< Hóseás 14 >
1 Térj vissza hát Izráel az Úrhoz, a te Istenedhez, mert elbuktál álnokságod miatt!
౧ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.
2 Vigyetek veletek beszédeket, és térjetek vissza az Úrhoz! Mondjátok néki: Végy el minden álnokságot! És fogadd el azt, a mi jó, és ajkaink tulkaival áldozunk néked.
౨ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.
3 Assiria nem segít meg minket; lóra sem ülünk, és nem mondjuk többé kezeink csinálmányának: Istenünk! Mert nálad talál kegyelmet az árva.
౩అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు. మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము. ‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”
4 Kigyógyítom őket hűtlenségökből; szeretem őket ingyen kegyelemből, mert elfordult tőlök az én haragom.
౪వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను. వారి మీదనున్న నా కోపం చల్లారింది. మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.
5 Olyanná leszek Izráelnek, mint a harmat. Virágozni fog, mint a liliom, és gyökeret ver, mint a Libánon.
౫చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
6 Kiterjednek az ő ágai, és olyan lesz az ő ékessége, mint az olajfáé, illata pedig, mint a Libánoné.
౬అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.
7 Visszatérnek az ő árnyékában lakók, és felelevenednek, mint a búzamag, és virágoznak, mint a szőlőtő; híre olyan lesz, mint Libánon boráé.
౭అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు. ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.
8 Efraim így szól: Mi közöm nékem többé a bálványokhoz?! Én meghallgatom és figyelek reá. Olyan vagyok, mint a zöldelő cziprusfa! Tőlem származik a te gyümölcsöd!
౮ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?” నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను. నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను. నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి. నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.
9 Kicsoda a bölcs, hogy értse ezeket? Kicsoda az értelmes, hogy eszébe vegye ezeket?! Bizony igazak az Úrnak útai, és az igazak járnak azokon, az istentelenek pedig elesnek rajtok.
౯ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.