen néktek a ti hitetek szerint.
౨౯అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, “మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది” అన్నాడు.
30 És megnyilatkozának azoknak szemei; és rájok parancsola Jézus, mondván: Meglássátok, senki meg ne tudja!
౩౦వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు “ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి” అని ఖండితంగా వారికి చెప్పాడు.
31 Azok pedig kimenvén, elterjeszték az ő hírét abban az egész tartományban.
౩౧కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
32 Mikor pedig azok elmentek vala, ímé egy ördöngős néma embert hozának néki.
౩౨ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు.
33 És az ördögöt kiűzvén, megszólalt a néma; és a sokaság csudálkozik vala, mondván: Soha nem láttak ilyet Izráelben!
౩౩దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు.
34 A farizeusok pedig ezt mondják vala: Az ördögök fejedelme által űzi ki az ördögöket.
౩౪అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.
35 És körüljárja vala Jézus a városokat mind, és a falvakat, tanítván azoknak zsinagógáiban, és hirdetvén az Isten országának evangyéliomát, és gyógyítván mindenféle betegséget és mindenféle erőtelenséget a nép között.
౩౫యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు.
36 Mikor pedig látta vala a sokaságot, könyörületességre indula rajtok, mert el voltak gyötörve és szétszórva, mint a pásztor nélkül való juhok.
౩౬ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు.
37 Akkor monda az ő tanítványainak: Az aratni való sok, de a munkás kevés.
౩౭ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు.
38 Kérjétek azért az aratásnak Urát, hogy küldjön munkásokat az ő aratásába.
౩౮కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.