< Ezékiel 23 >
1 És lett hozzám az Örökkévaló igéje, mondván:
౧యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు,
2 Ember fia, volt két asszony, egy anyának leányai.
౨“నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.
3 És paráználkodtak Egyiptomban, ifjúkorukban paráználkodtak ott nyomkodták emlőiket, ott szorítgatták szűz mellüket.
౩వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనంలోనే వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి.
4 Neveik pedig: Ohola az idősebbik, Oholíba a nővére; enyéim lettek és szültek fiakat és leányokat. És neveik: Sómrón Ohola és Jeruzsálem Oholiba.
౪వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె చెల్లి పేరు ఒహొలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నాకు కొడుకులనూ, కూతుళ్ళనూ కన్నారు. ఒహొలా అనే పేరుకు షోమ్రోను, ఒహొలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం.
5 És paráználkodott Ohola mellettem és gerjedezett szeretői iránt, az Assúrbeliek, a harcosok iránt;
౫ఒహొలా నాది అయినప్పటికీ, వ్యభిచారం చేసి
6 kék bíborba öltözöttek, helytartók és kormányzók, kívánatos ifjak, mindannyian lovasok, lovakon nyargalók.
౬తన విటుల మీద మొహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
7 És odaadta paráználkodását nekik, kik valamennyien Assúr válogatott fiai: és mindazokkal, akik iránt gerjedezett, mind a bálványaikkal megtisztátalanodott.
౭అష్షూరు వాళ్ళల్లో ముఖ్యులైన వాళ్ళందరి ఎదుట ఒక వేశ్యలా తిరుగుతూ, వాళ్ళందరితో వ్యభిచారం చేస్తూ, వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలన్నిటినీ ఆశించి తనను అపవిత్రం చేసుకుంది.
8 De Egyiptombeli paráználkodását nem hagyta abban, mert vele háltak ifjú korában és szorítgatták szűz mellét és ráöntötték paráználkodásukat.
౮ఐగుప్తులో దాని యౌవ్వనంలోనే వాళ్ళు దాని చను మొనలు నలిపి, దానితో పండుకుని, వాళ్ళ కామం దాని మీద ఒలకబోసినప్పుడు అది నేర్చుకున్న వేశ్య ప్రవర్తన విడిచిపెట్టలేదు.
9 Azért szeretőinek kezébe adtam őt, Assúr fiainak kezébe, akik iránt gerjedezett.
౯కాబట్టి దాని విటులకు నేను దాన్ని అప్పగించాను. అది మోహించిన అష్షూరు వాళ్లకు దాన్ని అప్పగించాను.
10 Ők felfedték szemérmét, fiait és leányait elvették, őt magát pedig karddal ölték meg; példává lett az asszonyoknak és büntetést végeztek rajta.
౧౦వాళ్ళు దాని వస్త్రాలు తీసేసి నగ్నంగా చేశారు. దాని కొడుకులను, కూతుళ్ళను పట్టుకుని, దాన్ని కత్తితో చంపారు. ఆ విధంగా ఆమె ఇతర స్త్రీలకు అవమానంగా అయ్యింది. కాబట్టి ఇతర స్త్రీలు దాని మీద వాళ్ళ తీర్పు చెప్పారు.
11 Látta ezt Oholiba nővére és romlottabban űzte gerjedezését nála és paráználkodását nővére paráznaságánál.
౧౧దాని చెల్లెలైన ఒహొలీబా దాన్ని చూసి, కామంలో దాన్ని మించిపోయి, అక్క చేసిన వ్యభిచారం కంటే ఇంకా అధికంగా పోకిరీతనం జరిగించింది.
12 Assúr fiai iránt gerjedezett: helytartók, kormányzók, harcosok, teljes díszbe öltözöttek; lovasok, lovakon nyargalók, kívánatos ifjak valamennyien.
౧౨అష్షూరు వాళ్ళల్లో ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది.
13 És láttam, hogy megtisztátlanúlt: egy útja van mindkettejüknek.
౧౩అది తనను అశుద్ధం చేసుకుందని నేను గమనించాను. ఇద్దరు అక్కాచెల్లెళ్ళూ ఆ విధంగానే చేశారు.
14 De még hozzátett paráználkodásához: látott a falra rajzolt férfiakat, kaldeusok; képeit, vörös festékkel megrajzolva;
౧౪అప్పుడు అది తన వ్యభిచార క్రియలు ఇంకా అధికం చేసింది. ఎర్రని రంగుతో గోడ మీద చెక్కిన కల్దీయ పురుషుల ఆకారాలు చూసింది.
15 övkötők a derekukon lelógó süvegek a fejükön, látásra vitézek valamennyien, Bábel fiainak hasonlóságára, Kaszdím a szülőföldjük:
౧౫మొలలకు నడికట్లు, తలల మీద విచిత్రమైన తలపాగాలు పెట్టుకుని, తమ జన్మదేశమైన బబులోను రథాలపై కూర్చున్న అధిపతుల స్వరూపాలు చూసి మోహించింది.
16 és gerjedezett irántuk szemeinek látására, és küldött hozzájuk követeket Kaszdímba.
౧౬అది వాళ్ళను చూసిన వెంటనే మోహించి, కల్దీయ దేశానికి వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి వాళ్ళను పిలిపించుకుంది.
17 És eljöttek hozzá Bábel fiai szerelmes hálásra és megfertőztették őt paráználkodásukkal, s megtisztátalanult általuk, és elszakadt tőlük a lelke.
౧౭బబులోనువాళ్ళు పడుపు కోసం కోరి వచ్చి వ్యభిచారంతో దాన్ని అపవిత్రం చేశారు. వాళ్ళ చేత అది అపవిత్రం అయిన తరువాత, దాని మనస్సు వాళ్ళ మీద నుంచి తిరిగి పోయింది.
18 S midőn feltárta paráználkodását és felfedte szemérmét, elszakadt tőle a lelkem, amint elszakadt volt lelkem a nővérétől.
౧౮ఈ విధంగా అది వ్యభిచారం అధికంగా చేసి, తన నగ్నత బహిర్గతం చేసి, దాన్ని పోగొట్టుకుంది గనుక తన అక్క విషయంలో నా మనస్సు తిరిగి పోయినట్టు దాని విషయంలో కూడా నా మనస్సు తిరిగిపోయింది.
19 És gyarapította paráználkodását, megemlékezvén ifjúkorának napjáról, midőn paráználkodott Egyiptom országában.
౧౯తన యవ్వనంలో ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనస్సుకు తెచ్చుకుని, ఆ తరువాత అది ఇంకా ఎన్నో వ్యభిచార క్రియలు జరిగించింది.
20 És gerjedezett ágyasai iránt, akiknek szamártest a testük és lovak ömlése az ömlésük.
౨౦గాడిద పురుషాంగం వంటి, గుర్రాల అంగాల వంటి అంగాలు కలిగిన తన విటులను మోహించింది.
21 Gondoltál ifjúkorod fajtalanságára, midőn az Egyiptombeliek szorítgatták melledet ifjúkorod emlői kedvéért.
౨౧యవ్వనంలో నువ్వు ఐగుప్తీయుల చేత నీ లేత చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని, అప్పటి సిగ్గుమాలిన ప్రవర్తన మళ్ళీ జరిగించింది.
22 Azért, Oholíba, így szól az Úr, az Örökkévaló, íme én fölserkentem ellened szeretőidet, azokat, akiktől elszakadt lelked és rád hozom őket mindenfelől.
౨౨కాబట్టి ఒహొలీబా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే. నీ మనస్సుకు దూరమైన నీ విటులను రేపి, నాలుగు వైపుల నుంచి వాళ్ళను నీ మీదకి రప్పిస్తాను.
23 Bábel fiait és mind a kaldeusokat, Pekód és Sóa és Kóa, mind az Assúr fiai ő velük; kívánatos ifjak, helytartók és kormányzók mindannyian, vitézek és hivatottak, lovakon nyargalók mindnyájan.
౨౩గుర్రాలు స్వారీ చేసే బబులోను వాళ్ళను, కల్దీయులను. అధిపతులను, ప్రధానాధికారులనందరిని, అష్షూరీయులను. అందంగా ఉండే శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను, అందరినీ నీ మీదకి నేను రప్పిస్తున్నాను.
24 És ellened jönnek tömegben, szekérrel s kerékkel és népek gyülekezetével, vérttel, pajzzsal és sisakkal megszállnak téged köröskörül; és eléjük teszem az ítéletet, hogy ítéljenek téged ítéletük szerint.
౨౪ఆయుధాలు పట్టుకుని, బళ్ళు కట్టిన రథాలతో, పెద్ద సైన్యంతో వాళ్ళు నీ మీదకి వచ్చి. పెద్ద డాళ్ళు, చిన్న డాళ్ళు పట్టుకుని, ఇనుప టోపీలు పెట్టుకుని వాళ్ళు నీ మీదకి వచ్చి. నిన్ను ముట్టడిస్తారు. వాళ్ళు తమ చేతలతో నిన్ను శిక్షించేలా నేను వాళ్లకు అవకాశం ఇస్తాను.
25 És végzem rajtad buzgalmamat és elbánnak veled haraggal: orrodat és füleidet eltávolítják és maradékod kard által fog elesni, ők el fogják venni fiaidat és leányaidat, és maradékod tűzben emésztetik föl.
౨౫ఉగ్రతతో వాళ్ళు నిన్ను శిక్షించేలా నా కోపం నీకు చూపిస్తాను. వాళ్ళు నీ ముక్కూ, చెవులూ కోస్తారు. నీలో మిగిలిన వాళ్ళు కత్తివాత పడి చస్తారు. నీ సంతానం అగ్నికి ఆహుతి అయ్యేలా, నీ కొడుకులనూ, నీ కూతుళ్ళనూ వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు.
26 És levetik rólad ruháidat és elveszik pompás holmidat.
౨౬నీ బట్టలు లాగేసి, నీ ఆభరణాలన్నీ తీసేస్తారు.
27 És eltűntetem belőled fajtalanságodat és az Egyiptom országából való paráználkodásodat és nem fogod fölemelni hozzájuk szemeidet és Egyiptomról nem fogsz megemlékezni többé.
౨౭ఐగుప్తు దేశంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన, నీ వ్యభిచార క్రియలు నీనుంచి తొలగిస్తాను. నువ్వు ఇంక నీ కళ్ళెత్తి ఐగుప్తు వైపు ఆశగా చూడవు. దాని గురించి ఇంక ఆలోచించవు.
28 Mert így szól az Úr, az Örökkévaló: íme én adlak téged azok kezébe, kiket gyűlölsz, azok kezébe, akiktől elszakadt a lelked.
౨౮ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు! నువ్వు ద్వేషించిన వాళ్ళకూ, నీ మనస్సు దూరమైన వాళ్ళకూ నిన్ను అప్పగిస్తున్నాను.
29 És elbánnak veled gyűlölettel és elveszik minden szerzeményedet és ott hagynak meztelenül és mezítelenül, és fel fog tárulni a te parázna szemérmed, fajtalanságod és paráználkodásod.
౨౯ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా, నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి ఔతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ప్రవర్తన వెల్లడి ఔతుంది.
30 Ezeket teszik veled, mivelhogy paráználkodtál nemzetek után, azért, hogy megtisztátlanultál bálványaikon.
౩౦నువ్వు అన్యప్రజలతో చేసిన వ్యభిచారం కారణంగా, నువ్వు వాళ్ళ విగ్రహాలు పూజించి అపవిత్రం అయిన కారణంగా నీకు ఇవి జరుగుతాయి. నీ అక్క ప్రవర్తించినట్టు నువ్వు కూడా ప్రవర్తించావు గనుక ఆమె తగిన శిక్షాపాత్ర నీ చేతికిస్తాను.
31 Nővérednek útján jártál, adom tehát az ő serlegét a kezedbe.
౩౧ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే నీ అక్క తాగిన, లోతైన వెడల్పైన పాత్రలోనిది నీవు కూడా తాగాలి.
32 Így szól az Úr, az Örökkévaló: Nővéred serlegét fogod inni, a mélyet és széleset – ez nevetségül és gúnyul lesz – a sokat magában foglalót -
౩౨ఆ గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది, గనుక నువ్వు ఒక ఎగతాళిగానూ, పరిహాసంగానూ ఔతావు.
33 részegséggel és bánattal fogsz megtelni – a pusztulás és pusztaság serlegét, Sómrón nővérednek a serlegét.
౩౩ఇది నీ అక్క షోమ్రోను గిన్నె! ఇది భయంతోనూ, వినాశనంతోనూ నిండినది. నువ్వు ఇది తాగి కైపెక్కి దుఃఖంతో నిండి ఉంటావు.
34 Megiszod azt és kiszívod és cserepeit lerágod és emlőidet megtéped; mert én beszéltem, úgymond az Úr, az Örökkévaló.
౩౪అడుగు వరకూ దాని తాగి, ఆ గిన్నె చెక్కలు చేసి, వాటితో నీ స్తనాలు పెరికేసుకుంటావు. ఇది నేనే ప్రకటించాను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
35 Azért így szól az Úr, az Örökkévaló: Mivelhogy megfeledkeztél rólam és hátad mögé vetettél engem, viseld tehát te is fajtalanságodat és paráználkodásodat.
౩౫ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నువ్వు నన్ను మరిచిపోయి నన్ను వెనక్కి తోసేశావు గనుక నీ సిగ్గుమాలిన ప్రవర్తనకూ, నీ వ్యభిచార క్రియలకూ రావలసిన శిక్ష నువ్వు భరిస్తావు.”
36 És szólt hozzám az Örökkévaló: Ember fia, akarod-e ítélni Oholát és Oholíbát? Hát mondd meg nekik utálatosságaikat!
౩౬యెహోవా నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, ఒహొలాకునూ, ఒహొలీబాకునూ నువ్వు తీర్పు తీరుస్తావా? అలా ఐతే వాళ్ళ అసహ్యమైన పనులు వాళ్లకు తెలియజేయి.
37 Hogy házasságot törtek és vér van kezeiken, bálványaikkal törtek házasságot, és fiaikat is, akiket nekem szültek, tűzön vezették át nekik eledelül.
౩౭వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.
38 Továbbá ezt tették velem: megfertőztették szentélyemet azon a napon, és szombatjaimat megszentségtelenítették.
౩౮ఇంకా వాళ్ళు ఇలాగే నా పట్ల జరిగిస్తున్నారు. ఇంతే కాక, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన రోజే, నేను నియమించిన విశ్రాంతి దినాలను కూడా అపవిత్రం చేశారు.
39 S amikor levágták fiaikat bálványaiknak, azon napon bementek szentélyembe, hogy megszentségtelenítsék; íme így cselekedtek az én házamban.
౩౯తాము పెట్టుకున్న విగ్రహాల పేరట తమ పిల్లలను చంపిన రోజే, వాళ్ళు నా పవిత్ర ప్రాంగణంలోకి వచ్చి దాన్ని అపవిత్రం చేసి, నా మందిరంలోనే వాళ్ళు ఈ విధంగా చేశారు.
40 Sőt hogy küldtek messziről jövő emberekhez, akikhez követ küldetik, és íme eljönnek, akiknek kedvéért megmosdottál, kendőzted szemeidet és díszítetted magadat dísszel;
౪౦దూరంగా ఉన్నవాళ్ళను పిలిపించుకోడానికి వాళ్ళు వర్తమానికులను పంపారు. వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ కోసం నువ్వు స్నానం చేసి, కళ్ళకు రంగు వేసుకుని, నగలు ధరించి,
41 És pompás ágyra ültél, s előtte terített asztal, és tömjénemet és olajamat tetted rája;
౪౧ఒక అందమైన మంచం మీద కూర్చుని, ఒక బల్ల సిద్ధం చేసి, దాని మీద నా పరిమళ ధూపద్రవ్యం, నా నూనె పెట్టావు.
42 És jókedvű tömegnek zaja benne, és az emberek sokaságából való férfiakhoz hozatnak részegesek a pusztából, és karpereczeket tettek kezeikre és pompás oronát a fejeikre.
౪౨అప్పుడు అక్కడ ఆమెతో నిర్లక్ష్యంగా ఉన్న ఒక గుంపు సందడి వినిపించింది. ఆ గుంపులో చేరిన తాగుబోతులు ఎడారి మార్గం నుంచి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈ వేశ్యల చేతులకు కడియాలు తొడిగి, వాళ్ళ తలలకు పూదండలు చుట్టారు.
43 És azt mondtam a házasságtörésben elnyüttről: Most majd paráználkodnak paráználkodása szerint, meg ő is.
౪౩వ్యభిచారం చెయ్యడం వల్ల బలహీనురాలైన దానితో నేను ఇలా అన్నాను, ‘ఇప్పుడు వాళ్ళు దానితో, అది వాళ్ళతో వ్యభిచారం చేస్తారు.’
44 Bementek hozzá, a mint bemennek parázna asszonyhoz; úgy mentek be Oholához és Oholíbához, a fajtalan asszonyokhoz.
౪౪వేశ్యతో చేసినట్టు వాళ్ళు దానితో చేశారు. అలాగే వాళ్ళు వేశ్యలైన ఒహొలాతోనూ, ఒహొలీబాతోనూ చేశారు.
45 De igaz emberek – azok fogják őket ítélni, a mint ítélnek házasságtörőket és a mint ítélnek vérontónőket, mert házasságtörők ők és vér van kezeiken.
౪౫కాని, నీతిగల పురుషులు వ్యభిచారిణులకూ, రక్తపాతం జరిగించిన వారికీ రావలసిన శిక్షను విధిస్తారు. ఎందుకంటే, వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది.”
46 Mert így szól az Úr, az Örökkévaló: Hozzanak rájuk gyülekezetet és tegyék őket iszonyattá és prédává.
౪౬కాబట్టి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వాళ్ళ మీదకి నేను సైన్యాన్ని రప్పిస్తాను. భయభీతులుగా చెయ్యడానికీ, కొల్లగొట్టుకుపోడానికీ వాళ్ళను శత్రువులకు అప్పగిస్తాను.
47 És hajítson reájuk a gyülekezet követ és vágják őket szét kardjaikkal; fiaikat és leányaikat öljék meg, és házaikat égessék el tűzben.
౪౭ఆ సైనికులు రాళ్లు రువ్వి వాళ్ళను చంపుతారు. కత్తితో హతం చేస్తారు. వాళ్ళ కొడుకులనూ, కూతుళ్ళనూ చంపుతారు. వాళ్ళ ఇళ్ళను అగ్నితో కాల్చేస్తారు.
48 És megszüntetem a fajtalanságot az országból, és okulni fognak mind az asszonyok és nem fognak cselekedni a ti fajtalanságtok szerint.
౪౮స్త్రీలందరూ మీ వేశ్యాప్రవర్తన ప్రకారం చెయ్యకూడదనే సంగతి నేర్చుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనను దేశంలో ఉండకుండాా తొలగిస్తాను.
49 És reátok teszik fajtalanságtokat és a bálványokkal való vétkeiteket viselni fogjátok; és megtudjátok, hogy én vagyok az Úr, az Örökkévaló.
౪౯నేనే యెహోవానని మీరు తెలుసుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనకు శిక్ష వస్తుంది. విగ్రహాలను పూజించిన పాపం మీరు భరిస్తారు.