< Dániel 10 >
1 Czírusnak, Persia királyának harmadik esztendejében egy ige jelenteték Dánielnek, a ki Baltazárnak nevezteték; igaz az ige és nagy bajról való; és figyele az igére és megérté a látomást.
౧పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.
2 Azokon a napokon én, Dániel, bánkódtam három egész hétig.
౨ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను.
3 Kívánatos étket nem ettem, hús és bor nem ment az én számba, és soha sem kentem meg magamat, míg el nem telék az egész három hét.
౩మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.
4 És az első hónapnak huszonnegyedik napján, ímé én a nagy folyóvíznek, azaz a Hiddekelnek partján valék.
౪మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.
5 És felemelém szemeimet, és látám, és ímé: egy férfiú, gyolcsba öltözve, és dereka ufázi aranynyal övezve.
౫నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
6 És teste olyan mint a társiskő, és orczája olyan mint a villám, és szemei olyanok mint az égő szövétnekek, karjai és lábatája mint az izzó ércznek színe, és az ő beszédének szava olyan, mint a sokaság zúgása.
౬అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.
7 És egyedül én, Dániel láttam e látomást, a férfiak pedig, a kik velem valának, nem látták a látomást; hanem nagy rettenés szálla reájok, és elfutának, hogy elrejtőzzenek.
౭దానియేలు అనే నాకు ఈ దర్శనం కలిగినప్పుడు నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గానీ భయంతో గడగడా వణుకుతూ దాక్కోవాలని పారిపోయారు.
8 És én egyedül hagyattam, és látám ezt a nagy látomást, és semmi erő sem marada bennem, és orczám eltorzula, és oda lőn minden erőm.
౮నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది.
9 És hallám az ő beszédének szavát; és mikor hallám az ő beszédének szavát, én ájultan orczámra esém, és pedig orczámmal a földre.
౯నేను అతని మాటలు విన్నాను. నేను అతని మాటలు విని నేలపై సాష్టాంగపడి గాఢనిద్ర పోయాను.
10 És ímé, egy kéz illete engem, és felsegített térdeimre és tenyereimre;
౧౦అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి
11 És monda nékem: Dániel, kedves férfiú! Értsd meg a beszédeket, a melyeket én szólok néked, és állj helyedre, mert most te hozzád küldettem! És mikor e szót szólá velem, felállék reszketve.
౧౧“దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.
12 És monda nékem: Ne félj Dániel: mert az első naptól fogva, hogy szívedet adtad megértésre és sanyargatásra a te Istened előtt, meghallgattattak a te beszédid, és én a te beszédeid miatt jöttem.
౧౨అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను.
13 De Persiának fejedelme ellenem állott huszonegy napig, és ímé Mihály, egyike az előkelő fejedelmeknek, eljöve segítségemre, és én ott maradék a persa királyoknál;
౧౩పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
14 Jöttem pedig, hogy tudtodra adjam, a mi a te népedre az utolsó időkben következik: mert a látomás azokra a napokra szól.
౧౪ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
15 És mikor ilyen szavakkal szóla velem, orczámmal a földre esém és megnémulék.
౧౫అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను.
16 És ímé, olyan valaki, mint egy ember-fia, megilleté ajkaimat és megnyitám a számat és szólék és mondám annak, a ki előttem álla: Uram, a látomás miatt reám fordulának az én fájdalmaim, annyira, hogy semmi erőm nincsen.
౧౬అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది.
17 És mi módon szólhat ezzel az én Urammal ennek az én Uramnak szolgája? Hiszen bennem attól fogva nem álla meg az erő, és lélekzet sem marada bennem.
౧౭తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా
18 És ismét illete engem az emberhez hasonló, és megerősíte engem.
౧౮అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు.
19 És monda: Ne félj, te kedves férfiú; békesség néked, légy erős és bizony erős! És mikor szóla velem, megerősödém, és mondék: Szóljon az én Uram, mert megerősítél engemet.
౧౯నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.
20 És monda: Tudod-é, miért jöttem hozzád? És most visszatérek, hogy küzdjek a persa fejedelem ellen; és ha én kimegyek, ímé Görögország fejedelme jő elő!
౨౦అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు.
21 De megjelentem néked, a mi fel van jegyezve az igazság írásában; és senki sincsen, a ki én velem tartana ezek ellenében, hanem csak Mihály a ti fejedelmetek.
౨౧అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”