< Ezékiel 17 >

1 És lett hozzám az Örökkévaló igéje, mondván:
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
2 Ember fia, adj fel egy rejtvényt és mondj egy példázatot Izrael házáról.
“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక పొడుపు కథ వెయ్యి. ఒక ఉదాహరణ వారికి చెప్పు.
3 És mondjad: így szól az Úr, az Örökkévaló. A nagy sas, a nagy szárnyú, hosszú tollú, teli tollazatú, melynek tarka a színe, eljött a Libazonba és elvette a cédrusnak sudarát;
ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఒక పెద్ద డేగ ఉంది. దానికి పెద్ద రెక్కలున్నాయి. వాటి నిండుగా ఈకలున్నాయి. దానికి అనేక రంగులతో దట్టమైన రెక్కలు ఉన్నాయి. ఈ రంగుల పక్షి లెబానోనుకి వెళ్ళి అక్కడ ఒక దేవదారు చెట్టుపై వాలింది.
4 gallyainak legfelsőbbjét letépte és elvitte kalmárok országába, kereskedők városában helyezte el.
అది ఆ చెట్టు లేత కొమ్మల చిగుళ్ళు తుంచి, వాటిని కనాను దేశానికి తీసుకు వెళ్ళింది. అక్కడ వర్తకులుండే పట్టణంలో వాటిని నాటింది.
5 És vett az ország vetéséből és vetésre való mezőbe tette, elvitte nagy víz mellé, fűzfaképen helyezte el.
అది ఆ దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది. విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది. వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది.
6 Kisarjadt és terjeszkedő szőlőtővé lett, alacsony termetűvé úgy hogy ágai hozzáhajoltak és gyökerei alatta voltak; és szőlőtővé lett, vesszőket hajtott és ágacskákat eresztett.
అది మొలకలు వేసింది. పైకి పెరగకుండా భూమిపై ఎత్తు పెరగకుండానే విశాలమైన కొమ్మలతో నేలపై వ్యాపించి పెద్ద ద్రాక్షావల్లి అయింది. దాని కొమ్మలు ఆ డేగ వరకూ వ్యాపించాయి. దాని వేళ్ళు డేగ కింద వైపుకు వ్యాపించాయి. ఆ విధంగా ఆ ద్రాక్ష చెట్టు అనేక శాఖలతో వర్ధిల్లి కొత్తగా రెమ్మలు వేసింది.
7 De volt egy nagy sas, nagy szárnyú és sok tollozatú és íme, ez a szőlőtő feléje görbítette gyökereit és ágait hozzá eresztette, hogy őt itassa, ültetvénye ágyaiból.
పెద్ద రెక్కలూ, విస్తారమైన ఈకలూ ఉన్న ఇంకో గొప్ప డేగ ఉంది. చూడండి! ఈ ద్రాక్ష చెట్టు తన వేళ్ళను ఈ డేగ వైపుకి మళ్ళించింది. అది నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమి నుండి తన కొమ్మలను డేగ వైపుకి మళ్ళించింది.
8 Jó mezőre, nagy víz mellé van ültetve, hogy lombot hajtson és gyümölcsöt teremjen, hogy pompás szőlőtővé váljék.
దాన్ని ఒక పెద్ద నీటి చెరువు పక్కనే మంచి నేల్లో అనేక కొమ్మలు వేసి, ఫలించి, చక్కని ద్రాక్ష తీగె కావాలని నాటడం జరిగింది.”
9 Mondjad, így szól az Úr, az Örökkévaló: fog-e boldogulni? nemde ki fogja szakítani gyökereit és gyümölcsét lemetszi, hogy elszáradjon, minden kisarjadt levele el fog száradni; és nem nagy karral és sok néppel kell őt kirántani gyökereiből.
ప్రజలను ఇలా అడుగు. “అది అభివృద్ధి చెందుతుందా? ప్రజలు దాని వేళ్ళను పీకివేసి దాని పళ్ళు కోసుకోరా? అప్పుడది ఎండి పోవాల్సిందే గదా! దాని చిగుళ్ళు ఎండి పోయాక ఎంతమంది దాని కోసం శ్రమించినా దాని వేళ్ళు ఇక చిగురించవు.
10 Íme el van ültetve, vajon fog-e boldogulni? Nemde, amint a keleti szél éri, száradva elszárad, sarjadása ágyain fog elszáradni.
౧౦ఒకవేళ దాన్ని తిరిగి నాటినా అది పెరుగుతుందా? తూర్పునుండి గాలి దాన్ని తాకినప్పుడు అది ఎండిపోతుంది కదా! అది నాటి ఉన్న భూమిలోనే మొత్తం ఎండిపోతుంది.”
11 És lett hozzám az Örökkévaló igéje, mondván:
౧౧తరువాత యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
12 Mondjad csak az engedetlenség házának: nemde tudjátok, mik ezek? Mondjad: Íme eljött Bábel királya Jeruzsálembe és elvitte királyát és nagyjait és vitte őket magához Bábelbe.
౧౨“తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.
13 És vett; a királyi magzatból és kötött vele szövetséget és eskübe fogadta és az ország vezéreit elvitte,
౧౩అతడు రాజు వంశస్థుల్లో ఒకణ్ణి తీసుకుపోయి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. అతనితో ఒట్టు పెట్టించాడు. రాజ్యం బలహీనం కావడం కోసం, అది మళ్ళీ కోలుకోకుండా ఉండటానికి దేశంలో ఉన్న బలవంతులను అతడు తీసుకు వెళ్లి పోయాడు.,
14 hogy alacsony királyság legyen, hogy föl ne emelkedjék, megőrizve az ő szövetségét, hogy az fennálljon.
౧౪ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటే దేశం నిలిచి ఉంటుంది.
15 De fellázadt ellene, követet küldve Egyiptomba, hogy adjanak neki lovakat és sok népet; vajon fog-e boldogulni, megmenekül-e aki ezeket teszi? Szövetséget bontott föl, és megmeneküljön:
౧౫కాని యెరూషలేము రాజు గుర్రాల కోసమూ, సైన్యం కోసమూ ఐగుప్తు రాజు దగ్గరికి రాయబారులను పంపడం ద్వారా తిరుగుబాటు చేశాడు. ఆ ప్రయత్నం ఫలిస్తుందా? అలాంటి పనులు చేసి అతడు తప్పించుకుంటాడా? నిబంధనను మీరినవాడు తప్పించుకుంటాడా?
16 hogy én élek, úgymond az Úr, az Örökkévaló, bizony azon király székhelyén, aki őt királlyá tette, akinek esküjét megvetette és akinek szövetségét fölbontotta, ő nála, Bábel közepén fog meghalni.
౧౬నా ప్రాణం పైన ఒట్టు, ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. ఎవరితో చేసిన నిబంధనను అతడు భంగ పరిచాడో, ఏ రాజు దగ్గర ఒట్టు పెట్టాడో, ఏ రాజు తనని రాజుగా చేశాడో ఆ రాజు రాజ్యంలోనే అతడు చనిపోతాడు. అతడు బబులోను లోనే చనిపోతాడు!
17 És nem nagy hadsereggel és sok gyülekezettel fog vele együttműködni Fáraó a háborúban, mikor sáncot hánynak föl és ostromtornyokat építenek, sok lélek kiirtására.
౧౭బబులోను సైన్యాలు యుద్ధంలో ముట్టడికై ఉన్నత స్థలాలను కట్టినప్పుడు, ప్రజలను చంపడానికి ప్రాకారాలను ముట్టడి వేసినప్పుడు ఫరో, అతని బలమైన సైన్యం, అతడు యుద్ధానికి సమకూర్చిన మనుషులు యుద్ధంలో యెరూషలేము రాజును కాపాడలేవు.
18 Hisz megvetette az esküt, fölbontva a szövetséget, és íme kezét adta és mindezeket tette: nem fog megmenekülni.
౧౮ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.”
19 Azért, úgymond az Úr, az Örökkévaló, ahogy élek, bizony az én eskümet, melyet megvetett és szövetségemet, melyet fölbontott, fejére hárítom.
౧౯కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “అతడు తృణీకరించిన ప్రమాణం నాకు చేసింది కాదా! నా నిబంధనను అతడు భంగం చేశాడు కదా! కాబట్టి అతడి పైకి శిక్ష రప్పిస్తున్నాను.
20 És kiterítem rá hálómat és megfogatik varsámban és elviszem őt Bábelbe és ítéletre szállok ott vele hűtlenségéért, mellyel hűtlenkedett irántam.
౨౦నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.
21 És mind a szökevényei, minden csapatjában, kard által fognak elesni, és a megmaradottak minden szélnek fognak elszóratni; és megtudjátok, hogy én az Örökkévaló beszéltem.
౨౧అతనితో ఉన్న సైన్యంలో తప్పించుకుని పారిపోయిన వాళ్ళందరూ ఖడ్గం చేత నిర్మూలం అవుతారు. మిగిలిన వాళ్ళు అన్ని వైపులకీ చెదిరిపోతారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందని ప్రకటిస్తున్నాను.”
22 Így szól az Úr, az Örökkévaló: Majd veszek én a cédrusnak magas sudarából és elültetem; legfelsőbb gallyaiból egy gyengét tépek le, és majd elplántálom én magas, ormos hegyre.
౨౨ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
23 Izraelnek magasságos hegyén fogom elplántálni, hogy lombot hajtson és gyümölcsöt teremjen és pompás cédrussá váljék; és majd lakik alatta minden madár, minden szárnyas, ágai árnyékában laknak.
౨౩అది శాఖలుగా విస్తరించి ఫలాన్ని ఇచ్చేలా నేను దాన్ని ఇశ్రాయేలు పర్వతాల పైన నాటుతాను. అది ఎంతో ఘనమైన దేవదారు వృక్షం అవుతుంది. దాని కింద రెక్కలున్న పక్షులన్నీ నివసిస్తాయి. దాని కొమ్మల నీడలో అవి తమ గూళ్ళు కట్టుకుని పిల్లలను పెడతాయి.
24 És megtudják a mezőnek fái mind, hogy én az Örökkévaló alacsonyítottam le a magas fát, emeltem föl az alacsony fát, szárasztottam el a viruló fát és virágoztattam föl a száradt fát; én az Örökkévaló beszéltem és megteszem.
౨౪అప్పుడు భూమిపైన చెట్లన్నీ నేనే యెహోవాను అని తెలుసుకుంటాయి. గొప్ప చెట్లను నేను కిందకు లాగుతాను. హీనమైన చెట్లను పైకి లేపుతాను. పచ్చని చెట్టు ఎండిపోయేలా చేస్తాను. ఎండిన చెట్టు వికసించేలా చేస్తాను. నేనే యెహోవాను. ఇది జరుగుతుందని నేను చెప్పాను. దీన్ని తప్పక నెరవేరుస్తాను.”

< Ezékiel 17 >