< 2 Mózes 12 >
1 És szólt az Örökkévaló Mózeshez meg Áronhoz Egyiptom országában, mondván:
౧మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు.
2 Ez a hónap nektek a hónapok kezdete, első ez nektek az év hónapjai között.
౨“నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట.
3 Szóljatok Izrael egész községéhez, mondván: E hónap tizedikén vegyen magának kiki egy bárányt, az atyai ház szerint, egy bárányt egy ház számára.
౩ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి.
4 Ha pedig kevés a háznép, hogy elég legyen egy bárányhoz, akkor vegyen ő és az ő szomszédja, ki közel van házához, a lelkek száma szerint; mindenkit az ő evése szerint számítsatok a bárányhoz.
౪ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి.
5 Ép bárány, hím, egyéves legyen számotokra, a juhok közül és a kecskék közül vegyétek.
౫మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.
6 És legyen nálatok őrizet alatt tizennegyedik napjáig; e hónapnak; akkor vágja le azt Izrael községének egész, gyülekezete, estefelé.
౬ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి.
7 És vegyenek a vérből és tegyenek a két ajtófélre és a felső küszöbre a házakban, amelyekben azt elköltik.
౭కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి.
8 És egyék meg a húst amaz éjjel, tűzön sütve, kovásztalan kenyérrel és keserű füvekkel együtt egyék meg azt.
౮ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.
9 Ne egyetek belőle nyersen, sem megfőzve vízben, hanem tűzön sütve, fejét lábszáraival és belsejével együtt.
౯దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి.
10 És ne hagyjátok meg belőle reggelre; ami pedig megmarad belőle reggelre, tűzben égessétek el.
౧౦తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి.
11 Így egyétek azt: Csípőitek övezve; saruitok lábaitokon, bototok kezetekben; és egyétek azt sietve, peszách az az Örökkévalónak.
౧౧మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.
12 És átvonulok Egyiptom országán ez éjjel, megölök minden elsőszülöttet Egyiptom országában embertől baromig; és Egyiptom minden istenein ítéletet végzek, én az Örökkévaló.
౧౨నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.
13 Azért legyen a vér nektek jelül a házakon amelyekben ti vagytok, és midőn látom a vért, elkerüllek benneteket; hogy ne legyen rajtatok pusztító csapás, midőn megverem Egyiptom országát.
౧౩మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు.
14 És legyen ez a nap nektek emlékül és ünnepeljétek azt ünnep gyanánt az Örökkévalónak, nemzedékeiteken át, örök törvényül ünnepeljétek azt.
౧౪కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
15 Hét napig kovásztalant egyetek, de már az első napra takarítsatok ki minden kovászt házaitokból, mert bárki kovászost eszik, írtassék ki az a lélek Izraelből, az első naptól a hetedik napig.
౧౫ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి.
16 Az első napon pedig szentség hirdetése legyen és a hetedik napon szentség hirdetése legyen nálatok, semmi munka se végeztessék azokon, csak ami eledelre való bármely személynek, az egyedül készíttessék el nálatok.
౧౬ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే.
17 És őrizzétek meg a kovásztalan kenyér ünnepét, mert ezen a napon vezettem ki seregeiteket Egyiptom országából; azért őrizzétek meg ezt a napot nemzedékeiteken át, örök törvényül.
౧౭ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది.
18 Az első hónapban, tizennegyedik napján a hónapnak, este egyetek kovásztalant, a huszonegyedik napjáig e hónapnak, este.
౧౮మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి.
19 Hét napig kovász ne találtassék házaitokban mert mindenki, aki eszik kovászost, irtassék ki az a lélek Izrael községéből, akár idegen, akár az ország szülötte.
౧౯ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి.
20 Semmi kovászost se egyetek, minden lakóhelyeiteken kovásztalant egyetek.
౨౦మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.”
21 És szólította Mózes Izrael minden véneit és mondta nekik: Fogjatok és vegyetek magatoknak juhokat családjaitok szerint és vágjátok le a peszácháldozatot.
౨౧అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి.
22 És vegyetek egy csomó izsópot, mártsátok be a vérbe, mely a medencében van és kenjetek a felső küszöbre és a két ajtófélre a vérből, mely a medencében van, ti pedig ne menjetek ki, senki az ő háza bejáratán egész reggelig.
౨౨తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి.
23 Az Örökkévaló pedig átvonul, hogy sújtsa Egyiptomot és látja a vért a felső küszöbön és a két ajtófélen, akkor elkerüli az Örökkévaló a bejáratot és nem engedi a pusztítót bemenni házaitokba, hogy sújtson.
౨౩యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు.
24 És őrizzétek meg ezt a dolgot törvényül magadnak és gyermekeidnek mindörökre.
౨౪అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది.
25 És lesz, ha bementek az országba, melyet az Örökkévaló nektek ad, amint szólt, akkor őrizzétek meg ezt a szolgálatot.
౨౫యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి.
26 És lesz, ha mondják nektek gyermekeitek: Mi ez a szolgálat nektek?
౨౬మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే,
27 Akkor mondjátok: Peszácháldozat az az Örökkévalónak, mivelhogy elkerülte Izrael fiai házait Egyiptomban, midőn sújtotta Egyiptomot, ami házainkat pedig megmentette; és a nép meghajolt és leborult.
౨౭‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.
28 Elmentek és cselekedtek Izrael fiai, amint az Örökkévaló megparancsolta Mózesnek meg Áronnak, úgy cselekedtek.
౨౮అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు.
29 És történt éjfélkor, hogy megölt az Örökkévaló minden elsőszülöttet Egyiptom országában, Fáraó elsőszülöttétől kezdve, aki trónján ül, a fogoly elsőszülöttéig, aki a fogházban van, és a baromnak minden első fajzatát.
౨౯ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి.
30 És felkelt Fáraó éjjel, ő és minden szolgája, meg egész Egyiptom és lett nagy jajkiáltás Egyiptomban, mert nem volt ház, ahol nem volt halott.
౩౦ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది.
31 És hivatta Mózest meg Áront éjjel és mondta: Kerekedjetek fel, menjetek el népem közül, ti is, Izrael fiai is; menjetek, szolgáljátok az Örökkévalót, amint szóltatok.
౩౧ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి.
32 Juhaitokat is, marháitokat is vegyétek, amint szóltatok és menjetek; de áldjatok meg engem is.
౩౨మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు.
33 Az egyiptomiak pedig sürgették a népet, hogy mihamarabb elküldjék őket az országból, mert azt mondták: Mindnyájan meghalunk.
౩౩ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.
34 És a nép vitte tésztáját, mielőtt megkelt volna, teknőiket bekötve ruháikba, vállukon.
౩౪ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు.
35 Izrael fiai pedig cselekedtek Mózes szava szerint és kértek az egyiptomiaktól ezüst edényeket, arany edényeket és ruhákat.
౩౫అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు.
36 Az Örökkévaló pedig kegyet adott a népnek az egyiptomiak szemeiben és adtak nekik kérésükre; így kiürítették Egyiptomot.
౩౬ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు.
37 És vonultak Izrael fiai Rámszészből Szukkószba, mintegy hatszázezer gyalogos, a férfiak a gyermekeken kívül.
౩౭తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది.
38 De sok zagyva nép is ment fel velük, meg juh és marha, igen sok nyáj.
౩౮అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి.
39 És megsütötték a tésztát, melyet kivittek Egyiptomból, kovásztalan lepényeknek, mert nem kelt meg; mert elűzettek Egyiptomból és nem késlekedhettek, meg eleséget sem készítettek maguknak.
౩౯తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు.
40 Izrael fiainak lakása pedig, amíg Egyiptomban laktak, négyszázharminc év.
౪౦ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు.
41 És volt négyszázharminc év multán, volt pedig ugyanazon a napon, mentek ki az Örökkévaló minden seregei Egyiptom országából.
౪౧ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి.
42 A megőrzés éjjele az az Örökkévalónak, hogy kivezesse őket Egyiptom országából, az az éjjel az Örökkévalóé, megőrzés Izrael minden fiainál nemzedékeiken át.
౪౨ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి.
43 És mondta az Örökkévaló Mózesnek meg Áronnak: Ez a peszách törvénye, semmiféle idegen se egyék belőle.
౪౩తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు.
44 És bárkinek szolgája, a pénzen vett, ha körülmetélte őt, akkor ehetik belőle.
౪౪మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు.
45 Lakos és béres ne egyék belőle.
౪౫వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు.
46 Egy házban költessék el, ne vigyél ki a házból a húsból az utcára, és csontot ne törjetek össze benne.
౪౬ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు.
47 Izrael egész községe készítse el azt.
౪౭ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి.
48 És ha tartózkodik nálad idegen és készíteni akar peszácháldozatot az Örökkévalónak, körülmetéltessék nála minden férfiszemély és akkor közeledhetik, hogy elkészítse azt és lesz mint az ország szülötte; de semmiféle körülmetéletlen se egyék belőle.
౪౮మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు.
49 Egy tan legyen a bennszülött és az idegen számára, aki tartózkodik közöttetek.
౪౯స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.”
50 És úgy cselekedtek Izrael minden fiai, amint az Örökkévaló parancsolta Mózesnek meg Áronnak; úgy cselekedtek.
౫౦యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు.
51 És volt ugyanazon a napon, vezette ki az Örökkévaló Izrael fiait Egyiptom országából seregeik szerint.
౫౧ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు.