< 1 Sámuel 12 >
1 És monda Sámuel az egész Izráelnek: Ímé meghallgattam szavaitokat mindenben, valamit nékem mondottatok, és királyt választottam néktek.
౧అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. “వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను.
2 És most ímé a király előttetek jár. Én pedig megvénhedtem és megőszültem, és az én fiaim ímé ti köztetek vannak, és én is előttetek jártam ifjúságomtól fogva mind a mai napig.
౨మీకు అవసరమైన పనులు మీ రాజు జరిగిస్తాడు. నా తల నెరిసిపోయింది, నేను ముసలివాణ్ణి అయ్యాను. నా కొడుకులు మీ మధ్యలో ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈరోజు వరకూ నేను మీ మధ్య ఉండి మీ పనులు చేస్తూ వచ్చాను.
3 Itt vagyok, tegyetek bizonyságot ellenem az Úr előtt és az ő felkentje előtt: kinek vettem el az ökrét, és kinek vettem el a szamarát, és kit csaltam meg, kit sanyargattam, és kitől fogadtam el ajándékot, hogy a miatt szemet hunyjak? és visszaadom néktek.
౩ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”
4 Ők pedig felelének: Nem csaltál meg minket, nem sanyargattál minket, és senkitől semmit el nem fogadtál.
౪అందుకు ప్రజలు “నువ్వు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు, ఏ విధంగానూ బాధ కలిగించలేదు, ఎవరి దగ్గరా నువ్వు దేనినీ తీసుకోలేదు” అని అతనితో చెప్పారు.
5 És ő monda nékik: Legyen bizonyság az Úr ti ellenetek, és bizonyság az ő felkentje ezen a napon, hogy semmit sem találtatok kezemben! Ők pedig mondának: Legyen bizonyságul.
౫అతడు “అలాంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా, ఇంకా ఆయన అభిషేకం చేయించినవాడు కూడా ఈనాడు మీ మీద సాక్షులుగా ఉన్నారు” అని చెప్పినప్పుడు “అవును, సాక్షులే” అని వారంతా జవాబిచ్చారు.
6 És monda Sámuel a népnek: Igen, az Úr, a ki rendelte Mózest és Áront, és a ki kihozta atyáitokat Égyiptom földéről!
౬సమూయేలు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాడు. “మోషేను, అహరోనును నాయకులుగా నియమించి మీ పూర్వీకులను ఐగుప్తు దేశం నుండి రప్పించినవాడు యెహోవాయే గదా
7 Most azért álljatok elő, hadd perlekedjem veletek az Úr előtt az Úrnak minden jótéteményei felett, a melyeket cselekedett veletek és a ti atyáitokkal.
౭కాబట్టి యెహోవా మీకు, మీ పూర్వీకులకు చేసిన న్యాయమైన ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధానంలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.
8 Miután Jákób Égyiptomba ment vala, atyáitok az Úrhoz kiáltának, és az Úr elküldé Mózest és Áront, a kik kihozták atyáitokat Égyiptomból, és letelepíték erre a helyre.
౮యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు.
9 De ők elfeledték az Urat, az ő Istenöket, azért adá őket Siserának, a Hásor serege vezérének kezébe, és a Filiszteusok kezébe és Moáb királyának kezébe, és azok harczolának ellenök.
౯అయితే వారు తమ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని హాసోరు సేనాధిపతి సీసెరా చేతికీ ఫిలిష్తీయుల చేతికీ మోయాబు రాజు చేతికీ అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి హింసించారు.
10 Akkor kiáltának az Úrhoz, és mondák: Vétkeztünk, mert elhagytuk az Urat, és szolgáltunk a Baáloknak és Astarótnak; most azért szabadíts meg minket ellenségeinknek kezéből, hogy néked szolgáljunk.
౧౦అప్పుడు వారు, ‘మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళనూ అష్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాం. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. నిన్ను మాత్రమే సేవిస్తాం’ అని యెహోవాను వేడుకున్నారు.
11 És elküldé az Úr Jerubbaált és Bédánt és Jeftét és Sámuelt, és megszabadíta titeket mindenfelől ellenségeitek kezéből, és biztonságban laktatok.
౧౧యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిక్కులా ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వల్ల మీరు భయం లేకుండా నివసిస్తున్నారు.
12 Mikor pedig láttátok, hogy Náhás, az Ammon fiainak királya ellenetek jöve, azt mondátok nékem: Semmiképen nem, hanem király uralkodjék felettünk, holott csak a ti Istenetek, az Úr a ti királyotok.
౧౨అయితే అమ్మోనీయుల రాజు నాహాషు మీపైకి దండెత్తినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సంరక్షుడుగా ఉన్నప్పటికీ, ‘ఆయన వద్దు, ఒక రాజు మమ్మల్ని ఏలాలి’ అని మీరు నన్ను అడిగారు.
13 Most azért, ímhol a király, a kit választottatok, a kit kértetek. Ímé, az Úr királyt adott néktek.
౧౩మీరు ఇష్టపూర్వకంగా నియమించుకొన్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీపైన రాజుగా నిర్ణయించాడు.
14 Hogyha az Urat félitek, és néki szolgáltok; szavára hallgattok és az Úr szája ellen engedetlenek nem lesztek; és mind ti, mind pedig a király, a ki felettetek uralkodik, az Urat, a ti Isteneteket követitek: megtartattok.
౧౪మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి.
15 Ha pedig az Úr szavára nem hallgattok, és az Úr szava ellen engedetlenek lesztek: az Úrnak keze ellenetek leend, miként a ti atyáitok ellen.
౧౫అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.
16 Most is azért álljatok meg, és lássátok meg azt a nagy dolgot, a melyet az Úr visz véghez szemeitek előtt.
౧౬మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి.
17 Avagy nem búzaaratás van-é most? Kiáltani fogok az Úrhoz, és ő mennydörgést és esőt ád, hogy megtudjátok és meglássátok, mily nagy a ti gonoszságtok, melyet cselekedtetek az Úr szemei előtt, mikor királyt kértetek magatoknak.
౧౭ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.”
18 Kiálta azért Sámuel az Úrhoz, és az Úr mennydörgést és esőt adott azon a napon. És az egész nép nagyon megrettene az Úrtól és Sámueltől.
౧౮సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.
19 És monda az egész nép Sámuelnek: Könyörögj szolgáidért az Úrhoz, a te Istenedhez, hogy meg ne haljunk, mert minden bűneinket csak öregbítettük azzal a bűnnel, hogy királyt kértünk magunknak.
౧౯వారు సమూయేలుతో ఇలా అన్నారు. “రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.”
20 És monda Sámuel a népnek: Ne féljetek! Ha már mind e gonoszságot véghez vittétek, most ne távozzatok el az Úrtól, hanem az Úrnak szolgáljatok teljes szívetekből.
౨౦అప్పుడు సమూయేలు ప్రజలతో “భయపడవద్దు. మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాను విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ, నిండు హృదయంతో ఆయనను సేవించండి.
21 Ne térjetek el a hiábavalóságok után, a melyek nem használnak, meg sem szabadíthatnak, mert hiábavalóságok azok.
౨౧ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.
22 Mert nem hagyja el az Úr az ő népét, az ő nagy nevéért; mert tetszett az Úrnak, hogy titeket a maga népévé válaszszon.
౨౨యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.
23 Sőt tőlem is távol legyen, hogy az Úr ellen vétkezzem és felhagyjak az érettetek való könyörgéssel; hanem inkább tanítani foglak titeket a jó és igaz útra.
౨౩నేను మాత్రం ఇంకా ఎక్కువ ఆసక్తితో మీ కోసం ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసినవాడనవుతాను. ఆయనశ్రేష్ఠమైన మంచి మార్గం మీకు బోధిస్తాను.
24 Csak féljétek az Urat, és szolgáljatok néki hűségesen, teljes szívetekből; mert látjátok; mily nagy dolgot cselekedett veletek.
౨౪ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.
25 Ha pedig folytonos rosszat cselekesztek: mind ti, mind királyotok elvesztek.
౨౫మీరు చెడ్డ పనులు చేస్తూ ఉన్నట్టయితే మీరూ, మీ రాజూ నశించిపోతారు.”