< Jeremiás 19 >

1 Ezt mondja az Úr: Menj el és végy egy cserépkorsót a fazekastól, és némelyekkel a nép vénei közül és a papok vénei közül.
యెహోవా ఇలా చెప్పాడు,
2 Menj el a Ben-Hinnom völgyébe, a mely a fazekasok kapujának bejáratánál van, és kiáltsd ott azokat a szavakat, a melyeket én szólok néked;
నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3 És ezt mondjad: Halljátok meg az Úr szavát Júda királyai és Jeruzsálem lakosai: Ezt mondja a Seregek Ura, Izráel Istene: Ímé, én veszedelmet hozok e helyre, úgy hogy a ki csak hallja, megcsendül bele a füle.
“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4 Azért, mert elhagytak engem, és idegenné tették e helyet, és idegen isteneknek áldoztak benne, a kiket sem ők nem ismertek, sem atyáik, sem Júda királyai, és eltöltötték e helyet ártatlan vérrel;
ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5 És magaslatokat építének a Baálnak, hogy megégessék fiaikat a tűzben, égőáldozatul a Baálnak, a mit én nem parancsoltam, sem nem rendeltem, és a mire nem is gondoltam.
వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”
6 Azért ímé eljőnek a napok, azt mondja az Úr, és e hely nem neveztetik többé Tófetnek, sem Ben-Hinnom völgyének, hanem öldöklés völgyének.
కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్‌ హిన్నోము లోయ అని గానీ అనరు.
7 És eszét vesztem e helyen Júdának és Jeruzsálemnek, és fegyverrel ejtem el őket ellenségeik előtt, és az életökre törőknek kezével; holttesteiket pedig az ég madarainak és a mezei vadaknak adom eledelül.
ఈ స్థలం లోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్ధం చేస్తాను. తమ శత్రువుల ఎదుట కత్తిపాలయ్యేలా చేస్తాను. తమ ప్రాణాలను తీయాలని చూసే వాళ్ళ చేతికి అప్పగిస్తాను. వాళ్ళ శవాలను రాబందులకూ అడవి జంతువులకూ ఆహారంగా ఇస్తాను.
8 És e várost csudává teszem és nevetséggé, a ki csak átmegy rajta, álmélkodik és szörnyűködik az ő nagy romlásán.
ఈ పట్టణాన్ని పాడు చేసి ఎగతాళికి గురి చేస్తాను. ఆ దారిలో వెళ్ళే ప్రతివాడూ దాని కడగండ్లన్నీ చూసి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు.
9 És megétetem velök az ő fiaik húsát és leányaik húsát és megeszi kiki az ő barátjának húsát, a megszállás alatt és a veszedelem alatt, a melylyel megszorongatják őket ellenségeik és a kik keresik az ő lelköket.
వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.
10 Azután törd el e korsót azok szeme láttára, a kik elmennek veled.
౧౦ఈ మాటలు చెప్పిన తరువాత నీతో వచ్చిన మనుష్యులు చూస్తుండగా నువ్వు ఆ కుండ పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి.”
11 És ezt mondd nékik: Ezt mondja a Seregek Ura: Így töröm össze e népet és e várost, a mint összetörhető e cserépedény, a mely többé meg sem építhető; és Tófetben temettetnek el, mert nem lesz más hely a temetkezésre.
౧౧“సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, మళ్ళీ బాగుచేయడానికి వీలు లేకుండా కుమ్మరివాని కుండను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ ప్రజలనూ ఈ పట్టణాన్నీ పగలగొట్టబోతున్నాను. తోఫెతులో పాతిపెట్టే చోటు దొరకనంతగా వాళ్ళను అక్కడే పాతిపెడతారు.”
12 Így cselekszem e helylyel és ennek lakosaival, azt mondja az Úr, és olyanná teszem e várost, a milyen Tófet.
౧౨యెహోవా వాక్కు ఇదే. “ఈ పట్టణాన్ని తోఫెతులాంటి స్థలంగా నేను చేస్తాను. ఈ స్థలానికీ అక్కడి నివాసులకూ నేనలా చేస్తాను.
13 És Jeruzsálem házai és Júda királyainak házai undokokká lesznek, mint a Tófet helye; mindazok a házak, a melyeknek tetején az ég egész seregének áldoztak és italáldozatot vittek az idegen isteneknek.
౧౩యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”
14 Azután hazajöve Jeremiás Tófetből, a hová az Úr küldte vala őt prófétálni; megálla az Úr házának pitvarában, és szóla az egész népnek:
౧౪యిర్మీయా ఆ ప్రవచనం చెప్పడానికి యెహోవా తనను పంపిన తోఫెతులో నుంచి వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలబడి ప్రజలందరితో ఇలా చెప్పాడు,
15 Ezt mondja a Seregek Ura, Izráel Istene: Ímé én ráhozom e városra és ennek minden városára mindama veszedelmet, a melyről szóltam ő ellene; mert megkeményítették nyakukat, hogy ne hallják az én beszédeimet.
౧౫“సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”

< Jeremiás 19 >