< Birák 19 >

1 Volt azokban a napokban – király nem volt Izraélben – volt egy levita férfiú, a ki tartózkodott Efraim hegységének hátulján, s vett magának ágyasnőt a Jehúdabeli Bét-Léchemből.
ఇశ్రాయేలీయులకు ఒక రాజు అంటూ లేని ఆ రోజుల్లో ఎఫ్రామీయుల కొండ ప్రాంతాల్లోని ఉత్తర భాగంలో ఒక లేవీయుడు పరదేశిగా నివసించేవాడు. అతడు యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉంపుడుగత్తెగా తెచ్చుకున్నాడు.
2 De ágyasa hűtelen lett hozzá és elment tőle, atyja házába, a Jehúdabeli Bét-Léchembe, és ott volt négy teljes hónapig.
అయితే ఆమె అతణ్ణి విడిచి పెట్టి మరొకరితో వ్యభిచారం చేసింది. ఆమె యూదా ప్రాంతం బెత్లేహెం లోని తన తండ్రి ఇంటికి వెళ్లి అక్కడే నాలుగు నెలలు ఉండిపోయింది.
3 Akkor fölkelt a férje és ment utána, hogy szívére beszéljen, hogy visszahozza; vele volt a legénye és egy pár szamár. Bevezette őt atyja házába, meglátta a leányzó atyja és örülve elébe ment.
ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెని తిరిగి తెచ్చుకోడానికి ఆమె భర్త తన సేవకుణ్ణి, రెండు గాడిదలనూ తీసుకుని బయల్దేరాడు. ఆమె అతణ్ణి తన తండ్రి ఇంట్లోకి తీసుకు వెళ్ళింది. ఆ యువతి తండ్రి అతణ్ణి చూసి అతణ్ణి కలుసుకున్నందుకు సంతోషపడ్డాడు.
4 Tartóztatta őt az ipja, a leányzó atyja és nála maradt három napig; ettek, ittak és megháltak ott.
ఆ అమ్మాయి తండ్రి, అంటే అతని మామ తనతో మూడు రోజులుండమని అతణ్ణి బలవంతం చేశాడు. కాబట్టి అతడు మూడు రోజులూ, రాత్రులూ తింటూ తాగుతూ అక్కడే గడిపాడు.
5 S volt a negyedik napon, fölkeltek kora reggel, és készült elmenni; ekkor szólt a leányzó atyja a vejéhez: Erősítsd szívedet egy darab kenyérrel, azután elmehettek.
నాలుగవ రోజు వెళ్ళడానికి వాళ్ళు ఉదయాన్నే మేలుకున్నారు. ప్రయాణానికి సిద్ధపడ్డారు. కాని ఆ అమ్మాయి తండ్రి తన అల్లుడితో “కొంచెం రొట్టె తిని బలం తెచ్చుకో. ఆ తరువాత వెళ్ళవచ్చు” అన్నాడు.
6 Leültek, ettek kettejük együtt és ittak; ekkor szólt a leányzó atyja a férfiúhoz: Egyezz csak bele, hálj meg, hogy jó kedved legyen.
దాంతో మళ్ళీ వారిద్దరూ కూర్చుని భోజనం చేశారు. భోజనమయ్యాక ఆ అమ్మాయి తండ్రి “దయచేసి ఈ రాత్రంతా మాతో గడుపు. సరదాగా, సంతోషంగా ఉండు” అన్నాడు.
7 De a férfiú készült elmenni; azonban unszolta az ipja és újra meghált ott.
అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు.
8 S fölkelt kora reggel az ötödik napon, hogy elmenjen; ekkor szólt a leányzó atyja: Erősítsd, kérlek, szívedet és késedelmezzetek, míg lehajlik a nap. És ettek kettejük.
అయిదో రోజు అతడు ఉదయాన్నే ప్రయాణానికి లేచినప్పుడు ఆ అమ్మాయి తండ్రి “మధ్యాహ్నం వరకూ ఉండి భోజనం చేసి కొంచెం బలపడు” అంటూ నిలిపివేశాడు. సాయంత్రం అయ్యేవరకూ తాత్సారం చేస్తూ వారు భోజనం చేసారు.
9 Erre készült a férfiú elmenni, ő meg ágyasa és legénye. S mondta neki az ipja, a leányzó atyja: Íme, kérlek, a nap esteledésre hanyatlott, háljatok csak meg, íme, aláereszkedik a nap, hálj meg itt, hogy jó kedved legyen, s majd holnap korán fölkeltek utatokra és elmehetsz sátradhoz.
ఆ లేవీయుడూ, అతని ఉంపుడుకత్తే, అతని సేవకుడూ ప్రయాణానికి లేచారు. అతని మామ అతనితో “చూడు, సాయంత్రం అయింది. చీకటి పడబోతోంది. నువ్వు మరో రాత్రి ఇక్కడే ఉండి సరదాగా గడుపు. రేపు ఉదయాన్నే లేచి నీ ఇంటికి వెళ్ళవచ్చు.” అని బలవంతం చేశాడు.
10 De nem akart a férfiú meghálni, fölkelt és elment s eljutott Jebúsz felé – Jeruzsálem az – és vele egy pár fölnyergelt szamár, meg az ágyasa vele.
౧౦కానీ అతడు ఆ రాత్రి అక్కడ గడపడానికి ఇష్టపడలేదు. అతడు లేచి ప్రయాణమయ్యాడు. ప్రయాణం సాగించి యెబూసు (అంటే యెరూషలేము) దగ్గరికి వచ్చాడు. అతని ఉంపుడుగత్తెతో పాటు అతనితో కూడా జీను కట్టిన రెండు గాడిదలూ ఉన్నాయి.
11 Jebúsz mellett voltak, a nap pedig nagyon alászállott, akkor szólt a legény az urához: Jer csak, hadd térünk be a jebúszinak e városába és majd meghálunk benne.
౧౧వారు యెబూసును సమీపించినప్పుడు పూర్తిగా సాయంత్రం అయింది. అతని సేవకుడు అతనితో “మనం ఈ యెబూసీయుల ఊర్లోకి వెళ్దాం. దీనిలో ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
12 Szólt hozzá az ura: Ne térjünk be idegenek városába, kik nem Izraél fiai közül valók, hanem vonuljunk tova Gibeáig.
౧౨కానీ అతని యజమానుడు “ఇశ్రాయేలీయుల పట్టణాల్లోనే మనం బస చేద్దాం. ఇతరుల పట్టణాల్లో మనం ప్రవేశించం. మనం గిబియా వరకూ వెళ్దాం” అన్నాడు.
13 Mondta legényének: Jer, hadd közeledünk a helységek egyikéhez, hogy megháljunk Gibeában vagy Rámában.
౧౩తరువాత ఆ లేవీయుడు తన సేవకుడితో “నువ్వు రా, మనం రామాకు గానీ గిబియాకి గానీ వెళ్లి రాత్రికి అక్కడే గడుపుదాం.” అన్నాడు.
14 És tova vonultak és mentek; ekkor reájok alkonyodott a nap a Benjáminhoz tartozó Gibea mellett.
౧౪అలా వాళ్ళు ముందుకు ప్రయాణమయ్యారు. చివరకూ బెన్యామీను గోత్రానికి చెందిన గిబియాకు వచ్చారు. అప్పటికి చీకటి పడింది.
15 Betértek oda, hogy bemenjenek és megháljanak Gibeában; bement és leült a város piaczán, de nem volt senki, a ki befogadta őket a házba, hogy megháljanak.
౧౫కాబట్టి గిబియాలో ఆ రాత్రి గడపడానికి ఆ ఊరిలో ప్రవేశించారు. వారిని ఎవరూ తమ ఇంటికి ఆహ్వానించలేదు. కాబట్టి వారు ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక స్థలం లో కూర్చున్నారు.
16 De íme egy öreg ember jön munkájáról a mezőről este – a férfiú Efraim hegységéből volt, de Gibeában tartózkodott, a helység emberei pedig Benjáminbeliek –
౧౬అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు.
17 fölemelte szemeit és látta az utas férfiút a város piaczán; s mondta az öreg ember: Hová mész és honnan jössz?
౧౭ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు.
18 Szólt hozzá: Átmegyünk a Jehúdabeli Bét-Léchemből Efraim hegysége hátuljáig; onnan való vagyok és a Jehúdabeli Bét-Léchembe mentem, s az Örökkévaló házába akarok menni és nincs senki, ki engem befogadna a házba.
౧౮అందుకతడు “మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు
19 Szalma is, abrak is van ugyan szamaraink számára, kenyér és bor is van számomra és szolgálód számára, meg a legény számára, ki szolgáiddal van, nincsen hiány semmiben.
౧౯మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.” అన్నాడు.
20 Erre mondta az öreg ember: Béke veled, minden szükséged csak az én dolgom legyen, csak a piaczon ne hálj meg.
౨౦ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను
21 Bevezette őt házába és abrakot csinált a szamaraknak, megmosták lábaikat, ettek és ittak.
౨౧అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
22 Ők éppen jó kedvűek voltak, s íme a város emberei, alávaló emberek, körülvették a házat, dörömbölve az ajtón; és szóltak az öreg emberhez, a ház gazdájához, mondván: Vezesd ki a férfiút, a ki házadba jött, hadd ismerjük meg.
౨౨వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి” అన్నారు.
23 És kiment hozzájuk az ember, a ház gazdája, és mondta nekik: Ne, testvéreim, ne tegyetek, kérlek, rosszat; miután hogy bejött ez a férfiú házamba, ne kövessétek el ezt az aljasságot.
౨౩ఆ వృద్ధుడు బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు “సోదరులారా, వద్దు. దయచేసి అలాంటి దుర్మార్గపు పని చేయకండి. ఈ వ్యక్తి నా ఇంట్లో అతిథిగా ఉన్నాడు. ఈ నీచమైన పని చేయకండి.
24 Íme hajadon leányom és amannak ágyasa, hadd vezessem csak ki őket, gyalázzátok meg őket és tegyetek velük, a mi jónak tetszik szemeitekben; e férfiún azonban el ne kövessétek ezt az aljas dolgot.
౨౪చూడండి, నా కూతురు కన్య. ఆమే, ఆ వ్యక్తి ఉంపుడుగత్తే ఉన్నారు. వాళ్ళను నేను బయటకు తీసుకుని వస్తాను. వాళ్ళను మీ ఇష్టం వచ్చినట్లు చెరుపుకోండి. కాని ఈ వ్యక్తి విషయంలో అలాంటి దుర్మార్గపు పని చేయకండి” అన్నాడు.
25 De nem akartak reá hallgatni az emberek, ekkor megfogta a férfiú az ágyasát és kivezette hozzájuk az utczára; megismerték őt és játékot űztek vele egész éjjel reggelig, s elbocsátották, mikor feljött a hajnal.
౨౫కాని వాళ్ళు అతని మాట వినలేదు. దాంతో ఆ వ్యక్తి తన ఉంపుడుగత్తెను బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమెను పట్టుకుని రాత్రంతా మానభంగం చేస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నారు. తెల్లవారుతుండగా ఆమెను విడిచి వెళ్ళారు.
26 Jött az asszony hajnal fele; és lerogyott az ember házának bejáratán, a hol ura volt, virradtig.
౨౬ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న ఆ వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.
27 Midőn reggel fölkelt az ura, kinyitotta a ház ajtait és kiment, hogy utjára induljon; s íme, az asszony, az ő ágyasa, lerogyva a ház bejáratán és kezei a küszöbön.
౨౭ఉదయం ఆమె భర్త ప్రయాణమై వెళ్ళడానికి తలుపులు తీశాడు. అతని ఉంపుడుగత్తె ఆ ఇంటి గుమ్మం దగ్గర గడప మీద చేతులు చాపి పడి ఉంది.
28 És szólt hozzá: Kelj föl, hadd indulunk! De semmi felelet. Erre föltette a szamárra, fölkelt a férfiú és elment hazájába.
౨౮ఆ లేవీయుడు “లే వెళ్దాం” అన్నాడు. కానీ ఆమె జవాబివ్వలేదు. ఆమెను గాడిదపై వేసుకుని ఆ వ్యక్తి తన ఇంటికి ప్రయాణం సాగించాడు.
29 Midőn megérkezett házába, vette a kést, megfogta ágyasát és földarabolta őt tagjai szerint tizenkét darabra és szétküldte Izraél egész határában.
౨౯అతడు తన యింటికి వచ్చాక ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తె శరీరంలో ఏ భాగానికి ఆ భాగం మొత్తం పన్నెండు ముక్కలుగా కోశాడు. ఆ పన్నెండు ముక్కలను ఇశ్రాయేలీయులు నివసించే ప్రాంతాలన్నిటికీ పంపాడు.
30 És volt, mind a ki látta, így szólt: Nem történt és nem láttatott ilyesmi azon naptól fogva, hogy feljöttek Izraél fiai Egyiptom országából, mind e mai napig; fordítsatok rá gondot, tanakodjatok és beszéljetek!
౩౦దాన్ని చూసిన వారంతా “ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకూ ఇలాంటిది జరగడం మనం చూడలేదు, వినలేదు. దీని గురించి ఆలోచించండి! ఏం చేయాలో చెప్పండి” అంటూ ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

< Birák 19 >