< 1 Mózes 30 >
1 Midőn Ráchel látta, hogy ő nem szült Jákobnak, irigykedett Ráchel az ő nővérére és mondta Jákobnak: Adj nekem gyermekeket, mert ha nem, meghalok én.
౧రాహేలు యాకోబు ద్వారా తనకు పిల్లలు కలగక పోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. ఆమె యాకోబుతో “నాకు గర్భఫలమియ్యి. లేకపోతే నేను చచ్చిపోతాను” అంది.
2 És fölgerjedt Jákob haragja Ráchel ellen és mondta: Vajon Isten helyében vagyok-e én, aki megvonta tőled a méhnek gyümölcsét?
౨యాకోబు కోపం రాహేలు మీద రగులుకుంది. అతడు “నీకు గర్భఫలం ఇవ్వకుండా ఉన్న దేవుని స్థానంలో నేను ఉన్నానా?” అన్నాడు.
3 És az mondta: Íme szolgálóm Bilhó, menj be hozzá és szüljön az én térdeimen, hogy felépüljek én is általa.
౩అందుకు ఆమె “నా దాసి బిల్హా ఉంది గదా, ఆమెతో రాత్రి గడుపు. ఆమె నా కోసం పిల్లలను కంటుంది. ఆ విధంగా ఆమె వలన నాకు కూడా పిల్లలు కలుగుతారు” అని చెప్పి
4 És odaadta neki Bilhót, az ő szolgálóját feleségül; és Jákob bement hozzá.
౪తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో లైంగికంగా కలిశాడు.
5 És fogant Bilhó és fiat szült Jákobnak.
౫అప్పుడు బిల్హా గర్భవతి అయ్యి యాకోబుకు ఒక కొడుకుని కన్నది.
6 És mondta Ráchel: Ítélt fölöttem Isten, meg is hallgatta szavamat és fiat adott nekem; azért nevezte el Dánnak.
౬అప్పుడు రాహేలు “దేవుడు నాకు తీర్పు తీర్చాడు. ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేశాడు” అనుకుని అతనికి “దాను” అని పేరు పెట్టింది.
7 Újra fogant és szült Bilhó, Ráchel szolgálója második fiút Jákobnak.
౭రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
8 És mondta Ráchel: Isteni küzdelmeket kűzdtem nővéremmel, győztem is; azért nevezte el Náftálinak.
౮అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.
9 És látta Léa, hogy nem szül többet, vette Zilpót, az ő szolgálóját és odaadta őt Jákobnak feleségül.
౯లేయా తనకు కానుపు ఉడిగిపోవడం చూసి తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.
10 És szült Zilpó, Léa szolgálója, Jákobnak fiat.
౧౦జిల్పా యాకోబుకు కొడుకుని కన్నది.
11 És mondta Léa: Megjött a szerencse; és elnevezte Gádnak.
౧౧అప్పుడు లేయా “ఇది అదృష్టమే గదా” అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టింది.
12 És szült Zilpó, Léa szolgálója, második fiút Jákobnak.
౧౨లేయా దాసి జిల్పా యాకోబుకు రెండవ కొడుకుని కన్నది.
13 És mondta Léa: Boldogságom ez, mert boldognak mondanak engem a leányok: és elnevezte Ásérnek.
౧౩లేయా “నేను భాగ్యవంతురాలిని. స్త్రీలు నన్ను భాగ్యవతి అంటారు కదా” అని అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.
14 És elment Rúbén a búzaaratás napjaiban és talált nadragulyákat a mezőn, elvitte azokat anyjának, Léának; és mondta Ráchel Léának: Adj csak nekem fiad nadragulyáiból.
౧౪గోదుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో మంత్రమూలిక వేర్లు చూసి తన తల్లి లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు “నీ కొడుకు తెచ్చిన మంత్రమూలికల్లో కొన్ని నాకు ఇవ్వు” అని లేయాతో అంది.
15 De ő mondta neki: Vajon kevés-e, hogy elveszed férjemet, még elvennéd fiam nadragulyáit is? És mondta Ráchel: Azért maradjon veled az éjjel fiad nadragulyáiért.
౧౫అందుకామె “నా భర్తను తీసుకున్నావు కదా, అది చాలదా? ఇప్పుడు నా కొడుకు తెచ్చిన మూలికలు కూడా తీసుకుంటావా” అంది. అందుకు రాహేలు “అలాగైతే నీ కొడుకు తెచ్చిన మూలికల నిమిత్తం నీ భర్త ఈ రాత్రి నీతో గడుపుతాడు” అని చెప్పింది.
16 Midőn Jákob jött a mezőről este, kiment elébe Léa és mondta: Hozzám jöjj be, mert bérbe vettelek fiam nadragulyáiért. És vele maradt az éjjel.
౧౬ఆ సాయంకాలం యాకోబు పొలం నుండి వచ్చేటప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్లి “నువ్వు నా దగ్గరికి రావాలి. నా కొడుకు తెచ్చిన మంత్రమూలికలతో నిన్ను కొన్నాను” అని చెప్పింది. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో ఉన్నాడు.
17 És meghallgatta Isten Leát, ez fogant és szült. Jákobnak ötödik fiút.
౧౭దేవుడు లేయా మనవి విన్నాడు, ఆమె గర్భవతి అయ్యి యాకోబుకు అయిదవ కొడుకుని కన్నది.
18 És mondta Léa: Isten megadta jutalmamat, hogy odaadtam szolgálómat férjemnek; és elnevezte Isszáchárnak.
౧౮లేయా “నా భర్తకు నా దాసిని ఇవ్వడం వలన దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడు” అనుకుని అతనికి “ఇశ్శాఖారు” అని పేరు పెట్టింది.
19 Léa újra fogant és szült Jákobnak hatodik fiút.
౧౯లేయా మళ్ళీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరవ కొడుకుని కన్నది.
20 És mondta Léa: Megajándékozott engem Isten ajándékkal, immár nálam fog lakni férjem, mert szültem neki hat fiút; és elnevezte Zebulúnnak.
౨౦అప్పుడు లేయా “దేవుడు నాకు మంచి బహుమతి దయచేశాడు. నా భర్తకు ఆరుగురు కొడుకులను కన్నాను. కాబట్టి అతడు ఇకపై నాతో కాపురం చేస్తాడు” అనుకుని అతనికి “జెబూలూను” అని పేరు పెట్టింది.
21 Azután szült egy leányt és elnevezte Dinának.
౨౧ఆ తరువాత ఆమె ఒక కూతురిని కని ఆమెకు దీనా అనే పేరు పెట్టింది.
22 És megemlékezett Isten Ráchelről, meghallgatta őt Isten és megnyitotta méhét;
౨౨దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని, ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాడు.
23 fogant és fiat szült és mondta: Elhárította Isten az én gyalázatomat.
౨౩అప్పుడామె గర్భవతి అయ్యి కొడుకును కని “దేవుడు నా నింద తొలగించాడు” అనుకుంది.
24 És elnevezte Józsefnek, mondván: Adjon még az Örökkévaló nekem másik fiút.
౨౪ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది.
25 És volt, amint szülte Ráchel Józsefet, mondta Jákob Lábánnak: Bocsáss el engem, hadd menjek el helységembe és országomba.
౨౫రాహేలు యోసేపును కన్న తరువాత యాకోబు లాబానుతో “నన్ను పంపివెయ్యి. నా స్థలానికి, నా దేశానికి తిరిగి వెళ్తాను.
26 Add ide feleségeimet és gyermekeimet, akikért téged szolgáltalak, hadd menjek el; mert te ismered szolgálatomat, amellyel szolgáltalak.
౨౬నా భార్యలను, నా పిల్లలను నా కప్పగించు. నేను వెళ్ళిపోతాను, వారి కోసం నీకు సేవ చేశాను. నేను సేవ చేసిన విధానం నీకు తెలుసు కదా” అని చెప్పాడు.
27 És mondta neki Lábán: Ha ugyan kegyet találtam szemeidben – sejtem, hogy az Örökkévaló megáldott engem miattad.
౨౭అందుకు లాబాను అతనితో “నీ దయ నా మీద ఉంటే నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడని నేను శకునం చూసి తెలుసుకున్నాను.
28 És mondta: Szabd ki béredet rám és megadom.
౨౮నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను” అన్నాడు.
29 És mondta neki: Te tudod, miként szolgáltalak és mivé lett a te nyájad nálam.
౨౯యాకోబు అతణ్ణి చూసి “నేను నీకేవిధంగా సేవ చేశానో, నీ మందలు నా దగ్గర ఎలా ఉండేవో అది నీకు తెలుసు.
30 Mert kevés az, amid volt énelőttem és elterjedt sokasággá, az Örökkévaló megáldott téged nyomomban; és most, mikor tegyek valamit én is az én házamért?
౩౦నేను రాకముందు నీకున్నది కొంచెమే, అయితే అది బాగా అభివృద్ధి పొందింది. నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అయితే నేను నా స్వంత ఇంటివారి కోసం ఎప్పుడు సంపాదించుకుంటాను?” అన్నాడు.
31 És ő mondta: Mit adjak neked? És mondta Jákob: Ne adj nekem semmit; ha megteszed nekem ezt a dolgot, ismét legeltetem juhaidat és őrzöm.
౩౧అప్పుడు లాబాను “నేను నీకేమివ్వాలి?” అని అడిగాడు. అందుకు యాకోబు “నువ్వు నాకేమీ ఇయ్యవద్దు, నువ్వు నాకోసం నేను చెప్పిన విధంగా చేస్తే, నేను తిరిగి నీ మందను మేపుతూ వాటి బాగోగులు చూస్తాను.
32 Bejárom ma összes juhaidat, eltávolítván onnan minden bárányt, mely pöttyös és foltos és minden sötétszínű bárányt a juhok közül, meg a foltost és pöttyöst a kecskék közül; ez legyen a bérem.
౩౨ఈ రోజు నేను నీ మంద అంతటిలో నడచి చూసి పొడలైనా మచ్చలైనా గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లల్లో నల్లని ప్రతిదానినీ, మేకల్లో మచ్చలైనా, పొడలైనా గలవాటినీ వేరు చేస్తున్నాను. అలాటివన్నీ నాకు జీతమౌతాయి.
33 És tanuskodjék mellettem igazságom a holnapi napon, ha majd eljössz béremhez, mely előtted van; minden, ami nem pöttyös és foltos a kecskék között és sötétszínű a juhok között, lopott az nálam.
౩౩ఇక ముందు నాకు రావలసిన జీతం గూర్చి నువ్వు చూడడానికి వచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం అవుతుంది. మేకల్లో పొడలూ మచ్చలూ లేనివీ, గొర్రెపిల్లల్లో నల్లగా లేనివీ నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని చెప్పవచ్చు” అన్నాడు.
34 És Lábán mondta: Igen, vajha lenne szavad szerint.
౩౪అందుకు లాబాను “మంచిది, నీ మాట ప్రకారమే కానివ్వు” అన్నాడు.
35 És eltávolította aznap a bakokat, a tarka lábúakat és foltosakat és mind a kecskéket, a pöttyöseket meg a foltosakat, mindazt, amelyen valami fehér volt és minden sötétszínűt a juhok közül; és adta fiai kezére.
౩౫ఆ రోజు లాబాను చారలూ, మచ్చలూ ఉన్న మేకపోతులనూ, పొడలూ మచ్చలూ గల ఆడ మేకలనూ కొంచెం తెలుపు గల ప్రతిదానినీ గొర్రెపిల్లల్లో నల్లవాటినీ అన్నిటినీ వేరుచేసి తన కొడుకులకు అప్పగించాడు.
36 És hagyott három napi utat maga között és Jákob között; Jákob pedig legeltette Lábánnak többi juhait.
౩౬తనకూ యాకోబుకూ మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబానుకు చెందిన మిగిలిన మందను యాకోబు మేపుతూ ఉన్నాడు.
37 És vett magának Jákob friss nyárfapálcát és mogyoró- meg gesztenyefát és héjazott rajtuk fehér csíkokat, megmeztelenítvén a fehéret, mely a pálcákon volt.
౩౭యాకోబు గంగ రావి, బాదం, సాల చెట్ల చువ్వలు తీసుకు ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచాడు.
38 És odaállította a pálcákat, melyeket lehéjazott, a vályúkba, a vízitatókba, ahova mennek a juhok, hogy igyanak, szemközt a juhokkal és felhevültek, midőn eljöttek inni.
౩౮మందలు నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టడం కోసం అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలవల్లో, నీటి గాళ్ళలో, వాటి ముందు పెట్టాడు.
39 És felhevültek a juhok a pálcáknál; és ellettek a juhok tarkalábúakat, pöttyöseket és foltosakat.
౩౯అప్పుడు ఆ మందలు ఆ చువ్వల ముందు చూలు కట్టి చారలు, పొడలు, మచ్చలు గల పిల్లలను ఈనాయి.
40 A bárányokat elkülönítette Jákob és fordította a juhok arcát a tarkalábúak felé és minden sötétszínű felé Lábán juhai között; és külön helyezett el magának nyájakat és nem helyezte azokat Lábán juhaihoz.
౪౦యాకోబు ఆ గొర్రెపిల్లలను వేరుచేసి, చారలుగల వాటి వైపుకు, లాబాను మందల్లో నల్లని వాటి వైపుకు మందల ముఖాలు తిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.
41 És volt, valahányszor felhevültek a korai juhok, akkor odatette Jákob a pálcákat a juhok szemei elé a vályúkba, hogy felhevüljenek a pálcáknál.
౪౧మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి ఆ చువ్వల ముందు చూలు కట్టే విధంగా యాకోబు మందకు ఎదురుగా కాలవల్లో ఆ చువ్వలు పెట్టాడు.
42 Midőn pedig későn ellettek a juhok, nem tette oda; és lettek a későn ellők Lábáné, a koraiak Jákobé.
౪౨మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఆ విధంగా బలహీనమైనవి లాబానుకూ బలమైనవి యాకోబుకూ వచ్చాయి.
43 És kiterjeszkedett a férfiú igen nagyon és volt neki sok juha, szolgálója, szolgája, tevéje és szamara.
౪౩ఆ విధంగా ఆ మనిషి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు.