< Dániel 11 >
1 Én is a méd Dárius első esztendejében mellette állék, hogy őt támogassam és segítségére legyek.
౧మాదీయుడైన దర్యావేషు మొదటి సంవత్సరంలో మిఖాయేలును స్థిరపరచడానికి, బలపరచడానికి నేను అతని దగ్గర నిలబడ్డాను.
2 És most igazságot jelentek néked: Ímé, még három király támad Persiában, és a negyedik meggazdagul nagy gazdagsággal mindenki felett, és mikor hatalomhoz jut az ő gazdagsága által, mindent megmozdít Görögország ellen.
౨ఇప్పుడు సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఇంకా ముగ్గురు రాజులు పారసీకంపై రాజ్యం చేసిన తరవాత అందరికంటే ఐశ్వర్యం కలిగిన నాలుగవ రాజొకడు వస్తాడు. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రీకుల రాజ్యానికి విరోధంగా రేపుతాడు.
3 És támad egy erős király és uralkodik nagy hatalommal és tetszése szerint cselekszik.
౩అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని ఏలి యిష్టానుసారంగా జరిగిస్తాడు.
4 De alighogy támadt, megrontatik az ő országa és elosztatik az égnek négy tája szerint, de nem száll az ő maradékira, és nem az ő hatalma szerint, a melylyel ő uralkodott, mert szétszaggattatik az ő birodalma, és másoknak adatik ezeken kivül.
౪అతడు రాజైన తరవాత అతని రాజ్యం శిథిలమైపోయి ఆకాశం నలుదిక్కులకూ ముక్కలైపోతుంది. అది అతని వంశికులకు గానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేసేవారికి గానీ దక్కదు. అతని ప్రభుత్వం కూకటి వేళ్ళతో పెరికి వేయబడుతుంది. అతని వంశంవారు దాన్ని పొందరు. పరాయివాళ్ళు పొందుతారు.
5 És elhatalmasodik a déli király, de az ő vezérei közül is egyik, és ez hatalmat vesz rajta és uralkodik, nagy uralkodás lesz az ő uralkodása.
౫అయితే దక్షిణదేశం రాజు, అతని అధిపతుల్లో ఒకడు బలం పుంజుకుని ఇతనికంటే గొప్పవాడై మరింత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతాడు.
6 És esztendők mulva szövetkeznek, és a déli király leánya az északi királyhoz megy, hogy békéltessen, de a kar erejét meg nem tarthatja, és ő sem áll meg, sem az ő karja, hanem kiszolgáltatják őt és az ő kisérőit és az ő nemzőjét és azt, a ki őt egy ideig gyámolította.
౬కొన్ని సంవత్సరాలైన తరువాత సమయం వచ్చినప్పుడు వారు సంధి చేసుకోవాలని కలుసుకుంటారు. దక్షిణదేశం రాజకుమార్తె ఆ ఒప్పందాన్ని స్థిర పరచడం కోసం ఉత్తరదేశం రాజు దగ్గరికి వస్తుంది. అయినా ఆమె తన బలం కోల్పోయి దిక్కులేనిదిగా విడువబడుతుంది. ఆమె, ఆమెను తీసుకు వచ్చినవారు, ఆమె తండ్రి, ఆమెకు ఆసరాగా ఉన్నవారు అలానే అవుతారు.
7 De támad helyébe az ő gyökerének csemetéje közül, a ki a had ellen jön majd, és tör az északi király erősségeire, és azokat megszállja és beveszi.
౭ఆమె స్థానంలో ఆమె వంశాంకురం ఒకడు లేస్తాడు. అతడు దాడి చేసి ఉత్తర దేశపురాజు కోటలో చొరబడి యుద్ధమాడి వారిని ఓడిస్తాడు.
8 És azoknak isteneit is bálványaikkal és drága arany- és ezüstedényeikkel együtt fogságba viszi Égyiptomba, és néhány esztendeig erősebb lesz, mint az északi király.
౮అతడు వారి దేవుళ్ళను పోతపోసిన బొమ్మలను విలువగల వారి వెండి బంగారు వస్తువులను చెరపట్టి ఐగుప్తుకు తీసుకుపోతాడు. అతడు కొన్ని సంవత్సరాలు ఉత్తర దేశపురాజు జోలికి పోడు.
9 Ez ugyan bemegy a déli király országába, de visszatér az ő földére.
౯ఉత్తర దేశపురాజు దక్షిణ దేశపురాజు రాజ్యంలో చొరబడి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు.
10 De az ő fiai fegyverkeznek és sok nagy sereget gyűjtenek, és hirtelen jön és beözönlik, és átmegy és visszatér, és hadakoznak mind az ő erősségéig.
౧౦అతని కుమారులు యుద్ధ సన్నద్ధులై మహా సైన్యాలను సమకూర్చుకుంటారు. అతడు నది లాగా ముంచుకు వచ్చి కట్టలు తెంచుకుని ప్రవహిస్తాడు. యుద్ధం చేయబూని కోట దాకా వస్తాడు.
11 És felháborodik a déli király, és kimegy és megütközik vele, az északi királylyal, és az nagy sokaságot állít fel, de ez a sokaság annak a kezébe adatik.
౧౧అంతలో దక్షిణదేశం రాజు ఆగ్రహంతో బయలుదేరి ఉత్తరదేశపు రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర దేశం రాజు గొప్పసైన్యంతో వచ్చినప్పటికీ అతడు ఓడిపోతాడు.
12 És a mint a sokaság elfogatott: felfuvalkodik annak szíve, és sok ezeret letipor; még sem lesz hatalmas.
౧౨ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందుకు దక్షిణదేశం రాజు మనస్సులో గర్విస్తాడు. వేలకొలది శత్రు సైనికులను హతం చేసినా అతనికి జయం కలగదు.
13 Mert az északi király visszatér, és az előbbinél nagyobb sokaságot állít; néhány esztendő mulva nagy sereggel és nagy készlettel jő bizony.
౧౩ఎందుకంటే ఉత్తర దేశంరాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మళ్ళీ వస్తాడు. ఆ కాలాంతంలో, అంటే కొన్ని సంవత్సరాలైన తరువాత అతడు గొప్ప సైన్యాన్ని విశేషమైన యుద్ధ పరికరాలను సమకూర్చి నిశ్చయంగా వస్తాడు.
14 És azokban az időkben sokan támadnak a déli király ellen, a te néped erőszakos fiai is felkelnek, hogy beteljesítsék a látomást, de elhullanak.
౧౪ఆ కాలాల్లో చాలా మంది దక్షిణదేశపు రాజుతో యుద్ధం చేయడానికి వస్తారు. నీ ప్రజలలో క్రూరులైన వారు దర్శనాన్ని నెరవేర్చడం కోసం బయలు దేరుతారు గానీ వారు తొట్రుపడతారు.
15 Mert eljő észak királya, és töltést emel és beveszi az erősített várost; és délnek seregei meg nem állnak, sem az ő válogatott népe, és semmi erő nem bír ellene állni.
౧౫ఉత్తరదేశపురాజు వచ్చి కోట చుట్టూ ముట్టడి దిబ్బ వేసి కోటను పట్టుకుంటాడు. దక్షిణ దేశపు రాజు బలగం నిలవలేక పోతుంది. అతని వీరయోధులు సైతం శౌర్యంతో నిలదొక్కుకోలేక పోతారు.
16 És az, a ki reátört, a maga tetszése szerint cselekszik, és senki sem lesz, a ki ellene álljon, és megállapodik a dicső földön, és megsemmisül az az ő kezétől.
౧౬ఉత్తర దేశపు రాజును ఎవరూ ఎదిరించి నిలవలేక పోయినందువల్ల అతడు దక్షిణ రాజుకు వ్యతిరేకంగా తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అతడు రమ్యదేశంలో స్థిరపడి సర్వనాశనం జరిగిస్తాడు.
17 Azután maga elé tűzi, hogy bemegy az ő egész országának erejével, és békés szándékot mutat, és leányasszonyt ad néki feleségül, hogy megrontsa, de az nem áll meg és nem tart vele.
౧౭అతడు తన రాజ్య సంబంధమైన సంపూర్ణ బలాన్ని సమీకరించుకుని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి ఒప్పందం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతాయి. అతడు ఒక కుమార్తెను దక్షిణ రాజుకు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా అతణ్ణి నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఆ పథకం నెరవేరదు.
18 És fordítja orczáját a szigetekre, és sokat elfoglal; de az ő gyalázatosságának véget vet egy vezér, a mellett, hogy megfizet néki az ő gyalázatosságáért.
౧౮అతడు ద్వీపాల్లో నివసించే జాతుల వైపు దృష్టి సారించి వాటిలో చాలా రాజ్యాలను పట్టుకుంటాడు. అయితే ఒక సేనాని అతని అహంకారానికి అడ్డుకట్ట వేస్తాడు. అతని అవమానం అతని మీదికే మళ్ళీ వచ్చేలా చేస్తాడు.
19 És fordítja orczáját a maga országának erősségeire, és meghanyatlik, elesik és nem találtatik meg.
౧౯అప్పుడతడు తన దేశాలోని కోటల వైపు దృష్టి సారిస్తాడు గాని తొట్రుపడి కూలి, లేకుండా పోతాడు.
20 Ennek helyébe jön az, a ki adószedőt jártat végig az ország dicső földén, de rövid időn megrontatik, noha nem haraggal, sem viadalban.
౨౦అతని స్థానంలో మరొకడు లేచి రాజ్య వైభవం కోసం బలవంతంగా పన్నులు వసూలు చేస్తాడు. కొద్ది దినాలకే అతడు నాశనమౌతాడు గానీ ఈ నాశనం ఆగ్రహం వల్ల గానీ యుద్ధం వల్ల గానీ జరగదు.
21 És ennek helyébe egy útálatos áll, a kire nem teszik az ország ékességét; hanem alattomban jő, és hízelkedéssel jut az országhoz.
౨౧అతనికి బదులుగా నీచుడొకడు వస్తాడు. అతనికి ప్రజలు రాజ్య ఘనత ఇవ్వరు. అతడు చాప కింద నీరు లాగా వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు.
22 És a beözönlő seregek elárasztatnak az ő orczája előtt és megtöretnek; még egy szövetséges fejedelem is.
౨౨వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకు పోతుంది. ఒడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతోబాటు నాశనమై పోతాడు.
23 Mert a vele való megbarátkozás óta csalárdul cselekszik ellene, és reátör és győzedelmet vesz rajta kevés néppel.
౨౩అతడు తాత్కాలికంగా సంధి చేస్తాడు గానీ కుటిలంగా ప్రవర్తిస్తాడు. అతడు కొద్దిమంది అనుచరులతో బలం పొందుతాడు.
24 Alattomban még az ország gazdag részeibe is behatol, és azt cselekszi, a mit nem cselekedtek sem az ő atyái, sem az ő atyáinak atyái: zsákmányt, prédát és gazdagságot tékozol előlők, és az erősségek ellen is cselt kohol, de csak egy ideig.
౨౪అతడు హటాత్తుగా సంపన్న ప్రాంతానికి వచ్చి, తన పూర్వీకుడుగానీ తన పూర్వీకుల పూర్వీకులు గాని చేయని దాన్ని చేస్తాడు. అక్కడ ఆస్తిని, దోపుడు సొమ్మును, సంపదను తన వారికి పంచిపెడతాడు. అంతట కొంతకాలం ప్రాకారాలను పట్టుకోడానికి కుట్ర చేస్తాడు.
25 És felindítja az ő erejét és szívét a déli király ellen nagy sereggel, és a déli király is hadra készül nagy sereggel és igen erőssel, de meg nem állhat, mert cselt koholtak ellene.
౨౫అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని, దక్షిణదేశపు రాజుతో యుద్ధం చేయడానికి తన బలం పుంజుకుని, ధైర్యం కూడగట్టుకుంటాడు. కాబట్టి దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మహా బలంతో యుద్ధానికి సన్నద్ధుడౌతాడు. కానీ అతడు తనకు వ్యతిరేకంగా తలపెట్టిన పన్నాగాల మూలంగా నిలవ లేక పోతాడు.
26 És a kik az ő ételét eszik, megrontják őt, és az ő serege elszéled, és sokan elhullanak seb miatt.
౨౬ఎందుకంటే అతని బల్ల దగ్గర భోజనం చేసే వారే అతన్ని నాశనం చేయ జూస్తారు. అతని సైన్యం తుడిచిపెట్టుకు పోతుంది. చాలా మంది హతం అవుతారు.
27 De ennek a két királynak szíve is gonoszt forral, és egy asztalnál hazugságot szólnak egymásnak; de siker nélkül, mert a vég még bizonyos időre elmarad.
౨౭ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కీడు తలపెట్టి ఆ యిద్దరు రాజులు కలిసి భోజనానికి కూర్చుని ఒకరితో ఒకరు అబద్ధాలాడతారు. అయితే దీనివల్ల ఏమీ ఫలితం ఉండదు. ఎందుకంటే నిర్ణయ కాలానికి అంతం వస్తుంది.
28 Azért visszatér az ő földére nagy gazdagsággal; de az ő szíve a szent szövetség ellen van, és ellene tesz, és újra visszatér az ő földére.
౨౮అటు తరువాత ఉత్తర దేశపు రాజు గొప్ప ధనరాసులతో తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతని మనస్సు మాత్రం పరిశుద్ధ నిబంధనకు విరోధంగా ఉంటుంది. అతడు ఇష్టానుసారంగా జరిగించి తన దేశానికి తిరిగి వస్తాడు.
29 Bizonyos időben megjő, és délre megy: de nem lesz utolszor úgy, mint először volt.
౨౯అనుకున్న సమయంలో అతడు తిరిగి దక్షిణరాజ్యం పై దండెత్తుతాడు. అయితే ఈ సారి మొదట ఉన్నట్టుగా ఉండదు.
30 Mert kitteus hajók jőnek ellene és megijed, és visszatér és dühöng a szent szövetség ellen és cselekszik ellene; visszatér és ügyel azokra, a kik elhagyják a szent szövetséget.
౩౦అంతట కిత్తీయుల ఓడలు అతని మీదికి రావడం వలన అతడు ధైర్యం చెడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై, పరిశుద్ధ నిబంధనను విడిచి పెట్టిన వారి పట్ల పక్షపాతం చూపుతాడు.
31 És seregek állanak fel az ő részéről, és megfertéztetik a szenthelyet, az erősséget, és megszüntetik a mindennapi áldozatot, és felteszik a pusztító útálatosságot.
౩౧అతని శూరులు లేచి, పరిశుద్ధస్థలాన్ని, కోటను మైల పడేలా చేసి, అనుదిన దహన బలి తీసివేసి, నాశనం కలగజేసే హేయమైన వస్తువును నిలబెడతారు.
32 És a kik gonoszul cselekesznek a szövetség ellen, azokat hitszegésre csábítja hizelkedésekkel; ellenben az Istenét ismerő nép felbátorodik és cselekeszik.
౩౨అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించే వారిని తన వైపు తిప్పుకుంటాడు. అయితే తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు.
33 És a nép értelmesei sokakat oktatnak, de hullanak fegyver és tűz miatt, fogság és rablás miatt napokig.
౩౩ప్రజల్లో జ్ఞానం గల వారు ఆనేకులకు అవగాహన కలిగిస్తారు గాని వారు చాలా రోజులు కత్తి వల్ల, అగ్ని వల్ల కూలి, చెరసాల పాలవుతారు. వారికున్నదంతా దోచుకోవడం జరుగుతుంది.
34 És miközben elhullanak, megsegíttetnek kicsiny segítséggel, és sokan csatlakoznak hozzájok képmutató beszédekkel.
౩౪వారి కష్టకాలంలో వారికి కొద్దిపాటి సహాయం మాత్రం దొరుకుతుంది. చాలా మంది వారి వైపు చేరతారు గానీ వారివన్నీ శుష్క ప్రియాలే.
35 És elhullanak az értelmesek közül is, hogy megpróbáltassanak, megtisztíttassanak és megfehéríttessenek a vég idejéig; mert a rendelt idő még hátra van.
౩౫కొందరు జ్ఞానవంతులు తొట్రుపడతారుగానీ అది వారు అంతం వచ్చేలోపు మరింత మెరుగు పడేందుకు, శుభ్రం అయేందుకు, పవిత్రులయేందుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నియమించిన కాలం ఇంకా రాలేదు.
36 És a király a maga tetszése szerint cselekszik és felfuvalkodik és felmagasztalja magát minden isten felett, és az istenek Istene ellen is vakmerőn szól, és szerencsés lesz, mígnem betelik a harag; mert a mi elhatároztatott, az végre is hajtatik.
౩౬ఆ రాజు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. తన్ను తానే హెచ్చించుకుంటూ, విర్రవీగుతూ దేవాధిదేవునికి వ్యతిరేకంగా నిర్ఘాంతపోయేలా చేసే మాటలు వదరుతాడు. ఉగ్రత ముగిసే దాకా అతడు వర్ధిల్లుతాడు. ఆపైన జరగవలసింది జరుగుతుంది.
37 Nem gondol atyáinak isteneivel, nem gondol az asszonyok kedvenczével, és egy istennel sem; hanem mindennek fölibe magasztalja magát.
౩౭అతడు తన పితరుల దేవుళ్ళను లెక్క చెయ్యడు. స్త్రీలు కోరుకునే దేవుణ్ణిగానీ, ఏ ఇతర దేవుళ్ళనుగానీ లక్ష్య పెట్టడు.
38 De a helyett tiszteli az erődök istenét annak helyén; és azt az istent, a kit nem ismertek az ő atyái, tiszteli aranynyal, ezüsttel, drágakövekkel és becses ajándékokkal.
౩౮అతడు కోట గోడల దేవుణ్ణి ఘన పరుస్తాడు. అతడు తన పితరులకు తెలియని దేవుణ్ణి వెండి బంగారాలను, వెలగల రాళ్ళను అర్పించి కొలుస్తాడు.
39 És az erődített városokban így teszen az idegen istenek nevében: a ki hódol, annak dicsőségét megsokasítja és sokak felett ad nékik hatalmat; a földet elosztja jutalom gyanánt.
౩౯ఈ అపరిచిత దేవుడి సహాయంతో అతడు అతి బలిష్ఠమైన దుర్గాల పై దాడి చేస్తాడు. తనను అంగీకరించిన గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అనేకుల మీద తన వారిని పరిపాలకులుగా చేస్తాడు. ప్రభుత్వ మిస్తాడు. దేశాన్ని వెల కట్టి పంచిపెడతాడు.
40 De a vég idején összetűz vele a déli király, és mint a forgószél, úgy megy reá az északi király szekerekkel, lovasokkal és sok hajóval, és betör az országokba, elözönli és végigjárja azokat.
౪౦చివరి రోజుల్లో దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు. ఉత్తరదేశపు రాజు రథాలను గుర్రపురౌతులను అసంఖ్యాకంగా ఓడలను సమకూర్చుకుని, తుఫానువలె అతని మీద పడి అనేక దేశాలను ముంచెత్తుతాడు.
41 És bemegy a dicső földre, és sokan elesnek; de ezek megszabadulnak az ő kezéből: Edom, Moáb és az Ammon fiainak színe-java.
౪౧అతడు మహిమ దేశంలో ప్రవేశించగా చాలా మంది కూలి పోతారు గానీ ఎదోమీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల నాయకులు అతని చేతిలోనుండి తప్పించుకుంటారు.
42 És kezeit az országokra veti, és Égyiptom földe meg nem menekedhetik.
౪౨అతడు ఇతర దేశాల మీదికి తన సేన పంపిస్తాడు. ఐగుప్తు సైతం తప్పించుకోలేదు.
43 És ura lesz Égyiptom arany- és ezüst-kincseinek és minden drágalátos javainak; libiabeliek és szerecsenek is lesznek az ő kíséretében.
౪౩అతడు విలువగల వెండి బంగారు వస్తువులను ఐగుప్తులోని విలువ గల వస్తువులన్నిటిని వశపరచుకుంటాడు. లూబీయులు, ఇతియోపియా వారు అతనికి దాసోహం అవుతారు.
44 De megriasztják őt napkeletről és északról való hírek, és kivonul nagy haraggal, hogy elveszessen és megöljön sokakat.
౪౪అప్పుడు తూర్పు నుండి, ఉత్తరం నుండి, వర్తమానాలు వచ్చి అతన్ని కలవర పరుస్తాయి. అతడు గొప్ప ఆగ్రహంతో అనేకులను పాడుచేసి నాశనం చేయడానికి బయలుదేరుతాడు.
45 És felvonja az ő sátor-palotáját a tengerek és a dicső szent hegy között; és végére jut, és senki sem segít rajta.
౪౫కాబట్టి తన శిబిరం డేరాను సముద్రానికి, పరిశుద్ధానంద పర్వతానికి మధ్య వేస్తాడు. అయితే అతనికి నాశనం వచ్చినప్పుడు ఎవరూ అతనికి సహాయం చేయడానికి రారు.