< Ezékiel 37 >
1 Volt rajtam az Örökkévaló keze, kivitt engem az Örökkévaló szelleme által és letett a síkság közepén, az pedig telve volt csontokkal.
౧యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు.
2 És elvezetett engem mellettök köröskörül és íme sok volt belőlük a síkság színén és íme nagyon szárazak.
౨ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి.
3 És szólt hozzám: Ember fia, fel fognak-e éledni ezek a csontok? Mondtam: Uram, Örökkévaló, te tudod.
౩ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను.
4 És szólt hozzám: Prófétálj ezekről a csontokról és szólj hozzájuk: száraz csontok ti, halljátok az Örökkévaló igéjét.
౪అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి.
5 Így szól az Úr, az Örökkévaló a csontoknak: Íme én hozok belétek szellemet, hogy föléledjetek;
౫ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను.
6 és adok reátok inakat és hozok reátok húst és vonok reátok bőrt és adok belétek szellemet, hogy föléledjetek; és megtudjátok, hogy én vagyok az Örökkévaló.
౬మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
7 És prófétáltam, a mint megparancsoltatott nekem; és zörej lett, amint prófétáltam és íme rengés és közeledtek a csontok, csont a csontjához.
౭ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి.
8 És láttam és íme voltak rajtuk inak és hús növekedett és bőr vonult rájuk felül, de szellem nem volt bennök;
౮నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు.
9 És szólt hozzám: Prófétálj a szellemnek, prófétálj, ember fia, és szólj a szellemhez: így szól az Úr, az Örökkévaló: a négy szél felől jőjj el szellem és lehelj ezekre a megöltekre, hogy föléledjenek.
౯అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా”
10 És prófétáltam, a mint megparancsolta nekem, és jött beléjök a szellem, föléledtek és lábaikra állottak, felette nagy sereg.
౧౦ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
11 Erre szólt hozzám: Ember fia, ezek a csontok, Izraél egész háza azok. Íme azt mondják: elszáradtak csontjaink és elveszett reménységünk, el vagyunk vágva!
౧౧అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు.
12 Azért prófétálj és szólj hozzájuk: Így szól az Úr, az Örökkévaló: íme én megnyitom sírjaitokat és fölhozlak benneteket sírjaitokból, népem, és beviszlek benneteket Izraél földjére.
౧౨కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.
13 És megtudjátok, hogy én vagyok az Örökkévaló, mikor megnyitom sírjaitokat és mikor felhozlak benneteket sírjaitokból, népem.
౧౩నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే
14 És adom belétek szellememet, hogy föléledjetek és odahelyezlek benneteket földetekre; és megtudjátok, hogy én vagyok az Örökkévaló, beszéltem és megcselekszem, úgymond az Örökkévaló.
౧౪నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
15 És lett hozzám az Örökkévaló igéje, mondván:
౧౫యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
16 Te pedig, ember fia, végy magadnak egy fát és írd reá: Jehúdáé és társaié, Izraél fiaié; és végy egy fát és írd reá: Józsefé, Efraim fája, és egész Izraélé, a társaié.
౧౬నరపుత్రుడా, నువ్వు ఒక కర్ర తీసుకుని దాని మీద, యూదావాళ్ళదీ, వాళ్ళ తోటివాళ్ళు ఇశ్రాయేలీయులదీ అని పేర్లు రాయి. మరో కర్ర తీసుకుని దాని మీద, ఎఫ్రాయిము కొమ్మ, అంటే యోసేపు వంశస్థులదీ, వాళ్ళ తోటి వాళ్ళు ఇశ్రాయేలీయులందరిదీ, అని రాయి.
17 És közelítsd azokat egyiket a másikhoz egy fává neked, hogy eggyé legyenek kezedben.
౧౭అప్పుడు ఆ రెండూ నీ చేతిలో ఒక్కటయ్యేలా ఒక దానితో ఒకటి జోడించు.
18 És midőn majd így szólnak hozzád néped fiai, mondván: nem mondanád meg nekünk, mik ezek neked?
౧౮వీటి అర్థం ఏంటి? అని నీ ప్రజలు నిన్నడిగితే, వాళ్ళకిలా చెప్పు.
19 – beszélj hozzájuk: Így szól az Úr, az Örökkévaló: íme átveszem József fáját, mely Efraim kezében van és Izraél törzseiét az ő társaiét, és teszem azokat vele együtt Jehúda fájához és egy fává teszem őket, hogy eggyé legyenek kezemben.
౧౯యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిము చేతిలో ఉన్న కొమ్మ, అంటే ఏ కొమ్మ మీద ఇశ్రాయేలువారందరి పేర్లు, వాళ్ళ తోటివాళ్ళ పేర్లు, నేను ఉంచానో, ఆ యోసేపు అనే ఆ కొమ్మను యూదావాళ్ళ కొమ్మను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన కొమ్మగా చేస్తాను.
20 És legyenek a fák, a melyekre írni fogsz, a te kezedben szemeik előtt;
౨౦ఆ రెండు కొమ్మలను వాళ్ళ ఎదుట నువ్వు చేతిలో పట్టుకో.
21 akkor beszélj hozzájuk: így szól az Úr, az Örökkévaló: Íme én elveszem Izraél fiait azon nemzetek közül, a hova mentek és összegyűjtöm őket köröskörül és elviszem őket földjükre.
౨౧వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను.
22 És egy nemzetté teszem őket az országban Izraél hegyein és egy király lesz mindnyájuknak királyul; és nem lesznek többé két nemzetté és nem oszlanak többé fel két királysággá.
౨౨వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను.
23 És nem tisztátalanítják meg többé magukat bálványaikkal és undokságaikkal és mind a bűntetteikkel; és kiszabadítom őket mind az elpártolásaikból, a melyekkel vétkeztek és megtisztítom őket és lesznek nekem népül, én pedig leszek nekik Istenül.
౨౩తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
24 És szolgám Dávid király fölöttük és egy pásztoruk lesz mindnyájuknak, és rendeleteim szerint fognak járni és törvényeimet megőrzik és cselekszik azokat.
౨౪నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు.
25 És lakni fognak abban az országban, melyet Jákób szolgámnak adtam, a melyben laktak őseitek; lakni fognak rajta ők és fiaik és fiaik fiai örökké, Dávid szolgám pedig fejedelmük lesz nekik örökre.
౨౫నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు.
26 És kötöm velök a béke szövetségét, örök szövetség lesz velök; elhelyezem és megsokasítom őket és szentélyemet teszem közéjük örökre.
౨౬నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
27 És fölöttük lesz lakóhelyem és leszek nekik Istenül, ők pedig lesznek nekem népül.
౨౭నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.
28 És megtudják a nemzetek, hogy én, az Örökkévaló, szentelem meg Izraélt, midőn köztük van az én szentélyem örökre.
౨౮వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.