< Eszter 5 >
1 Három nap múltán Eszter királynői öltözéket öltött és megállt a királyi palota belső udvarán, a trónteremmel szemben. A király pedig ott ült a trónján, szemben a bejárattal.
౧మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
2 Amint a király meglátta, hogy Eszter királyné ott áll az udvaron, kegyet talált a szemében és kinyújtotta Eszter felé a kezében lévő aranypálcát. Eszter közelebb lépett és megérintette a pálca végét.
౨ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది.
3 A király megkérdezte tőle: mi járatban vagy, Eszter királyné és mi a kívánságod? Még ha országom felét is [kéred], megadom neked!
౩రాజు “రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
4 Eszter válaszolt: Ha a király jónak látja, jöjjön ő és Hámán ma lakomára, amelyet neki készítettem.
౪అప్పుడు ఎస్తేరు “రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక” అంది.
5 S így szólt a király: Hamar hozzátok Hámánt, hogy teljesülhessen Eszter szava! Így hát elment a király és Hámán a lakomára, melyet Eszter készített.
౫అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.
6 Ekkor azt mondta a király Eszternek borivás közben: Amit csak megkívánsz, megadatik neked! Ami a kérésed, legyen az akár a királyság fele is, úgy lesz!
౬విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు.
7 Eszter pedig azt felelte: Kérésem és kívánságom:
౭ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే,
8 ha jóindulattal tekint rám a király, és ha jónak látja megadni kérésem és teljesíteni kívánságom – jöjjön el a király, Hámánnal együtt a lakomámra, amelyet készítek. Holnap aztán felelek majd a király kérdésére.
౮రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.”
9 Azon a napon Hámán örömmel és jókedvűen távozott [a lakomáról]. De meglátta Hámán, a király kapujában Mordechájt, aki nem kelt fel előtte, meg se moccant, s ezért elöntötte őt a düh.
౯ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజు భవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి లేచి నిలబడక పోవడం, అసలు ఎలాటి భయం చూపకపోవడం చూసి మొర్దెకై మీద మండిపడ్డాడు.
10 Hámán erőt vett magán és hazament. Majd hívatta barátait és feleségét Zerest,
౧౦అయితే అతడు కోపం అణచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరెషును పిలిపించాడు.
11 és elsorolta nekik, milyen nagy a vagyona, mennyi fia van és hogyan emelte őt a király nagyobb méltóságra minden vezető emberénél.
౧౧తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలామంది కొడుకుల గురించి, రాజు తనని రాజోద్యోగులందరి కంటే, రాజసేవకులందరి కంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు.
12 Majd így szólt Hámán: Nem is hívott Eszter királyné mást a királyon kívül a lakomához, melyet készített, mint engem, és holnapra is én vagyok hivatalos hozzá a királyon kívül.
౧౨ఇంకా అతడు “ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది” అని చెప్పాడు.
13 Mindez, azonban, mit sem ér nekem, amíg a zsidó Mordechájt a királyi udvarban látom.
౧౩“అయితే యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం ఈ పదవి అంతటి వలనా నాకు ప్రయోజనమేముంది?” అని అతడు అన్నాడు.
14 Zeres a felesége meg mind a barátai ezt válaszolták neki: Készítess bitófát, ötven ámá magasat. Reggel pedig mondd a királynak, hogy akasszák fel rá Mordechájt, s menj be a királlyal a lakomára örvendve. Tetszett a dolog Hámánnak és elkészíttette a bitófát.
౧౪అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ “50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు” అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు.