< Jób 23 >

1 S felelt Jób és mondta:
అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.
2 Ma is ellenszegülő a panaszom: csapásom ránehezedik nyögésemre.
నేటివరకూ నేను రోషంతో మొర పెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది.
3 Vajha tudnám, hogy találhatom, hogy eljutok székhelyéig:
ఆయన నివాసస్థానం దగ్గరికి నేను చేరేలా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలిస్తే ఎంత బావుణ్ను.
4 eléje terjeszteném az ügyet és szájamat megtölteném bizonyításokkal;
ఆయన సమక్షంలో నేను నా వాదన వినిపిస్తాను. వాదోపవాదాలతో నా నోరు నింపుకుంటాను.
5 tudnám mely szavakkal felel nekem, s megérteném, mit mond nekem.
ఆయన నాకు జవాబుగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను. ఆయన నాతో పలికే మాటలను అర్థం చేసుకుంటాను.
6 Vajon erőnek teljével pörölne-e velem? Nem! Csakhogy ügyelne ő rám!
ఆయన తన అధికబలంతో నాతో వ్యాజ్యెమాడుతాడా? ఆయన అలా చేయడు. నా మనవి ఆలకిస్తాడు.
7 Akkor az egyenes szállt vele vitára, s örökre megmenekülnék bírámtól.
అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడగలుగుతాడు. కాబట్టి నేను నా న్యాయాధిపతి ఇచ్చే శిక్ష శాశ్వతంగా తప్పించుకుంటాను.
8 Lám, keletre megyek – s ő nincs ott, nyugatra: s nem veszem észre;
నేను తూర్పు దిశకు వెళ్లినా ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్లినా ఆయన కనబడడం లేదు.
9 balról midőn működik, nem nézhetem meg, jobbra fordul és nem látom.
ఆయన పనులు జరిగించే ఉత్తరదిశకు పోయినా ఆయన నాకు కానరావడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు. నేనాయనను చూడలేను.
10 Mert ismeri az utat, melyet követek; megvizsgálna: mint az arany kerülnék ki.
౧౦నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తరవాత నేను బంగారంలాగా కనిపిస్తాను.
11 Ösvényéhez ragaszkodott lábam, útját őriztem meg és nem hajlok el.
౧౧నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను.
12 Ajkai parancsától nem mozdulok el, törvényemnél fogva megóvtam szája szavait.
౧౨ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను.
13 De ő az egy, ki térítheti el? S a mit lelke megkívánt, azt megcselekszi.
౧౩అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.
14 Bizony befejezi azt, mi kiszabva van nekem s efféle sok van nála.
౧౪నా కోసం తాను సంకల్పించిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాటి పనులను ఆయన అసంఖ్యాకంగా జరిగిస్తాడు.
15 Azért rémülök meg miatta, elgondolkozom és rettegek tőle.
౧౫కాబట్టి ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించిన ప్రతిసారీ ఆయనకు భయపడుతున్నాను.
16 Hisz Isten csüggesztette el szívemet s a Mindenható rémített meg engem;
౧౬దేవుడు నా హృదయాన్ని కుంగజేశాడు. సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు.
17 mert nem a sötétség miatt semmisültem meg, sem mivel arczomat a homály borította.
౧౭అంధకారం కమ్మినా గాఢాంధకారం నన్ను కమ్మినా నేను నాశనమైపోలేదు.

< Jób 23 >