< Ámos 1 >
1 Ámósz beszédei, ki a, baromtenyésztők közül való volt, Tekóából, a miket látott Izraél felől, Uzzíja Jehúda, királyának napjaiban és Járobeám Jóás fia, Izraél királyának napjaiban, két évvel a földrengés előtt.
౧ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.
2 Mondta: Az Örökkévaló Czión felől ordít és Jeruzsálemből hallatja hangját; gyászba borulnak a pásztorok tanyái és elszárad a Karmel csúcsa.
౨అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”
3 Így szól az Örökkévaló: Damaszkusnak három bűntette miatt és négy miatt nem térítem el tőle: amiatt, hogy vasszánokkal csépelték Gileádot.
౩యెహోవా చెప్పేదేమిటంటే, “దమస్కు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండాా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.
4 Majd bocsátok tüzet Chazáél házára, és fölemészti Ben-Hadád kastélyait.
౪నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.
5 És eltöröm Damaszkus reteszét és kiírtok lakót Áven síkságából és pálczatartót Bét-Édenből, és számkivetésbe megy Arám népe Kírba, mondja az Örökkévaló.
౫దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను. బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.” అని యెహోవా చెబుతున్నాడు.
6 Így szól az Örökkévaló Azzának három bűntette miatt és négy miatt nem térítem el tőle: amiatt hogy számkivetésbe vittek teljes számkivetést, hogy kiszolgáltassák Edómnak.
౬యెహోవా చెప్పేదేమిటంటే, “గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు.
7 Majd bocsátok tüzet Azza falára, és megemészti kastélyait.
౭గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది.
8 És kiírtok lakót Asdódból, és pálczatartót Askelónból; és kezemet fordítom Ekrón ellen, hogy kivesszen a filiszteusok maradéka, mondja az Úr, az Örökkévaló.
౮అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. అష్కెలోనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఎక్రోనుకు విరోధంగా నా చెయ్యి ఎత్తుతాను. ఇంకా మిగిలిన ఫిలిష్తీయులు నాశనమవుతారు” అని యెహోవా ప్రభువు చెబుతున్నాడు.
9 Így szól az Örökkévaló: Czórnak három bűntette miatt és négy miatt nem térítem el tőle: amiatt hogy kiszolgáltattak számkivetteteket teljes számban Edómnak és nem emlékeztek meg a testvéri szövetségről.
౯యెహోవా చెప్పేదేమిటంటే, “తూరు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమూహాలన్నిటినీ ఎదోముకు అప్పగించారు. వాళ్ళు సోదర భావంతో చేసుకున్న నిబంధనను తెగతెంపులు చేసుకున్నారు.
10 Majd bocsátok tüzet Czór falára, és megemészti kastélyait.
౧౦నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను. అది దాని రాజ భవనాలను దహించి వేస్తుంది.”
11 Így szól az Örökkévaló: Edómnak három bűntette miatt és négy miatt nem térítem el tőle: amiatt hogy karddal üldözte testvérét és elfojtotta érzelmét, haragja szüntelen ragadozott és indulatát megőrizte örökre.
౧౧యెహోవా చెప్పేదేమిటంటే, “ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు. అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది. అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది.
12 Majd bocsátok tüzet Témánra, és megemészti Boczra kastélyait.
౧౨తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.”
13 Így szól az Örökkévaló: Ammón fiainak három bűntette, miatt és négy miatt nem térítem el tőle: amiatt hogy felhasították Gileádnak várandósait, azért hogy kitágítsák határukat.
౧౩యెహోవా చెప్పేదేమిటంటే, “అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు.
14 Majd gyújtok tüzet Rabba falára, és fölemészti kastélyait, riadás közt, harcznak napján, vihar közt, szélvész napján.
౧౪రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను. యుద్ధ ధ్వనులతో, సుడి గాలి వీచేటప్పుడు కలిగే ప్రళయం లాగా అది రాజ భవనాలను దహించివేస్తుంది.
15 És számkivetésbe megy a királyuk, ő és nagyjai egyetemben, mondja az Örökkévaló.
౧౫వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.