< 2 Királyok 18 >
1 És volt harmadik évében Hoséának, Éla fiának, Izraél királyának, király lett Chizkíja, Ácház fia, Jehúda királya.
౧ఇశ్రాయేలు రాజు, ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో మూడో సంవత్సరంలో యూదా రాజు ఆహాజు కొడుకు హిజ్కియా ఏలడం ఆరంభించాడు.
2 Huszonöt éves volt, mikor király lett és huszonkilenc évig uralkodott Jeruzsálemben; anyjának neve pedig Abí, Zakarja leánya.
౨అతడు 25 సంవత్సరాల వయస్సులో ఏలడం ఆరంభించి, యెరూషలేములో 29 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు అబీ. ఆమె జెకర్యా కూతురు.
3 És tette azt, a mi helyes az Örökkévaló szemeiben egészen a szerint, mint tette őse Dávid.
౩అతడు తన పూర్వికుడైన దావీదు ఆదర్శాన్ని అనుసరించి, యెహోవా దృష్టిలో ఏది సరైనదో అది చేశాడు.
4 Ő távolította el a magaslatokat, összetörte az oszlopokat és kivágta az asérát; és szétzúzta a rézkígyót, melyet készített Mózes – mert egészen ama napokig füstölögtettek neki Izraél fiai – és melyet Nechustánnak neveztek.
౪ఉన్నత స్థలాలను తొలగించి, విగ్రహాలను పగలగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టాడు. మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి ఇశ్రాయేలీయులు “నెహుష్టాను” అని పేరు పెట్టి, దానికి ధూపం వేసేవారు.
5 Az Örökkévalóban, Izraél Istenében bízott; ő utána pedig nem volt olyan, mint ő, mind a Jehúda királyai között, azok közt sem, kik előtte voltak.
౫అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాలో విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనైనా, అతని పూర్వికులైన రాజుల్లోనైనా అతనితో సమానుడు ఒక్కడూ లేడు.
6 Ragaszkodott az Örökkévalóhoz, nem tért el tőle, hanem megőrizte parancsolatjait, melyeket az Örökkévaló parancsolt Mózesnek.
౬అతడు యెహోవాకు నమ్మకంగా ఉండి, ఆయన్ను వెంబడించడంలో వెనుతిరగకుండా, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు.
7 Volt is vele az Örökkévaló, bármiért vonult ki, szerencsés volt; és fellázadt Assúr királya ellen és nem szolgálta.
౭కాబట్టి, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను వెళ్లిన ప్రతిచోటా అతడు జయం పొందాడు. అతడు అష్షూరు రాజుకు లోబడలేదు. అతని మీద తిరగబడ్డాడు.
8 Ő verte meg a filiszteusokat egészen Azzáig, meg annak határait, őrtoronytól erősített városig.
౮ఇంకా గాజా పట్టణం, దాని సరిహద్దుల వరకూ బురుజులనుండి ప్రాకారాల వరకూ ఫిలిష్తీయులపై దాడి చేశాడు.
9 Volt pedig Chizkíjáhú király negyedik évében, az hetedik éve Hóséának, Éla fiának, Izraél királyának, feljött Salmanéezer, Assúr királya Sómrón ellen és ostrom alá vette;
౯రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు.
10 És bevette három év múltán; Chizkíja hatodik évében, az kilencedik éve Hóséának, Izraél királyának, vétetett be Sómrón.
౧౦మూడు సంవత్సరాలకు అష్షూరీయులు దాన్ని చేజిక్కించుకున్నారు. హిజ్కియా పరిపాలనలో ఆరో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో షోమ్రోను పట్టణం శత్రువుల వశం అయ్యింది.
11 És számkivetette Assúr királya Izraélt Assúrba és Chaláchba és vitte őket a Chábórhoz, Gózán folyójához és Média városaiba;
౧౧ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు.
12 mivelhogy nem hallgattak az Örökkévalónak, az ő Istenüknek szavára és megszegték szövetségét, mindazt, amit parancsolt Mózes, az Örökkévaló szolgája, sem nem hallgattak rá, sem nem tették.
౧౨అష్షూరు రాజు ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశానికి తీసుకెళ్ళి, గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే పట్టణాల్లో, మాదీయుల పట్టణాల్లో వాళ్ళను ఉంచాడు.
13 Chizkíjáhú király tizennegyedik évében pedig fölment Szanchérib, Assúr királya, mind a Jehúda erősített városai ellen és elfoglalta azokat.
౧౩హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు.
14 Erre küldött Chizkíja, Jehúda királya Assúr királyához Lákhísba, mondván: Vétkeztem, vonulj el tőlem, a mit kivetsz reám, viselem. És rávetett Assúr királya Chizkíjára, Jehúda királyára háromszáz kikkár ezüstöt és harminc kikkár aranyat.
౧౪యూదారాజు హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహరులను పంపి “నావల్ల తప్పు జరిగింది. నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను” అని వార్త పంపించాడు. అష్షూరురాజు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం యూదా రాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు.
15 És odaadta Chizkija mind az ezüstöt, a mi találtatott az Örökkévaló házában és a király házának kincstáraiban.
౧౫కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.
16 Abban az időben törte le Chizkíja az Örökkévaló templomának ajtóit és a pilléreket, melyeket beborított volt maga Chizkíja, Jehúda királya, és odaadta Assúr királyának.
౧౬ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
17 Ekkor küldte Assúr királya Tartánt, Rab-Száríszt és Rabságét hatalmas sereggel Lákhísból Chizkíjáhú királyhoz Jeruzsálembe. Fölmentek tehát és érkeztek Jeruzsálembe; fölmentek és eljöttek és megálltak a felső tónak vízvezetékénél, mely a mosómező útján van.
౧౭కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు.
18 És szólították a királyt; erre kiment hozzájuk Eljákim, Chizkíjáhú fia, a ki a ház fölött volt, meg Sebna az író, és Jóách, Ászáf fia, a kancellár.
౧౮హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
19 És szólt hozzájuk Rabsáké: Szóljatok csak Chizkíjáhúnak: így szól a nagy király, Assúr királya, micsoda bizalom az, mellyel bíztál?
౧౯అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. “నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి?
20 Azt mondtad, csak szóbeszéd, hogy tanács és hatalom kell a háborúhoz! Most kiben bíztál, hogy föllázadtál ellenem?
౨౦యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?
21 Most íme bíztad magad erre a törött nádpálcára, Egyiptomra, amelyre ha valaki támaszkodik, bemegy a tenyerébe és átfúrja azt! Ilyen Fáraó, Egyiptom királya mindazoknak, kik benne bíznak.
౨౧నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.
22 De ha így szóltok hozzám: az Örökkévalóban, a mi Istenünkben bíztunk – hiszen ő az, akinek eltávolította Chizkíjáhu magaslatait és oltárait és azt mondta Jehúdának és Jeruzsálemnek: ezen oltár előtt boruljatok le Jeruzsálemben!
౨౨మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా?
23 Most tehát állj csak fogadásba urammal, Assúr királyával: hadd adok neked kétezer lovat, vajon tudsz-e te lovasokat adni rájuk?
౨౩కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
24 Hogy vernél hát vissza csak egy helytartót is uramnak legkisebb szolgái közül? És te bíztad magadat Egyiptomra szekérhad és lovasok dolgában!
౨౪అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా!
25 Ám, vajon az Örökkévaló nélkül jöttem-e föl e hely ellen, hogy elpusztítsam? Az Örökkévaló mondta nekem: menj föl ez ország ellen és pusztítsd el!
౨౫యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ‘ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి’ అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
26 Erre szólt Eljákim, Chilkíjáhú fia, meg Sebna és Jóách Rabsákéhoz: Beszélj, kérlek, szolgáidhoz arámul, mert mi értjük; s ne beszélj velünk zsidóul azon nép fülei hallatára, mely a falon van.
౨౬రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. “నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు” అన్నారు.
27 De szólt hozzájuk Rabsáké: Vajon uradhoz és tehozzád küldött-e engem uram, hogy elmondjam e szavakat? Nemde inkább azon emberekhez, kik a falon ülnek, hogy egyék a ganajukat és igyák a vizeletüket veletek együtt!
౨౭రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
28 Erre odaállt Rabsáké és fennhangon kiáltott zsidóul, beszélt és mondta: Halljátok a nagy királynak, Assúr királyának szavát!
౨౮అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో “మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే,
29 Így szól a király: ne ámítson benneteket Chizkíjáhú, mert nem menthet meg titeket az ő kezéből.
౨౯హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు.
30 És ne biztasson benneteket Chizkíjáhú az Örökkévalóval, mondván: meg fog menteni minket az Örökkévaló és nem adatik e város Assúr királyának kezébe.
౩౦యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
31 Ne hallgassatok Chizkíjáhúra! Mert így szól Assúr királya: csináljatok velem békét és jertek ki hozzám, hogy ehessétek ki-ki az ő szőlőtőjét és ki-ki az ő fügefáját és hogy ihassátok ki-ki kútja vizét.
౩౧హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు.
32 A míg eljövök és elviszlek benneteket egy országba, mely olyan, mint a ti országotok: gabona és must országába, kenyér és szőlők országába, olajfa és méz országába, hogy éljetek és meg ne haljatok. Ne hallgassatok hát Chizkíjáhúra, midőn csábítgat titeket, mondván: az Örökkévaló majd megment bennünket.
౩౨ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.
33 Hát megmentették-e a nemzetek istenei ki-ki az ő országát Assúr királyának kezéből?
౩౩వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా?
34 Hol vannak Chamát és Arpád istenei, hol Szefarvájim, Héná és Ivva istenei, hogy megmentették volna Sómrónt kezemből?
౩౪హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా?
35 Kik azok az országok minden istenei közül, a kik megmentették az ő országukat kezemből, hogy az Örökkévaló megmentené Jeruzsálemet kezemből?
౩౫మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?” అన్నాడు.
36 Hallgatott a nép és nem feleltek neki semmit, mert parancsa volt az a királynak, mondván: ne feleljetek neki!
౩౬అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
37 Erre bement Eljákím, Chilkíja fia, aki a ház fölött volt, meg Sebna az író és Jóách, Ászáf fia, a kancellár Chizkíjáhúhoz megszaggatott ruhákkal és jelentették neki Rabsáké szavait.
౩౭గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.