< 5 Mózes 9 >
1 Halljad Izráel, te általmégy ma a Jordánon, hogy bemenvén, örökségül bírj náladnál nagyobb és erősebb népeket, nagy és az égig megerősített városokat;
౧“ఇశ్రాయేలూ విను. మీకంటే ఎక్కువ బలం ఉన్న ప్రజలు, ఆకాశాన్నంటే ప్రాకారాలు ఉన్న గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకోడానికి ఈ రోజు మీరు యొర్దాను నది దాటబోతున్నారు.
2 Nagy és szálas népet, Anák-fiakat, a kikről magad is tudod és magad is hallottad: kicsoda állhat meg Anák fiai előtt?
౨ఆ ప్రజలు గొప్పవారు, పొడవైన దేహాలు గలవారు, మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. ‘అనాకీయులను ఎవరూ ఎదిరించలేరు’ అనే మాట మీరు విన్నారు కదా.
3 Tudd meg azért e mai napon, hogy az Úr, a te Istened az, a ki átmegy előtted mint emésztő tűz, ő törli el azokat, és ő alázza meg azokat te előtted; és kiűzöd, és hamar elveszted őket, a miképen az Úr megmondotta néked.
౩కాబట్టి మీ యెహోవా దేవుడు తానే దహించే అగ్నిలాగా మీకు ముందుగా దాటిపోతున్నాడని మీరు తెలుసుకోవాలి. ఆయన వారిని నాశనం చేసి మీ ఎదుట వారిని కూలదోస్తాడు. యెహోవా మీతో చెప్పినట్టు మీరు వారిని వెళ్ల గొట్టి త్వరగా వారిని నాశనం చేస్తారు
4 Mikor azért kiűzi az Úr, a te Istened azokat te előled, ne szólj a te szívedben, mondván: Az én igazságomért hozott be engem az Úr, hogy örökségül bírjam ezt a földet; holott e népeket az ő istentelenségökért űzi ki te előled az Úr;
౪మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరవాత ‘మేము ఈ దేశాన్ని స్వాధీనం చేసుకునేలా యెహోవా మా నీతిని బట్టి మమ్మల్ని దీనిలో ప్రవేశపెట్టాడు’ అని అనుకోవద్దు. ఈ ప్రజల దుష్టత్వాన్ని బట్టి యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడుతున్నాడు.
5 Nem a te igazságodért, sem a te szívednek igaz voltáért mégy te be az ő földük bírására; hanem az Úr, a te Istened e népeknek istentelenségéért űzi ki őket előled, hogy megerősítse az ígéretet, a mely felől megesküdt az Úr a te atyáidnak: Ábrahámnak, Izsáknak és Jákóbnak.
౫మీరు వారి దేశానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకోడానికి కారణం మీ నీతి గానీ మీ హృదయంలో ఉన్న యథార్థత గానీ కాదు. ఈ ప్రజల చెడుతనం వల్లనే యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన వారిని మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్నాడు.
6 Tudd meg azért, hogy az Úr, a te Istened nem a te igazságodért adja néked ezt a jó földet birtokul, mert kemény nyakú nép vagy te!
౬మీ యెహోవా దేవుడు మీకు ఈ మంచి దేశాన్ని స్వాధీనం చేయడం మీ నీతిని బట్టి కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మూర్ఖులైన ప్రజలు.
7 Emlékezzél meg róla, és el ne felejtsed azokat, a mikkel haragra indítottad az Urat, a te Istenedet a pusztában! A naptól fogva, a melyen kijöttél Égyiptom földéből, mind addig, míglen e helyre jutottatok, az Úr ellen tusakodtatok vala.
౭ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
8 Már a Hóreben haragra indítátok az Urat, és annyira megharaguvék reátok az Úr, hogy el akara veszteni titeket.
౮హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపం తెచ్చుకున్నాడు.
9 Mikor felmegyek vala a hegyre, hogy átvegyem a kőtáblákat, a szövetségnek tábláit, a melyet az Úr kötött vala veletek, és a hegyen maradtam vala negyven nap és negyven éjjel: kenyeret nem ettem, sem vizet nem ittam vala.
౯ఆ రాతి పలకలు, అంటే యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలు తీసుకోడానికి నేను కొండ ఎక్కినప్పుడు, అన్నపానాలు మాని అక్కడ నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను.
10 Akkor átadá nékem az Úr a két kőtáblát, a melyek az Isten ujjával valának beírva, és rajtok valának mind amaz ígék, a melyeket mondott vala az Úr néktek a hegyen a tűz közepéből, a gyülekezésnek napján.
౧౦అప్పుడు యెహోవా తన వేలితో రాసిన రెండు రాతి పలకలు నాకిచ్చాడు. మీరు సమావేశమైన రోజు ఆ కొండ మీద అగ్నిలో నుండి యెహోవా మీతో పలికిన మాటలన్నీ వాటి మీద ఉన్నాయి.
11 És mikor a negyven nap és negyven éj elmultával átadá az Úr nékem a két kőtáblát, a szövetségnek tábláit;
౧౧ఆ నలభై పగళ్లు, నలభై రాత్రుల తరువాత యెహోవా నిబంధన సంబంధమైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించి,
12 Akkor monda az Úr nékem: Kelj fel, hamar menj innen alá; mert elvetemedett a te néped, a kit kihoztál Égyiptomból; hamar eltértek az útról, a melyet parancsoltam vala nékik, öntött bálványt készítettek magoknak.
౧౨‘నువ్వు ఇక్కడ నుండి త్వరగా దిగి వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి రప్పించిన నీ ప్రజలు చెడిపోయి, నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తప్పిపోయి తమ కోసం పోత విగ్రహం చేసుకున్నారు’ అని నాతో చెప్పాడు.
13 Ismét szóla nékem az Úr, mondván: Láttam e népet, és bizony kemény nyakú nép ez!
౧౩యెహోవా ఇంకా ‘నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు.
14 Hagyj békét nékem, hadd pusztítsam el őket, és töröljem el az ő nevöket az ég alól, és teszlek téged ennél nagyobb és erősebb néppé!
౧౪నాకు అడ్డం రావద్దు. నేను వారిని నాశనం చేసి వారి పేరు ఆకాశం కింద లేకుండా తుడిచివేసి, నిన్ను వారికంటే బలమైన, విస్తారమైన జనంగా చేస్తాను’ అని నాతో చెప్పాడు.
15 Megfordulék azért, és alájövék a hegyről, a hegy pedig tűzzel ég vala, és a szövetségnek két táblája az én két kezemben vala.
౧౫నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి.
16 És mikor látám, hogy ímé vétkeztetek vala az Úr ellen, a ti Istenetek ellen; öntött borjút csináltatok vala magatoknak; hamar letértetek vala az útról, a melyet az Úr parancsolt vala néktek:
౧౬నేను చూసినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. దూడ పోత విగ్రహం చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి అప్పటికే తప్పిపోయారు.
17 Akkor megragadám a két táblát, és elhajítám a két kezemből, és összetörém azokat a ti szemeitek láttára.
౧౭అప్పుడు నేను ఆ రెండు పలకలను, నా రెండు చేతులతో మీ కళ్ళ ఎదుట కింద పడవేసి పగలగొట్టాను.
18 És leborulék az Úr előtt, mint annakelőtte, negyven nap és negyven éjjel, kenyeret nem ettem és vizet sem ittam; minden ti bűnötökért, a melyeket elkövettetek vala, azt cselekedvén, a mi gonosz az Úr előtt, hogy ingereljétek őt.
౧౮మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను.
19 Mert félek vala a haragtól és búsulástól, a melylyel ti reátok úgy megharagudt vala az Úr, hogy el akart vala pusztítani titeket. És meghallgata az Úr engem akkor is.
౧౯ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయాలన్నంత కోపగించిన యెహోవా మహోగ్రతను చూసి భయపడ్డాను. ఆ సమయంలో కూడా యెహోవా నా మనవి ఆలకించాడు.
20 Áronra is igen megharagudt vala az Úr, és el akará őt is pusztítani; de ugyanakkor imádkozám Áronért is.
౨౦అంతేగాక యెహోవా అహరోనుపై కోపపడి, అతణ్ణి నాశనం చేయడానికి చూసినప్పుడు నేను అప్పుడే అహరోను కోసం కూడా బతిమాలుకున్నాను.
21 A ti bűnötöket pedig, a borjút, a melyet készítettetek, megragadám, és megégetém azt tűzzel; és összetörém azt, jól megőrölvén, mígnem porrá morzsolódék, azután bevetém annak porát a patakba, a mely a hegyről foly vala alá.
౨౧అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే ఆ దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, ఆ కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ఆ ధూళిని పారపోశాను.
22 És Thaberában, Massában, és Kibrot-Taavában is haragra indítátok az Urat.
౨౨అంతేగాక మీరు తబేరాలో, మస్సాలో, కిబ్రోతు హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు.
23 És mikor az Úr elküldött vala titeket Kádes-Barneából, mondván: Menjetek fel, és bírjátok örökségül a földet, a melyet néktek adtam: akkor is tusakodtatok vala az Úrnak, a ti Isteneteknek beszéde ellen, nem hittetek néki, és nem hallgattatok az ő szavára.
౨౩యెహోవా ‘కాదేషు బర్నేయలో మీరు వెళ్లి నేను మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి’ అని మీతో చెప్పినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్మక ఆయన మాటకు ఎదురు తిరిగారు.
24 Tusakodók voltatok az Úr ellen, a mióta ismerlek titeket.
౨౪నేను మిమ్మల్ని ఎరిగిన రోజు నుండీ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
25 És leborulék az Úr előtt azon a negyven napon és negyven éjjel, a melyeken leborultam vala; mert azt mondotta vala az Úr, hogy elveszt titeket.
౨౫కాబట్టి నేను మునుపు సాగిలపడినట్టు యెహోవా సన్నిధిలో నలభై పగళ్లు, నలభై రాత్రులు సాగిలపడ్డాను. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తానని అన్నాడు.
26 Akkor imádkozám az Úrhoz, és mondék: Uram, Isten! ne rontsd meg a te népedet, és a te örökségedet, a kit a te nagyságoddal szabadítottál meg, a kit erős kézzel hoztál ki Égyiptomból.
౨౬నేను యెహోవాను ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్పాను ప్రభూ, యెహోవా, నువ్వు నీ మహిమ వలన విమోచించి, నీ బాహుబలంతో ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన ప్రజలను నాశనం చేయవద్దు.
27 Emlékezzél meg a te szolgáidról: Ábrahámról, Izsákról és Jákóbról; ne nézzed e népnek keménységét, istentelenségét és bűnét!
౨౭నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యాన్ని, వారి చెడుతనాన్ని, వారి పాపాన్ని చూడవద్దు.
28 Hogy ne mondja a föld népe, a honnét kihoztál minket: mivelhogy az Úr nem vihette be őket a földre, a melyet igért volt nékik, és mivelhogy gyűlölte őket, azért hozta ki őket, hogy megölje őket a pusztában.
౨౮ఎందుకంటే నువ్వు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించావో ఆ దేశస్థులు, యెహోవా తాను వారికి వాగ్దానం చేసిన దేశంలోకి వారిని చేర్చలేక, వారిపైని ద్వేషం వలన అరణ్యంలో చంపడానికి వారిని రప్పించాడని చెప్పుకుంటారేమో.
29 Pedig ők a te néped és a te örökséged, a melyet kihoztál a te nagy erőddel, és a te kinyujtott karoddal!
౨౯నువ్వు నీ మహాబలం చేత, చాపిన నీ బాహువు చేత రప్పించిన నీ స్వాస్థ్యమూ నీ ప్రజలూ వీరే.”