< 4 Mózes 30 >

1 És szólt Mózes Izrael fiai törzseinek fejeihez, mondván: Ez az, amit parancsolt az Örökkévaló:
మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు,
2 Ha valaki fogadalmat tesz az Örökkévalónak, vagy esküt tesz, hogy megkösse magát megszorítással, meg ne szegje szavát; mind aszerint amint kijön szájából, cselekedjék.
“ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.
3 És ha nő tesz fogadalmat az Örökkévalónak vagy megköti magát megszorítással az atyja házában, hajadon korában,
తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.
4 és meghallja az atyja az ő fogadalmát vagy megszorítását, amellyel megkötötte magát, és hallgat az atyja, akkor fönnállnak minden fogadalmai, és minden megszorítás, amellyel megkötötte magát fenn fog állni.
ఆమె ప్రమాణాలు అన్నీ నిలిచి ఉంటాయి.
5 Ha azonban megtiltja az atyja neki, amely napon meghallja, minden fogadalmai és megszorításai, melyekkel megkötötte magát, nem állnak fenn; az Örökkévaló pedig megbocsát neki, mert az atyja megtiltotta neki.
అయితే ఆమె చేసిన ప్రమాణాలను ఆమె తండ్రి విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, ఏవీ నిలబడవు.
6 Ha pedig férjhez megy és fogadalmai rajta vannak, vagy ajkainak kijelentése, amellyel megkötötte magát,
ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
7 és meghallja a férje, amely napon meghallja és hallgat, akkor fennállnak fogadalmai, és megszorításai, melyekkel megkötötte magát, fönn fognak állni.
ఆమె వివాహిత అయితే, ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త ఎరిగి ఏమీ మాట్లాడకపోతే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు ఆమెపై నిలిచి ఉంటాయి.
8 Ha azonban, amely napon meghallja a férje, megtiltja neki, akkor megsemmisíti fogadalmát, mely rajta van, vagy ajkai kijelentését, mellyel megkötötte magát, az Örökkévaló pedig megbocsát neki.
అయితే ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, అతడు ఆమె మొక్కుబడులను, తొందరపాటుగా చేసిన ప్రమాణాలను రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు.
9 Az özvegy és elvált asszony fogadalma, mindaz, amivel megkötötte magát, fönnáll ránézve.
వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.
10 Ha pedig férje házában tett fogadalmat, vagy kötötte meg magát megszorítással eskü által,
౧౦ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,
11 és meghallja a férje, de hallgat, nem tiltja meg neki, akkor fennállnak minden fogadalmai, és minden megszorítás, amellyel megkötötte magát, fenn fog állni.
౧౧వాటిని గురించి ఆమె భర్త విని ఏ ఆక్షేపణా చేయకుండా ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, అన్నీ నిలిచి ఉంటాయి.
12 Ha azonban megsemmisíti azokat férje, amely napon meghallja, minden kijelentése ajkainak, akár fogadalmai, akár önmagának megszorításai, nem fog fennállni; férje megsemmisítette azokat és az Örökkévaló megbocsát neki.
౧౨ఆమె భర్త వాటి గురించి విన్న రోజునే వాటిని పూర్తిగా రద్దు చేసి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు గురించిన ఆమె మాటలు ఏవీ నిలబడవు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.
13 Minden fogadalmat és minden megszorító esküt, mely önmaga sanyargatására való, férje erősít meg és férje semmisít meg.
౧౩ఒక స్త్రీ చేసిన ప్రతి మొక్కుబడిని, ప్రమాణపూర్వకంగా తన మీద మోపుకొన్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చు, రద్దు చేయవచ్చు.
14 Ha pedig hallgat a férje napról-napra, akkor megerősítette minden fogadalmait, vagy minden megszorításait, melyek rajta vannak; megerősítette azokat, mert hallgatott, amely napon meghallotta.
౧౪అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు.
15 Ha pedig megsemmisíti azokat, miután hallotta, akkor viselje annak bűnét.
౧౫అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.”
16 Ezek a törvények, melyeket az Örökkévaló parancsolt Mózesnek férj és felesége között, atya és leánya között, hajadon korában, atyjának házában.
౧౬ఇవి భర్తను గూర్చీ భార్యను గూర్చీ, తండ్రిని గూర్చీ బాల్యంలో తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చీ యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞలు.

< 4 Mózes 30 >