< 2 Mózes 30 >
1 És készíts oltárt a füstölőszer elégetésére; sittimfából készítsd azt.
౧యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.
2 Egy könyök a hossza és egy könyök a szélessége, négyszögű legyen és két könyök a magassága; magából legyenek a szarvai.
౨దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.
3 És vond be azt tiszta arannyal, tetejét és falait köröskörül, meg szarvait; és készíts neki arany koszorút köröskörül.
౩దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.
4 És két aranykarikát készíts rá koszorúja alól, két szélére csináld a két oldalán, hogy legyenek tartókul a rudaknak, hogy vigyék azt azokon.
౪దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
5 És készítsd a rudakat sittimfából és vond be azokat arannyal.
౫తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి.
6 És tedd azt a függöny elé, mely a bizonyság ládáján van, a födél előtt, mely a bizonyságon van, ahol találkozom veled.
౬వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.
7 És füstölögtessen rajta Áron fűszeres füstölőszert reggelenként, midőn megigazítja a mécseket, füstölögtesse azt.
౭అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.
8 És midőn felteszi Áron a mécseket estefelé, füstölögtesse azt; állandó füstölőszer az Örökkévaló színe előtt, nemzedékeiteken át.
౮అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.
9 Ne mutassatok be rajta idegen füstölőszert, sem égőáldozatot és ételáldozatot, sem italáldozatot ne öntsetek rá.
౯దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.
10 És engeszteljen Áron (az oltár) szarvain egyszer az évben; az engesztelő vétekáldozat véréből engeszteljen rajta nemzedékeiteken át; szentek szentje az az Örökkévalónak.
౧౦అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.”
11 És szólt az Örökkévaló Mózeshez, mondván:
౧౧యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
12 Ha felveszed Izrael fiainak összegét számlálásuk szerint, akkor adja kiki lelke váltságát az Örökkévalónak, midőn megszámlálják őket; hogy ne legyen rajtuk csapás, midőn megszámlálják őket.
౧౨“నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.
13 Ezt adja mindenki, aki átmegy a számláláson: fél sékelt, a szentség sékelje szerint, – húsz géra a sékel – fél sékelt ajándékul az Örökkévalónak.
౧౩జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.
14 Mindenki, aki átmegy a számláláson, húsz évestől felfelé, adja az Örökkévaló ajándékát.
౧౪ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.
15 A gazdag ne adjon többet és a szegény ne adjon kevesebbet a fél sékelnél, hogy adja az Örökkévaló ajándékát, hogy engeszteljen lelkeitekért.
౧౫విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
16 És vedd az engesztelés pénzét Izrael fiaitól és add azt a gyülekezés sátorának szolgálatára; és legyen Izrael fiainak emlékezetül az Örökkévaló színe előtt, hogy engeszteljen lelkeitekért.
౧౬ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.”
17 És szólt az Örökkévaló Mózeshez, mondván:
౧౭యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి.
18 Készíts medencét rézből és talapzatát rézből, mosdásra; és tedd a gyülekezés sátora és az oltár közé és tegyél oda vizet,
౧౮సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.
19 hogy megmossák abból Áron és fiai kezeiket és lábaikat.
౧౯ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
20 Midőn bemennek a gyülekezés sátorába, mosdjanak vízben, hogy meg ne haljanak; vagy midőn odalépnek az oltárhoz szolgálatot végezni, hogy füstölögtessenek tűzáldozatot az Örökkévalónak,
౨౦వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.
21 mossák meg kezeiket és lábaikat, hogy meg ne haljanak; és legyen nekik örök törvényül, neki és az ő magzatának, nemzedékeiken át.
౨౧వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”
22 És szólt az Örökkévaló Mózeshez, mondván:
౨౨యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
23 Te pedig vegyél kiváló illatszereket: finom mirhát, ötszáz (sékelt), illatos fahéjat, annak felét, kétszázötvenet, és illatos nádat kétszázötvenet;
౨౩“నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,
24 és kassziát, ötszázat, a szentség sékelje szerint, és egy hin faolajat.
౨౪నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి.
25 És készítsd el azt a szentség kenetolajának, jól megkeverve, kenőcskeverő munkával; a szentség kenetolaja legyen.
౨౫పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.
26 És kend fel vele a gyülekezés sátorát és a bizonyság ládáját,
౨౬ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని,
27 az asztalt, meg minden edényeit és a lámpást, meg edényeit és a füstölőszer oltárát,
౨౭సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని,
28 meg az égőáldozat oltárát és minden edényeit, meg a medencét és talapzatát.
౨౮హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి.
29 Szenteld meg azokat, hogy a szentek szentje legyenek; bárki érinti azokat, szent legyen.
౨౯అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
30 És Áront, meg fiait kend fel és szenteld meg őket, hogy papjaimmá legyenek.
౩౦అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
31 Izrael fiaihoz pedig szólj, mondván: A szentség kenetolaja legyen ez nekem, nemzedékeiteken át.
౩౧నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి.
32 Ember testére ne öntsétek és mértéke szerint ne készítsetek hozzá hasonlót; szent az, szent legyen nektek.
౩౨దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి.
33 Bárki, aki kever hozzá hasonlót és aki ad abból idegenre, irtassék ki népe köréből:
౩౩దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి’ అని చెప్పు.”
34 És mondta az Örökkévaló Mózesnek: Vegyél fűszereket: balzsamot, ónixot, galbánumot, fűszereket és tiszta tömjént; mindegyik egyenlő részben legyen,
౩౪యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు “నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి.
35 És készítsd azt füstölőszernek keveréssel, kenőcskeverő munkával, elegyítve, tisztán, szent az.
౩౫పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.
36 És dörzsölj el belőle finomra és tegyél belőle a bizonyság elé a gyülekezés sátorában, ahol találkozom veled; szentek szentje legyen nektek.
౩౬దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.
37 És a füstölőszer, melyet készítesz – annak mértéke szerint ne készítsetek magatoknak, – szent legyen az nálad az Örökkévalónak.
౩౭నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.
38 Bárki, aki készít hozzá hasonlót, hogy szagolja azt, irtassék ki az ő népe közül.
౩౮దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.”