< Ézsaiás 4 >

1 És megragad hét asszony egy férfit ama napon, mondván: A magunk kenyerét eszszük és a mi ruhánkba öltözködünk, csak hadd neveztessünk a te nevedről, és vedd le rólunk gyalázatunkat!
ఆ రోజున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకుని “మా అన్నం మేమే తింటాం. మా వస్త్రాలు మేమే వేసుకుంటాం. కాని, మా అవమానం పోయేలా నీ పేరు మాత్రం మమ్మల్ని పెట్టుకోనివ్వు” అంటారు.
2 És ama napon az Úrnak csemetéje ékes és dicsőséges lészen, és a földnek gyümölcse nagyságos és díszes Izráel maradékának.
ఆ రోజున యెహోవా కొమ్మ అందంగానూ, మహిమతోనూ నిండి ఉంటుంది. ఇశ్రాయేలులో శేషించినవాళ్ళ భూమి పంట రుచిగానూ, చూడ ముచ్చటగానూ ఉంటుంది.
3 És lészen, hogy a ki Sionban meghagyatik, és Jeruzsálemben megmarad, szentnek mondatik, minden, valaki Jeruzsálemben az élők közé beiratott.
సీయోనులో శేషించిన వాడూ, యెరూషలేములో నిలిచి ఉన్నవాడూ, అంటే సజీవుడుగా లెక్కకు వచ్చినవాడు “పవిత్రుడు” అని పిలిపించుకుంటాడు.
4 Ha elmosta az Úr Sion leányainak undokságát, és Jeruzsálem vérét eltisztítá belőle az ítélet lelkével, a megégetés lelkével:
న్యాయాత్మ వలన, దహించే అగ్ని ఆత్మ వలన, ప్రభువు సీయోను కుమార్తెల కల్మషం కడిగేసినప్పుడు, యెరూషలేముకు అంటిన రక్తపు మరకలను దాని మధ్య నుంచి తీసి వేసి దాన్ని శుద్ధి చేసిన వాడవుతాడు.
5 Akkor teremteni fog az Úr Sion hegyének minden helye fölé és gyülekezetei fölé nappal felhőt és ködöt, s lángoló tűznek fényességét éjjel; mert ez egész dicsőségen oltalma lészen;
సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.
6 És sátor lészen árnyékul nappal a hőség ellen, s oltalom és rejtek szélvész és eső elől.
ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.

< Ézsaiás 4 >