< Ezékiel 39 >
1 És te, embernek fia, prófétálj Góg ellen, és mondjad: Így szól az Úr Isten: Ímé, én ellened megyek Góg, Rós, Mések és Tubál fejedelme!
౧నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
2 És elcsalogatlak és vezetgetlek, és felhozlak messze északról, és beviszlek Izráel hegyeire.
౨నిన్ను వెనక్కి తిప్పి నడిపించి దూరంగా ఉత్తరాన ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతాలకు రప్పిస్తాను.
3 És kiütöm kézívedet balkezedből, és nyilaidat jobbkezedből kiejtem.
౩నీ ఎడమ చేతిలో ఉన్న వింటిని, కుడిచేతిలో ఉన్న బాణాలను కింద పడేలా చేస్తాను.
4 Izráel hegyein esel el te és minden sereged és a népek, melyek veled lesznek; a ragadozó madaraknak, minden szárnyas állatnak és a mezei vadaknak adtalak eledelül.
౪నువ్వూ నీ సైన్యమూ నీతో ఉన్న ప్రజలంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. నువ్వు నానా విధాలైన పక్షులకు, క్రూర జంతువులకు ఆహారమవుతావు.
5 A mező színén esel el, mert én szóltam, ezt mondja az Úr Isten.
౫నువ్వు నేల మీద పడి చనిపోతావు. ఈ మాట నేనే చెబుతున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
6 És bocsátok tüzet Mágógra és azokra, a kik a szigeteken bátorságosan laknak, hogy megtudják, hogy én vagyok az Úr.
౬ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.
7 És az én szent nevemet megismertetem az én népem, Izráel között, s többé nem hagyom megfertéztetni szent nevemet; és megtudják a pogányok, hogy én, az Úr, szent vagyok Izráelben!
౭నేను యెహోవానని అన్యజనాలు తెలుసుకొనేలా ఇక నా పవిత్రమైన పేరుకు నింద రాకుండా, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య దాన్ని వెల్లడిస్తాను.
8 Ímé, eljött és meglett, ezt mondja az Úr Isten; ez az a nap, a melyről szólottam.
౮ఇదిగో అది రాబోతుంది. నేను చెప్పిన సమయంలో అది తప్పక జరుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9 És kimennek Izráel városainak lakói, és feltüzelik és felégetik a fegyvereket s a kis és nagy paizsokat, a kézívet és a nyilakat és a kézbeli pálczákat és dárdákat, és tüzelnek velök hét esztendeig.
౯ఇశ్రాయేలీయుల పట్టణాల్లో నివసించేవారు ఆ కవచాలనూ డాళ్లనూ చిన్న డాళ్లనూ విండ్లనూ బాణాలనూ గదలనూ ఈటెలనూ తీసుకుని పొయ్యిలో కాలుస్తారు. అవి ఏడు సంవత్సరాలపాటు మండుతాయి.
10 És fát nem hordanak a mezőről, sem az erdőkről nem vágnak, hanem a fegyverekből tüzelnek, és zsákmányt vetnek zsákmányolóikban, s prédálóikat elprédálják, ezt mondja az Úr Isten.
౧౦ఇక వారు బయటికెళ్ళి కట్టెలు ఏరుకోవడం, అడవుల్లో కలప నరకడం అవసరం ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తూ ఉంటారు. తమను దోచుకొన్న వారిని తామే దోచుకుంటారు. తమ సొమ్ము కొల్లగొట్టిన వారి సొమ్ము తామే కొల్లగొడతారు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
11 És lészen azon a napon, hogy adok Gógnak helyet, hol temetője legyen Izráelben, a vándorok völgyét keletre a tengertől, ez fogja bezárni e vándor népséget; és ott temetik el Gógot és minden gyülevészét, és nevezik Góg gyülevésze völgyének.
౧౧“ఆ రోజుల్లో గోగువారిని పాతిపెట్టడం కోసం ఇశ్రాయేలు దేశంలో సముద్రానికి తూర్పుగా ప్రజలు ప్రయాణించే లోయలో నేనొక స్థలం ఏర్పాటు చేస్తాను. గోగును, అతని సైన్యాన్ని పాతిపెట్టినప్పుడు ఇక ప్రజలు ప్రయాణించడానికి వీలు ఉండదు. ఆ లోయకు హమోన్గోగు అనే పేరు పెడతారు.
12 És eltemeti őket Izráel háza, hogy a földet megtisztítsa, hét álló hónapig.
౧౨దేశాన్ని శుద్ధీకరిస్తూ వారిని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులకు ఏడు నెలలు పడుతుంది.
13 És temetni fog az ország egész népe, s lészen ez nékik dicsőségökre a napon, melyen megdicsőítem magamat, ezt mondja az Úr Isten.
౧౩ఆ దేశ ప్రజలంతా వారిని పాతిపెట్టగా నేను ఘనత పొందినపుడు ఆ ప్రజలు కూడా పేరు పొందుతారు. ఇదే యెహోవా వాక్కు.
14 És választanak embereket, kik a földet szüntelen bejárják, temetgetvén ama vándor népséget, azokat, kik még a föld színén maradtak, hogy azt megtisztítsák. Hét hónap mulva indulnak keresni.
౧౪దేశాన్ని శుద్ధీకరించడానికీ ఆ కళేబరాలను పాతిపెట్టడానికీ సంచారం చేస్తూ వెళ్ళి అక్కడక్కడా పడి ఉన్న శవాలను పాతిపెట్టడానికీ పనివారిని నియమిస్తారు. వారు ఆ పని ఏడు నెలల తరువాత చేస్తారు.
15 És bejárják e járók a földet, és ha ki embertetemet lát, jelt állít melléje, míg a temetgetők eltemetik azt a Góg gyülevésze völgyében.
౧౫దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.
16 És egy városnak is Hamóna lesz a neve, és megtisztítják a földet.
౧౬హమోనా అనే పేరుతో ఒక పట్టణం ఉంటుంది. ఈవిధంగా వారు దేశాన్ని శుద్ధీకరిస్తారు.”
17 És te, embernek fia, így szól az Isten, mondjad a madaraknak, minden szárnyas állatnak és minden mezei vadnak: Gyűljetek egybe és jőjjetek el, seregeljetek egybe mindenfelől az én áldozatomra, mert én nagy áldozatot szerzek néktek Izráel hegyein, és egyetek húst és igyatok vért!
౧౭“నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, అన్ని జాతుల పక్షులకు, జంతువులకు ఈ కబురు పంపించు, ఇశ్రాయేలు పర్వతాల మీద నేను మీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప బలికి నలుదిక్కుల నుండి బయలుదేరి రండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.
18 Vitézek húsát egyétek, s a föld fejedelmeinek vérét igyátok, kosok, bárányok és bakok, bikák, Básánban hízottak mindnyájan;
౧౮బలిష్టుల మాంసం తింటారు. రాజుల రక్తమూ బాషానులో బలిసిన పొట్లేళ్ళ, గొర్రెపిల్లల, మేకల, కోడెల రక్తమూ తాగుతారు.
19 S egyetek kövérséget jóllakásig, és igyatok vért megrészegedésig az én áldozatomból, a melyet szerzek néktek;
౧౯మీరు సంతృప్తిగా కొవ్వు తింటారు, మత్తులో మునిగిపోయేటంతగా రక్తం తాగుతారు. ఇది నేను మీ కోసం వధించే బలి.
20 És lakjatok jól az én asztalomnál lovakból és paripákból, vitézekből és minden hadakozó férfiakból, ezt mondja az Úr Isten.
౨౦నేను ఏర్పాటు చేసిన బల్లపై కూర్చుని గుర్రాలను, రౌతులను, బలిష్టులను, సైనికులను మీరు కడుపు నిండుగా తింటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
21 És megmutatom az én dicsőségemet a pogányok között, és meglátják mindazok a pogányok az én ítéletemet, melyet cselekedtem, és az én kezemet, melyet rájok vetettem.
౨౧నా గొప్పతనాన్ని అన్యజనాల్లో వెల్లడి చేస్తాను. నేను జరిగించిన శిక్షను, వారిపై నా హస్తాన్ని అన్యజనాలంతా చూస్తారు.
22 És megtudja Izráel háza, hogy én vagyok az Úr, az ő Istenök, attól a naptól fogva és azután.
౨౨ఆ రోజునుండి నేనే తమ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలీయులు గ్రహిస్తారు.
23 És megtudják a pogányok, hogy az ő vétke miatt vitetett fogságra Izráel háza, mivelhogy elpártolt tőlem, s én elrejtettem orczámat tőle; azért adtam őt ellenségei kezébe, és hullottak el fegyver miatt mindnyájan.
౨౩ఇశ్రాయేలీయులు వారి దోషాన్ని బట్టే చెరలోకి వెళ్ళారనీ నా పట్ల వారు చేసిన ద్రోహాన్ని బట్టే నేను వారికి విరోధినై వారు కత్తిపాలయ్యేలా, బందీలుగా మారేలా చేశాననీ అన్యజనాలు తెలుసుకుంటారు.
24 Az ő tisztátalanságuk s bűneik szerint cselekedtem velök, és elrejtettem orczámat tőlök.
౨౪వారి అపవిత్రత, అకృత్యాల వల్లనే నేను వారికి విరోధినై వారిపై ప్రతికారం చేశాను.
25 Azért így szól az Úr Isten: Most már haza hozom Jákób foglyait, és megkegyelmezek Izráel egész házának, s féltő szerelemre gyulladok szent nevemért.
౨౫కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా పవిత్రమైన పేరును బట్టి రోషంతో యాకోబు సంతానాన్ని చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. ఇశ్రాయేలీయుల మీద జాలి చూపుతాను.
26 És elfelejtik gyalázatukat és minden vétköket, melylyel vétkeztek ellenem, mikor laknak földjökön bátorságosan, és őket senki sem rettegteti.
౨౬వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లో నుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.
27 Mikor visszahozom őket a népek közül, és egybegyűjtöm őket ellenségeik földjeiről, akkor megszentelem magamat bennök sok nép szeme láttára.
౨౭అప్పుడు అనేకమంది అన్యజనాల మధ్య వారిలో నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను.
28 És megtudják, hogy én vagyok az Úr, az ő Istenök, ki fogságra vittem őket a pogányok közé, majd egybegyűjtém őket földjökre, és senkit közülök többé ott nem hagyok.
౨౮వారిని అన్యజనాల్లోకి చెరగా పంపి, వారిని అక్కడే ఉంచకుండా తిరిగి తమ దేశానికి సమకూర్చినదాన్ని బట్టి నేను తమ దేవుడైన యెహోవానని వారు తెలుసుకుంటారు.
29 És többé el nem rejtem orczámat tőlök, mivelhogy kiöntöttem lelkemet Izráel házára, ezt mondja az Úr Isten.
౨౯అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక ఎన్నటికీ వారికి నా ముఖం చాటు చేయను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.