< Ézsaiás 30 >
1 Jaj a pártos fiaknak, így szól az Úr, a kik tervet visznek véghez nélkülem, és szövetséget kötnek, de nem lelkem által, hogy bűnre bűnt halmozzanak!
౧“తిరుగుబాటు చేసే పిల్లలకు బాధ.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “వాళ్ళు ఆలోచనలు చేస్తారు. కానీ నన్ను సంప్రదించరు. ఇతర జనాలతో స్నేహం చేస్తారు. కానీ నా ఆత్మ నిర్దేశించింది కాదు. ఈ విధంగా వాళ్ళు పాపానికి పాపాన్ని జోడిస్తారు.
2 A kik Égyiptomba szállanak alá, és számat nem kérdezik meg, hogy meneküljenek a Faraónak oltalmába, és Égyiptom árnyékába rejtőzködjenek.
౨వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు. కానీ నా సలహా కోసం చూడరు. ఫరో సంరక్షణ కోసం పాకులాడుతున్నారు. ఐగుప్తు నీడలో ఆశ్రయం కోసం ఆరాటపడుతున్నారు.
3 És lesz néktek a Faraó oltalma szégyentekre, és az elrejtőzködés Égyiptom árnyékában gyalázatotokra.
౩కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.
4 Mert már Zoánban voltak fejedelmei, és követei Hánesig érkezének.
౪ఇశ్రాయేలు ప్రజల అధిపతులు సోయనులో ఉన్నారు. వాళ్ళ రాయబారులు హానేసులో ప్రవేశించారు.
5 Megszégyenülnek mind a nép miatt, a mely nem használ nékik, a mely nem segít és nem használ, sőt szégyenökre és gyalázatukra lesz!
౫కానీ వాళ్లకి సహాయం చేసేవాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండకపోవడం చూసి వాళ్లందరూ సిగ్గుపడి పోతారు. ఉన్నవాళ్ళు సహాయంగానూ, మద్దతుగానూ ఉండకపోగా సిగ్గుగానూ అవమానంగానూ ఉంటారు.”
6 Jövendölés dél barma ellen: A nyomor és szorongatás földén keresztül, a honnan nőstény és hím oroszlán és viperák és szárnyas sárkányok jőnek ki; viszik szamárcsikók hátán gazdagságukat, és a tevéknek púpján kincsöket a népnek, a mely pedig nem használ.
౬దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.
7 Hitvány és üres Égyiptom segítsége, ezért nevezem őt nagyszájúnak, a ki veszteg ül,
౭ఎందుకంటే ఐగుప్తు చేసే సహాయం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను దానికి పనీ పాటా లేకుండా కూర్చునే రాహాబు. అనే పేరు పెడుతున్నా.
8 Most menj, írd ezt táblára nálok, és jegyezd föl könyvbe ezt, hogy megmaradjon az utolsó napra bizonyságul örökre.
౮భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు.
9 Mert pártütő nép ez, apát megtagadó fiak, fiak, kik nem akarják hallani az Úr törvényét;
౯వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.
10 Kik ezt mondják a látóknak: Ne lássatok; és a prófétáknak: Ne prófétáljatok nékünk igazat, beszéljetek kedvünk szerint valókat, prófétáljatok csalárdságokat!
౧౦దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
11 Hagyjátok el az útat, térjetek le már ez ösvényről, vigyétek el előlünk Izráelnek Szentjét!
౧౧మా దారికి అడ్డం రావద్దు. మా మార్గం నుండి తొలగి పొండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తవద్దు” అని అంటారు.
12 Azért így szól Izráel Szentje: Mivel megútáltátok e beszédet, és bíztok a nyomorgatásban és a hamisságban, és ezekre támaszkodtok:
౧౨కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు ఈ మాటని తిరస్కరించి అణచివేతనూ, మోసాన్నీ నమ్ముకున్నారు. వాటి పైనే ఆధారపడ్డారు.
13 Azért e bűn olyan lesz tinéktek, mint a leesendő falhasadék, a mely már kiáll a magas kőfalon, a melynek aztán nagy hirtelen jő el romlása;
౧౩కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.
14 És romlása olyan lesz, mint a fazekasok edényének romlása, a mely kimélés nélkül eltöretik, és nem találni töredéki közt oly cserepet, a melyen tűzhelyről tüzet lehetne vinni, avagy vizet meríteni a tócsából.
౧౪కుమ్మరి చేసిన మట్టి కుండ పగిలినట్టు ఆయన దాన్ని పగలగొడతాడు. దాన్ని ఆయన విడిచి పెట్టడు. దాని ముక్కల్లో ఒక్క పెంకు కూడా పొయ్యిలో నుండి నిప్పు కణికలను తీయడానికి గానీ కుండలో నుండి నీళ్ళుతోడటానికి గానీ పనికి రాదు.
15 Mert így szól az Úr Isten, Izráelnek Szentje: Megtérve és megnyugodva megmaradhattatok volna; csöndességben és reménységben erősségtek lett volna; de ti nem akarátok;
౧౫ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడూ ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “మీరు తిరిగి వచ్చి విశ్రాంతిగా నాలో ఉంటేనే రక్షణ పొందుతారు. మౌనంలోనూ, విశ్వాసంలోనూ మాత్రమే మీకు బలం కలుగుతుంది.” కానీ దానికి మీరు ఒప్పుకోలేదు.
16 Hanem ezt mondátok: Nem, sőt lóra ülvén, futunk; ezért futnotok kell; és gyors paripán elvágtatunk; ezért gyorsak lesznek üldözőitek.
౧౬“అలా కాదు. మేం గుర్రాలెక్కి పారిపోతాం” అన్నారు. కాబట్టి మీరు పారిపోతారు. ఇంకా “వేగంగా పరుగుతీసే గుర్రాలపై స్వారీ చేస్తాం” అన్నారు. కాబట్టి మిమ్మల్ని తరిమే వాళ్ళు ఇంకా వేగంగా వస్తారు.
17 Ezer fut egynek riasztására, ötnek riasztására mind elfuttok, mígnem úgy maradtok, mint egy szál fenyő a hegytetőn, mint egy zászló a halmon.
౧౭మీలో మిగిలి ఉన్న వాళ్ళు ఏదో పర్వతంపై ఒక జెండా కర్రగానో, లేదా ఏదో కొండపై జెండా గానో మిగిలే దాకా మీరు ఒక్కడికి భయపడి వెయ్యి మంది పారిపోతారు. ఐదుగురి భయం చేత మీరంతా పారిపోతారు.
18 S azért vár az Úr, hogy könyörüljön rajtatok, és azért felséges ő, hogy megkegyelmezzen néktek, mert az ítélet Istene az Úr; boldogok mindazok, a kik Őt szolgálják.
౧౮అయినా మీపై దయ కనపరచాలని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళు ధన్యులు.
19 Mert te nép, mely Sionon Jeruzsálemben lakol, nem fogsz te sírni többé, bizton könyörül rajtad Ő kiáltásod szavára, mihelyt meghallja, megfelel néked;
౧౯ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు. నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు.
20 És ad néktek az Úr kenyeret a keserűségben, és a nyomorban vizet, és nem kell többé elrejtőzködniök tanítóidnak, hanem szemeid tanítóidra néznek!
౨౦యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు.
21 És füleid meghallják a kiáltó szót mögötted: ez az út, ezen járjatok; ha jobbra és ha balra elhajoltok.
౨౧మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు.
22 És megútáljátok megezüstözött bálványaitokat és megaranyozott képeiteket; kiszórod őket, mint az undokságot: ki innen! szólsz nékik.
౨౨వెండితో పోత పోసిన చెక్కిన బొమ్మలనూ, బంగారంతో పోత పోసిన విగ్రహాలనూ మీరు అపవిత్రం చేస్తారు. అసహ్యమైన గుడ్డగా వాటిని భావిస్తారు. “ఇక్కడ నుండి పో” అని వాటికి చెప్తారు.
23 És ad esőt a magra, a melylyel a földet beveted, és a kenyér, a föld termése, bő és tápláló lesz, és széles mezőn legelnek nyájaid ama napon.
౨౩నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి.
24 A barmok és a szamarak, a melyek a földet szántják, sózott abrakkal élnek, a melyet megszórtak lapáttal és villával.
౨౪భూమిని సేద్యం చేయడానికి సహాయం చేసే ఎద్దులూ, గాడిదలూ పార, జల్లెడలతో చెరిగిన ధాన్యాన్ని మేతగా తింటాయి.
25 És lesznek minden magas hegyen és emelkedettebb halmon patakok, folyamok a nagy öldöklés napján, mikor a tornyok leomlanak.
౨౫గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి.
26 És a holdnak fénye olyan lesz, mint a napnak fénye, és a napnak fénye hétszer nagyobb lesz, olyan, mint hét napnak napfénye; ama napon, a melyen az Úr beköti népe romlását, és vereségének sebét meggyógyítja!
౨౬చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.
27 Ímé, az Úr neve jő messziről, haragja ég és sötét gomolygó füstje; ajkai rakvák haraggal, és nyelve, mint emésztő tűz!
౨౭చూడండి! ఆయన ఆగ్రహంతో మండిపోతూ దట్టమైన పొగతో యెహోవా పేరు దూరం నుండి వస్తూ ఉంది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి పోయాయి. ఆయన నాలుక దహించే అగ్ని జ్వాలలా ఉంది.
28 Lehellete, mint megáradott patak, a mely torkig ér, hogy megrostálja a népeket pusztulás rostájában, és tévelygés zabláját vesse a népségek szájába.
౨౮ఆయన శ్వాస గొంతు వరకూ వచ్చిన బలమైన నదీ ప్రవాహంలా ఉంది. అది నాశనం చేసే జల్లెడలా జాతులను జల్లెడ పడుతుంది. ఆయన శ్వాస జాతుల దవడల్లో కళ్ళెంలా ఉండి వాళ్ళని దారి తప్పిస్తుంది.
29 És fölzendül éneketek, mint a szent ünnepnek éjszakáján, és örvendez szívetek, mint azé, a ki sípolva megy az Úr hegyére, Izráel kőszálához.
౨౯పండగ ఆచరించేటప్పుడు రాత్రి వేళ మీరు పాట పాడుతారు. ఇశ్రాయేలుకి ఆశ్రయ దుర్గమైన యెహోవా పర్వతానికి ఒక వ్యక్తి పిల్లనగ్రోవి వాయిస్తూ ప్రయాణం చేసేటప్పుడు కలిగే ఆనందం వంటిది వారి హృదయంలో కలుగుతుంది.
30 És megzendíti az Úr dicsőséges szavát, karjának lesujtását megmutatja megbúsult haragjában és emésztő tűz lángjában, vízáradással, zivatarral és jégeső kövével.
౩౦యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు.
31 Mert az Úrnak szavától megretten Assiria, veri azt akkor vesszővel;
౩౧యెహోవా స్వరం విని అష్షూరు ముక్కలైపోతుంది. ఆయన దాన్ని కర్రతో దండిస్తాడు.
32 És a büntető vessző minden sujtását, a melyet az Úr mérend reá, dobokkal és cziterákkal fogjátok kisérni, és Ő kezét fel-felemelvén, harczol ellene.
౩౨యెహోవా తాను నియమించిన కర్రతో అష్షూరు పై వేసే ప్రతి దెబ్బా, ఆయన వాళ్ళతో యుద్ధం చేస్తుండగా, తంబురాల, సితారాల సంగీతంతో కలసి ఉంటుంది.
33 Mert készen van a szörnyű tűzhely régen, készen áll az már a királynak is, mélyen és szélesen csinálta azt, máglyájában tűz és fa bőven; az Úr fuvallata gyújtja meg azt, mint kénköves patak.
౩౩తగలబెట్టే స్థలం చాలా కాలం కిందే సిద్ధం అయి ఉంది. నిజంగా రాజు కోసం సిద్ధం అయింది. దాన్ని దేవుడు లోతుగా, విశాలంగా చేశాడు. తగలబెట్టడానికి మంటలు, విస్తారంగా కట్టెలు సిద్ధంగా ఉన్నాయి. యెహోవా శ్వాస గంధక ప్రవాహంలా దాన్ని తగలబెడుతుంది.