< 3 Mózes 12 >
1 És szólt az Örökkévaló Mózeshez, mondván:
౧యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
2 Szólj Izrael fiaihoz, mondván: midőn egy nő magzatot hoz világra és szül fiúgyermeket, tisztátalan legyen hét napig, tisztulása szenvedésének napjai szerint legyen tisztátalan.
౨“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు. ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగ పిల్లాణ్ణి కంటే ఆమె ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది.
3 A nyolcadik napon pedig metéltessék körül előbőrének húsa.
౩ఎనిమిదో రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి.
4 S harminchárom napig maradjon meg tisztulásának vérében; semmi szenthez ne nyúljon és a szentélybe be ne menjen, míg le nem teltek megtisztulásának napjai.
౪ఆమె తన రక్తస్రావం నుండి శుద్ధి జరగడానికి ముప్ఫై మూడు రోజులు పడుతుంది. తన రక్తశుద్ధి రోజులు పూర్తయే వరకూ ఆమె పరిశుద్ధమైన దాన్ని దేన్నీ ముట్టుకోకూడదు. పరిశుద్ధ స్థలం లో ప్రవేశింపకూడదు.
5 Ha pedig leánygyermeket szül, tisztátalan legyen két hétig mint tisztulásakor; hatvan napig pedig maradjon megtisztulásának vérében.
౫ఆమె ఒకవేళ ఆడపిల్లని కంటే ఆమె రెండు వారాలు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. ఆమె రక్తశుద్ధికి అరవై ఆరు రోజులు పడుతుంది.
6 S midőn leteltek megtisztulásának napjai fiúnál vagy leánynál, hozzon egyéves juhot égőáldozatnak és galambfiat vagy gerlicét vétekáldozatnak a találkozás sátorának bejáratához, a paphoz.
౬కొడుకైనా, కూతురైనా వాళ్ళ కోసం ఆమె శుద్ధి రోజులు పూర్తయ్యాక ఆమె ఒక సంవత్సరం వయస్సున్న గొర్రె పిల్లని దహనబలిగా తీసుకురావాలి. అలాగే పాపం కోసం అర్పణగా ఒక గువ్వనుగానీ, ఒక తెల్ల పావురం పిల్లని గానీ తీసుకు రావాలి. వీటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తెచ్చి యాజకుడికి ఇవ్వాలి.
7 És mutassa be az Örökkévaló színe előtt és szerezzen engesztelést számára, és megtisztul vére folyásától. Ez a tan a szülő nőről, fiúgyermeknél és leánygyermeknél.
౭అప్పుడు అతడు యెహోవా సమక్షంలో వాటిని అర్పించి ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె తన రక్తస్రావం విషయంలో ఆమెకు శుద్ధి కలుగుతుంది. ఇది మగపిల్లాణ్ణి గానీ ఆడ పిల్లను గానీ కనినప్పుడు స్త్రీ విషయంలో విధించిన చట్టం.
8 Ha pedig nem jut vagyonából amennyi elég a bárányra, akkor vegyen két gerlicét vagy két galambfiat, egyet égőáldozatnak és egyet vétekáldozatnak, hogy engesztelést szerezzen számára a pap, és tiszta lesz.
౮ఆమెకు ఒకవేళ గొర్రె పిల్లని తీసుకువచ్చే స్తోమత లేకపోతే, ఆమె రెండు తెల్ల గువ్వలనైనా రెండు పావురం పిల్లలనైనా తీసుకు రావాలి. వాటిలో ఒకటి దహనబలిగా, మరొకటి పాపంకోసం బలి అర్పణగా తీసుకు రావాలి. యాజకుడు ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె శుద్ధురాలు అవుతుంది.”