< Ézsaiás 51 >

1 Hallgassatok reám, kik az igazságot követitek, kik az Urat keresitek; tekintsetek a kőszálra, a melyből kivágattattatok, és a kútfő nyílására, a melyből kiásattatok!
నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.
2 Tekintsetek Ábrahámra, atyátokra, és Sárára, a ki titeket szűlt, hogy egymagát hívtam el őt, és megáldám és megszaporítám őt.
మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.
3 Mert megvígasztalja az Úr Siont, megvígasztalja minden romjait, és pusztáját olyanná teszi, mint az Éden, és kietlenjét olyanná, mint az Úrnak kertje, öröm és vígasság találtatik abban, hálaadás és dicséret szava!
యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.
4 Figyeljetek reám, én népem, és reám hallgassatok, én nemzetem! mert tanítás megy ki tőlem, és törvényemet a népek megvilágosítására megalapítom.
నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.
5 Közel igazságom, kijő szabadításom, és karjaim népeket ítélnek: engem várnak a szigetek, és karomba vetik reménységüket.
నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.
6 Emeljétek az égre szemeiteket, és nézzetek a földre ide alá, mert az egek mint a füst elfogynak, és a föld, mint a ruha megavul, és lakosai hasonlókép elvesznek; de szabadításom örökre megmarad, és igazságom meg nem romol.
ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.
7 Hallgassatok rám, kik tudjátok az igazságot, te nép, kinek szívében van törvényem! ne féljetek az emberek gyalázatától, és szidalmaik miatt kétségbe ne essetek!
సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.
8 Mert mint a ruhát, moly emészti meg őket, és mint a gyapjat, féreg eszi meg őket, és igazságom örökre megmarad, és szabadításom nemzetségről nemzetségre!
చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
9 Kelj föl, kelj föl, öltözd fel az erőt, oh Úrnak karja! kelj föl, mint a régi időben, a messze hajdanban! Avagy nem te vagy-é, a ki Ráhábot kivágta, és a sárkányt átdöfte?
యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?
10 Nem te vagy-é, a ki a tengert megszáraztotta, a nagy mélység vizeit; a ki a tenger fenekét úttá változtatta, hogy átmenjenek a megváltottak?!
౧౦చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?
11 Így térnek meg az Úrnak megváltottai, és ujjongás között Sionba jőnek, és örökös öröm fejökön; vígasságot és örömöt találnak, eltünik a fájdalom és sóhaj!
౧౧యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.
12 Én, én vagyok megvigasztalótok! Ki vagy te, hogy félsz halandó embertől? ember fiától, a ki olyan lesz, mint a fű?!
౧౨నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
13 Hogy elfeledkeztél az Úrról, Teremtődről, a ki az eget kiterjeszté és a földet megalapítá, és hogy félsz szüntelen minden napon nyomorgatódnak haragjától, a ki igyekszik elveszteni? De hol van a nyomorgató haragja?
౧౩ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?
14 Hirtelen megszabadul a fogoly, és nem hal meg a veremben, kenyere sem fogy el:
౧౪కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.
15 Hiszen én vagyok az Úr, a te Istened, a ki megreszkettetem a tengert és zúgnak habjai; seregeknek Ura az Én nevem?
౧౫నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.
16 És adtam beszédemet a te szádba, és kezem árnyékával födöztelek be, hogy újonnan plántáljam az egeket, és megalapítsam a földet, és ezt mondjam Sionnak: Én népem vagy te!
౧౬నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.
17 Serkenj föl, serkenj föl, kelj föl Jeruzsálem, ki megittad az Úr kezéből haragja poharát; a tántorgás öblös kelyhét megittad, kiürítéd!
౧౭యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
18 Nem vala vezetője minden fiai közül, a kiket szűlt, nem fogta senki őt kézen minden fiai közül, a kiket fölnevelt.
౧౮ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.
19 E kettő esett rajtad! Kicsoda szánt meg téged? A pusztulás, a romlás, az éhség és a fegyver; miként vígasztaljalak téged?
౧౯రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?
20 Fiaid elájultan ott feküdtek minden utczáknak fejeinél, mint a hálóba esett zerge, megrészegedve az Úr haragjától, Istenednek feddésétől.
౨౦నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
21 Ezért halld meg ezt, szenvedő, ki részeg vagy, de nem bortól!
౨౧అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.
22 Így szól Urad, az Úr, és Istened, a ki népéért bosszút áll: Ímé, kiveszem kezedből a tántorgás poharát, haragom öblös kelyhét, nem iszod többé azt meg!
౨౨నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు.
23 És adom azt nyomorgatóid kezébe, a kik azt mondották lelkednek: Hajolj meg, hogy átmenjünk te rajtad, és a te hátadat olyanná tetted, mint a föld, és mint a minő az utcza a járóknak!
౨౩నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”

< Ézsaiás 51 >