< 1 Mózes 32 >
1 Jákób tovább méne az ő útján, és szembe jövének vele az Isten Angyalai.
౧యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు.
2 És monda Jákób mikor azokat látja vala: Isten tábora ez; és nevezé annak a helynek nevét Mahanáimnak.
౨యాకోబు వారిని చూసి “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు.
3 Azután külde Jákób követeket maga előtt Ézsaúhoz az ő bátyjához, Széir földébe, Edóm mezőségébe,
౩యాకోబు ఎదోము ప్రాంతంలో, అంటే శేయీరు దేశంలో ఉన్న తన సోదరుడు ఏశావు దగ్గరికి తనకు ముందుగా దూతలను పంపి,
4 És parancsola azoknak mondván: Így szóljatok az én uramnak Ézsaúnak: Ezt mondja a te szolgád Jákób: Lábánnál tartózkodtam és időztem mind ekkorig.
౪“మీరు నా ప్రభువైన ఏశావుతో, ‘ఇంతవరకూ నేను లాబాను దగ్గర నివసించాను.
5 Vannak pedig nékem ökreim és szamaraim, juhaim, szolgáim és szolgálóim, azért híradásul követséget küldök az én uramhoz, hogy kedvet találjak szemeid előtt.
౫నాకు పశువులూ గాడిదలూ మందలూ దాసదాసీజనమూ ఉన్నారు. నీ అనుగ్రహం నాపైనఉండాలని నా ప్రభువుకు తెలపడానికి పంపాను అని నీ సేవకుడైన యాకోబు అన్నాడు’ అని చెప్పండి” అని వారికి ఆజ్ఞాపించాడు.
6 És megtérének Jákóbhoz a követek, mondván: Elmentünk vala a te atyádfiához Ézsaúhoz, és már jön is elődbe, és négyszáz férfi van vele.
౬ఆ దూతలు యాకోబు దగ్గరికి తిరిగివచ్చి “మేము నీ సోదరుడైన ఏశావు దగ్గరికి వెళ్ళాం, అతడు నాలుగు వందల మందితో నీకు ఎదురు వస్తున్నాడు” అని చెప్పారు.
7 Igen megíjede Jákób és féltében a népet, mely vele vala, a juhokat, a barmokat és a tevéket két seregre osztá.
౭అప్పుడు యాకోబు చాలా భయపడి, హతాశుడై,
8 És monda: Ha eljön Ézsaú az egyik seregre, és azt levágja, a hátramaradt sereg megszabadul.
౮“ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతం చేస్తే మిగిలిన గుంపు తప్పించుకుని పోవచ్చు” అనుకుని, తనతో ఉన్న ప్రజలనూ మందలనూ పశువులనూ ఒంటెలనూ రెండు గుంపులు చేశాడు.
9 És monda Jákób: Óh én atyámnak Ábrahámnak Istene, és én atyámnak Izsáknak Istene, Jehova! ki azt mondád nékem: Térj vissza hazádba, a te rokonságod közé, s jól tészek veled:
౯అప్పుడు యాకోబు “నా తండ్రి అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, ‘నీ దేశానికీ, నీ బంధువుల దగ్గరికీ తిరిగి వెళ్ళు, నీకు మేలు చేస్తాను’ అని నాతో చెప్పిన యెహోవా,
10 Kisebb vagyok minden te jótéteményednél és minden te hűségednél, a melyeket a te szolgáddal cselekedtél; mert csak pálczámmal mentem vala által ezen a Jordánon, most pedig két sereggé lettem.
౧౦నువ్వు నీ సేవకుడికి చేసిన ఉపకారాలన్నిటికీ నమ్మకత్వమంతటికీ నేను పాత్రుణ్ణి కాను. ఎందుకంటే, కేవలం ఈ నా చేతి కర్రతో ఈ యొర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను.
11 Szabadíts meg, kérlek, engem az én bátyám kezéből, Ézsaú kezéből; mert félek ő tőle, hogy rajtam üt és levág engem, az anyát a fiakkal egybe.
౧౧నా సోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలనీ వారి తల్లులనూ నన్నూ చంపుతాడేమో అని భయపడుతున్నాను.
12 Te pedig azt mondottad: Jól tévén jól tészek te veled, és a te magodat olyanná tészem mint a tenger fövénye, mely meg nem számláltathatik sokasága miatt.
౧౨నాతో, ‘నేను నీకు తోడై తప్పకుండా మేలు చేస్తూ వారి సంఖ్యను బట్టి లెక్కించలేని సముద్రపు ఇసకలాగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను’ అని నువ్వు సెలవిచ్చావు కదా” అన్నాడు.
13 És ott hála azon éjjel: és választa abból, a mi kezénél vala, ajándékot Ézsaúnak az ő bátyjának:
౧౩అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న ఏశావు కోసం ఒక కానుకను సిద్ధం చేశాడు.
14 Kétszáz kecskét, és húsz bakot; kétszáz juhot, és húsz kost;
౧౪అతడు రెండువందల మేకలూ ఇరవై మేక పోతులూ రెండువందల గొర్రెలూ ఇరవై పొట్టేళ్ళూ
15 Harmincz szoptatós tevét s azok fiait; negyven tehenet, és tíz tulkot: húsz nőstény szamarat, és tíz szamár vemhet.
౧౫ముప్ఫై పాడి ఒంటెలూ వాటి పిల్లలూ నలభై ఆవులూ పది ఆబోతులూ ఇరవై ఆడ గాడిదలూ పది గాడిద పిల్లలూ తీసుకు మందమందను వేరు వేరుగా ఉంచాడు.
16 És szolgái kezébe adá, minden nyájat külön-külön, és monda az ő szolgáinak: Menjetek el én előttem, és közt hagyjatok nyáj és nyáj között.
౧౬వాటిని అతడు తన దాసులకు అప్పగించి “మీరు మంద మందకు మధ్య ఖాళీ ఉంచి నాకంటే ముందుగా నడవండి” అని వారితో చెప్పాడు.
17 És parancsola az elsőnek, mondván: Ha az én bátyám Ézsaú előtalál és megkérdez téged, mondván: Ki embere vagy? Hová mégy? És kiéi ezek előtted?
౧౭వారిలో మొదటివాడితో “నా సోదరుడు ఏశావు నీకు ఎదురుగా వచ్చి, ‘నీవెవరి వాడివి? ఎక్కడికి వెళ్తున్నావు? నీ ముందు ఉన్నవి ఎవరివి?’ అని నిన్ను అడిగితే
18 Akkor azt mondjad: Szolgádé Jákóbé; ajándék az, a melyet küld az én uramnak Ézsaúnak, és ímé ő maga is jön utánunk.
౧౮నువ్వు, ‘ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కోసం అతడు పంపిన కానుక. అదిగో అతడు మా వెనక వస్తున్నాడు’ అని చెప్పు” అని ఆజ్ఞాపించాడు.
19 Ugyanazt parancsolá a másiknak, a harmadiknak, és mindazoknak, kik a nyájak után mennek vala, mondván: Ilyen szóval szóljatok Ézsaúnak, mikor vele találkoztok.
౧౯“నేను ముందుగా పంపుతున్న కానుకల వలన అతనిని శాంతింపజేసిన తరువాత నేను అతనికి కనబడతాను. అప్పుడతడు ఒకవేళ నా పైన దయ చూపుతాడేమో.
20 Ezt is mondjátok: Ímé Jákób a te szolgád utánunk jő; mert így gondolkodik vala: Megengesztelem őt az ajándékkal, mely előttem megy, és azután leszek szembe vele, talán kedves lesz személyem előtte.
౨౦కాబట్టి మీరు ఏశావును చూసి, ‘ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనకాలే వస్తున్నాడు’ అని చెప్పాలి” అని వారికి చెప్పాడు. రెండవ గుంపుకు, మూడవ గుంపుకు, మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ అతడు ఇదే విధంగా ఆజ్ఞాపించాడు.
21 Előlméne tehát az ajándék; ő pedig azon éjjel a seregnél hála.
౨౧అతడు ఆ కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు.
22 Felkele pedig ő azon éjszaka és vevé két feleségét, két szolgálóját és tizenegy gyermekét, és általméne a Jabbók révén.
౨౨ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలనూ తన ఇద్దరు దాసీలనీ తన పదకొండు మంది పిల్లలనూ తీసుకు యబ్బోకు రేవు దాటిపోయాడు.
23 Vevé hát azokat és átköltözteté a vízen, azután átköltözteté mindenét valamije vala.
౨౩యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు.
24 Jákób pedig egyedűl marada és tusakodik vala ő vele egy férfiú, egész a hajnal feljöveteléig.
౨౪యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.
25 Aki mikor látá, hogy nem vehet rajta erőt, megilleté csípőjének forgócsontját, és kiméne helyéből Jákób csípőjének forgócsontja a vele való tusakodás közben.
౨౫తాను గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడ్డం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది.
26 És monda: Bocsáss el engem, mert feljött a hajnal. És monda Jákób: Nem bocsátlak el téged, míg meg nem áldasz engemet.
౨౬ఆయన “తెల్లవారుతున్నది, నన్ను పోనియ్యి” అన్నప్పుడు, యాకోబు “నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనియ్యను” అన్నాడు.
27 És monda néki: Mi a te neved? És ő monda: Jákób.
౨౭ఆయన “నీ పేరేమిటి?” అని అడిగాడు. అతడు “యాకోబు” అని చెప్పాడు.
28 Amaz pedig monda: Nem Jákóbnak mondatik ezután a te neved, hanem Izráelnek; mert küzdöttél Istennel és emberekkel, és győztél.
౨౮అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.
29 És megkérdé Jákób, és monda: Mondd meg, kérlek, a te nevedet. Az pedig monda: Ugyan miért kérded az én nevemet? És megáldá őt ott.
౨౯అప్పుడు యాకోబు “దయచేసి నీ పేరు చెప్పు” అన్నాడు. అందుకాయన “నా పేరు ఎందుకు అడుగుతావు?” అని చెప్పి అక్కడ అతణ్ణి ఆశీర్వదించాడు.
30 Nevezé azért Jákób annak a helynek nevét Peniélnek: mert látám az Istent színről színre, és megszabadult az én lelkem.
౩౦యాకోబు “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది” అని ఆ స్థలానికి “పెనూయేలు” అని పేరు పెట్టాడు.
31 És a nap felkél vala rajta, amint elméne Peniél mellett, ő pedig sántít vala csípőjére.
౩౧అతడు పెనూయేలు నుండి బయలుదేరి నప్పుడు సూర్యోదయం అయ్యింది. అతడు తొడ కుంటుతూ నడిచాడు.
32 Azért nem eszik Izráel fiai a csípő forgócsontjának inahúsát mind e mai napig, mivelhogy illetve vala Jákób csípője forgócsontjának inahúsa.
౩౨ఆయన యాకోబు తొడగూటి మీది తుంటినరంపై కొట్టి గూడు వసిలేలా చేసాడు కాబట్టి ఈనాటి వరకూ ఇశ్రాయేలీయులు తొడ గూటి మీద ఉన్న తుంటినరాన్ని తినరు.