< 2 Királyok 5 >

1 Náamán pedig, Arám királyának hadvezére, nagy ember az ő ura előtt, és tekintélyes, mert általa adott az Örökkévaló győzelmet Arámnak; derék vitéz volt a férfiú, de bélpoklos.
సిరియా రాజు సైన్యాధిపతి పేరు నయమాను. అతని ద్వారా యెహోవా సిరియా దేశానికి విజయాలిచ్చాడు. అందుచేత అతడు తన రాజు దృష్టిలో గొప్పవాడూ, గౌరవనీయుడూ అయ్యాడు. ఎంతో ధైర్యవంతుడూ, బలవంతుడూ అయినప్పటికీ అతడు కుష్టు రోగి.
2 Az Arámbeliek kivonultak csapatokban és foglyul ejtettek Izraél országából egy kis leányt; és Náamán feleségének szolgálatába került.
సిరియనులు దోపిడీలు చేయడానికి దళాలుగా ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తూ ఉండేవారు. ఒకసారి వారు అక్కడనుండి ఒక అమ్మాయిని బందీగా పట్టుకుని వచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు పరిచారిక అయింది.
3 Ez szólt úrnőjéhez: Vajha menne az én uram a Sómrónban levő próféta elé, akkor megszabadítaná őt bélpoklosságától.
ఆ అమ్మాయి తన యజమానురాలితో “షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా యజమాని వెళ్ళాలని ఎంతో ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన నా యజమాని కుష్టురోగాన్ని నయం చేస్తాడు” అంది.
4 Erre bement és jelentette urának, mondván: Így meg úgy beszélt a leány, aki Izraél országából való.
కాబట్టి నయమాను తన రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు దేశం నుండి వచ్చిన అమ్మాయి చెప్పిన మాటను వివరించాడు.
5 És szólt Arám királya: Eredj, menj oda, küldök majd levelet Izraél királyához. Ment és vitt a kezében tíz kikkár ezüstöt, hatezer aranyat és tíz váltó ruhát.
సిరియా రాజు “నీవు వెళ్ళు. నేను ఇశ్రాయేలు రాజుకి లేఖ పంపిస్తాను” అన్నాడు. నయమాను తనతో మూడు వందల నలభై కిలోల వెండీ, ఆరు వేల తులాల బంగారం, పది జతల బట్టలూ తీసుకుని బయల్దేరాడు. వాటితో పాటు ఆ లేఖను కూడా తీసుకు వెళ్ళి ఇశ్రాయేలు రాజుకి అందించాడు.
6 És elvitte Izraél királyához a levelet, mely így szólt: Most tehát, amint hozzád jut e levél, íme küldöm hozzád szolgámat, Náamánt, hogy megszabadítsad bélpoklosságától.
ఆ లేఖలో “నా సేవకుడైన నయమానుకి ఉన్న కుష్టురోగాన్ని నీవు బాగు చేయాలి. అందుకే ఈ లేఖను అతనికిచ్చి పంపిస్తున్నాను” అని ఉంది.
7 És volt, amint elolvasta Izraél királya a levelet, szétszaggatta ruháit és mondta: Isten vagyok-e én, hogy öljek és éltessek, hogy ez hozzám küld, hogy megszabadítsak valakit bélpoklosságától? Tudjátok hát, kérleli, és lássátok, hogy alkalmat keres ellenem!
ఇశ్రాయేలు రాజు ఆ లేఖ చదివి తన బట్టలు చింపుకున్నాడు. “ఒక మనిషికి ఉన్న కుష్టురోగాన్ని బాగు చేయమని ఇతడు నాకు లేఖ రాయడం ఏమిటి? మనుషులను చంపడానికీ బ్రతికించడానికీ నేనేమన్నా దేవుడినా? ఇతడు నాతో వివాదం పెట్టుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది” అన్నాడు.
8 És volt, midőn meghallotta Elísá, az Isten embere, hogy Izraél királya szétszaggatta a ruháit, küldött a királyhoz, mondván: Miért szaggattad szét a ruháidat, jöjjön csak el hozzám és tudja meg, hogy van próféta Izraélben.
ఇశ్రాయేలు రాజు తన బట్టలు చింపుకొన్న సంగతి దేవుని మనిషి ఎలీషా విన్నాడు. అప్పుడు అతడు ఇశ్రాయేలు రాజుకి “నీ బట్టలెందుకు చింపుకున్నావు? అతణ్ణి నా దగ్గరికి పంపు. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు” అని సందేశం పంపించాడు.
9 Erre odament Naamán lovaival és szekereivel és megállt Elísá házának bejáratán.
కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు.
10 Ekkor küldött hozzá Elísá követet, mondván; Menj és fürödj meg hétszer a Jordánban, hogy helyreálljon neked a tested és majd megtisztulsz.
౧౦ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు.
11 Erre megharagudott Náamán és elment; mondta: Íme, azt gondoltam, ki fog jönni hozzám, megáll és szólítja az Örökkévalónak, Istenének nevét, lengeti kezét a hely felé és meggyógyítja a bélpoklost.
౧౧నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను.
12 Nem jobbak-e Amána és Parpár, Damaszkusz folyói, Izraél valamennyi vizénél? Nem fürödhetem-e meg azokban, hogy megtisztuljak! Megfordult és dühösen elment.
౧౨ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
13 Ekkor odaléptek szolgái, beszéltek hozzá és mondták: Atyám, nagy dolgot ha mondott volna neked a próféta, nemde megtennéd; hát mikor csak így szólt hozzá, de fürödjél meg és majd megtisztulsz!
౧౩అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు.
14 Erre lement és alámerült a Jordánban hétszer az Isten emberének igéje szerint; helyre állt a teste, olyan lett mint kis fiúnak a teste, és megtisztult.
౧౪అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.
15 Ekkor visszatért az Isten emberéhez, ő meg egész tábora odament, megállt előtte és mondta: Íme, kérlek, megtudtam, hogy nincs Isten az egész földön, ha csak nem Izraélben! Most, tehát fogadj el, kérlek, ajándékot szolgádtól.
౧౫నయమాను అప్పుడు సపరివార సమేతంగా తిరిగి దేవుని మనిషి దగ్గరికి వచ్చాడు. అతని ఎదుట నిలబడి ఇలా అన్నాడు “చూడండి, ఇశ్రాయేలులో తప్ప భూమి మీద ఎక్కడా వేరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకుడిచ్చే కానుక మీరు తీసుకోవాలి.”
16 Mondta: Él az Örökkévaló, aki előtt állok, nem fogadok el. Unszolta őt, hogy elfogadja, de vonakodott.
౧౬కానీ ఎలిషా “నేను దేవుని సన్నిధిలో నిలుచున్నాను. ఆయన మీద ఒట్టు. నేనేమీ తీసుకోను” అని జవాబిచ్చాడు. ఎలీషా కానుక తీసుకోవాల్సిందే, అంటూ నయమాను పట్టుపట్టాడు కానీ ఎలీషా ఒప్పుకోలేదు.
17 Ekkor mondta Náamán: Ha nem, adassék kérlek, szolgádnak egy pár öszvér terhét tevő föld; mert nem hoz többé szolgád égő – és vágóáldozatot más isteneknek, hanem csak az Örökkévalónak.
౧౭కాబట్టి నయమాను “అలా అయితే నీ సేవకుడిని అయిన నాకు రెండు కంచర గాడిదలు మోయగలిగే మట్టి ఇప్పించు. ఎందుకంటే నేను ఈ రోజు నుండి యెహోవాకి తప్పించి మరి ఏ దేవుడికీ దహనబలి గానీ ఇంకా ఏ ఇతర బలిని గానీ అర్పించను.
18 Ebben a dologban bocsásson meg az Örökkévaló a te szolgádnak: mikor az uram bemegy Rimmón házába, hogy ott leboruljon, és ő kezemre támaszkodik és én leborulok Rimmón házában, amikor leborulok Rimmón házában, bocsásson meg az Örökkévaló szolgádnak abban a dologban.
౧౮ఒక్క విషయంలో యెహోవా నీ సేవకుణ్ణి క్షమించాలి. అదేమిటంటే మా రాజుగారు రిమ్మోను దేవుణ్ణి పూజించడం కోసం మందిరంలో ప్రవేశించినప్పుడు నా చేతి మీద ఆనుకుంటాడు, అప్పుడు ఆయనతో పాటు నేను కూడా రిమ్మోను దేవుడి ఎదుట వంగుతాను. అలా నేను రిమ్మోను దేవుడి ఎదుట వంగినప్పుడు యెహోవా నీ సేవకుడినైన నన్ను క్షమిస్తాడు గాక” అన్నాడు.
19 Mondta neki: Menj békével! És elment tőle egy darab földnyire.
౧౯అప్పుడు ఎలీషా “ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు. నయమాను అక్కడి నుండి కదిలాడు.
20 Ekkor mondta Géchazí, Elísának, az Isten emberének legénye: Íme, megkímélte uram ezt az arámi Náamánt, hogy nem fogadta el kezéből azt, amit hozott; él az Örökkévaló, bizony utána futok és elfogadok tőle valamit.
౨౦అతడు అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక దేవుని మనిషి ఎలీషా సేవకుడైన గేహజీ ఇలా అనుకున్నాడు. “చూశావా, ఈ సిరియా వాడైన నయమాను తెచ్చిన కానుకలను తీసుకోకుండా నా యజమాని అతణ్ణి వదిలేశాడు. యెహోవా మీద ఒట్టు, నేనిప్పుడు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను.”
21 Utána sietett Géchazí Naamánnak; s midőn Náamán látta, hogy utána fut, leugrott a szekérről ő elejébe és mondta: Béke van-e?
౨౧ఇలా అనుకుని గేహజీ నయమాను వెనకాలే వెళ్ళాడు. తన వెనకాలే ఎవరో పరుగెత్తుకుంటూ రావడం నయమాను చూసి తన రథంపై నుండి దిగి అతణ్ణి కలుసుకుని “అంతా క్షేమమేనా?” అని అడిగాడు.
22 Mondta: Béke! Uram küldött engem, mondván: íme, épen most jött hozzám két ifjú Efraim hegységéből a prófétafiak közül; adj, kérlek, azok számára egy kikkár ezüstöt és két váltó ruhát.
౨౨గేహాజీ “అంతా క్షేమమే. నా యజమాని నన్ను పంపించాడు. ‘ఎఫ్రాయిము పర్వత ప్రాంతం లోని ప్రవక్తల సమాజం నుండి ఇద్దరు యువకులు ఇప్పుడే నా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వారి కోసం ముప్ఫై నాలుగు కిలోల వెండీ, రెండు జతల బట్టలూ ఇవ్వండి’ అని చెప్పమన్నాడు” అన్నాడు.
23 Erre mondta Náamán: Tessék, végy két kikkárt! Unszolta őt és belekötött két kikkár ezüstöt két zacskóba, meg két váltó ruhát; odaadta legényének és vitték előtte.
౨౩అందుకు నయమాను “నీకు డెబ్భై కిలోలు సంతోషంగా ఇస్తాను” అన్నాడు. నయమాను గేహాజీని బలవంతపెట్టి రెండు బస్తాల్లో డెబ్భై కిలోల వెండి ఉంచి, రెండు జతల బట్టలూ ఇచ్చి వాటిని మోయడానికి తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళను పంపాడు. వారు వాటిని మోసుకుని గేహాజీ ముందు నడిచారు.
24 Midőn a dombra ért, elvette kezükből és letette a házban. Ekkor elbocsátotta az embereket, és elmentek.
౨౪వారు పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు గేహాజీ ఆ వెండి బస్తాలను తీసుకుని ఇంట్లో దాచిపెట్టి వాళ్ళను పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు.
25 Ő meg bement és megállt ura előtt. Ekkor szólt hozzá Elísá: Honnan Géchazí? Mondta: Nem ment a szolgád se ide se oda.
౨౫తరువాత అతడు లోపలికి వెళ్ళి తన యజమాని ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఎలీషా అతణ్ణి “గేహజీ, నీవు ఎక్కడినుండి వస్తున్నావ్?” అని అడిగాడు. దానికి గేహాజీ “నీ సేవకుణ్ణి. నేను ఎక్కడికీ వెళ్ళలేదు” అన్నాడు.
26 De szólt hozzá: Nem ment-e veled a szívem, mikor feléd fordult kocsijáról? Idején van-e elvenni az ezüstöt és venni ruhákat, olajfákat és szőlőket, aprójószágot és marhát, szolgákat és szolgálókat?
౨౬అప్పుడు ఎలీషా గేహజీతో “ఆ వ్యక్తి నిన్ను కలుసుకోడానికి తన రథాన్ని ఆపినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదనుకున్నావా? డబ్బూ, మంచి బట్టలూ, ఒలీవ తోటలూ, ద్రాక్ష తోటలూ, గొర్రెలూ, పశువులూ, సేవకులూ, సేవకురాళ్ళూ వీటిని సంపాదించుకోడానికి ఇదా సమయం?
27 De Náamánnak a bélpoklossága reád tapad és magzatodra örökre! És kiment előle bélpoklosan, mint a hó.
౨౭అందుచేత నయమానుకి ఉన్న కుష్ఠు నీకూ, నీ వారసులకూ నిత్యం ఉంటుంది” అన్నాడు. కాబట్టి గేహాజీకి మంచులా తెల్లని కుష్టురోగం వచ్చింది. అతడు ఎలీషా దగ్గరనుండి వెళ్ళి పోయాడు.

< 2 Királyok 5 >