< 1 Krónika 14 >
1 És küldött Chúrám, Cór királya követeket Dávidhoz meg cédrusfákat és építőműveseket és faműveseket, hogy építsenek neki házat.
౧తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
2 S megtudta Dávid, hogy megszilárdította őt az Örökkévaló királynak Izrael fölött, mert magasra emelkedett az ő királysága népe, Izrael kedvéért.
౨తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
3 És még vett Dávid feleségeket Jeruzsálemben s még nemzett Dávid fiakat s leányokat.
౩తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
4 És ezek nevei a szülötteknek, akik neki lettek Jeruzsálemben: Sammúa, Sóbáb, Nátán és Salamon;
౪యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
5 Jibchár, Elísúa és Elpélet;
౫ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
7 Elisámá, Beéljádá és Elifélet.
౭ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
8 Midőn hallották a filiszteusok, hogy fölkenetett Dávid királlyá egész Izrael fölé, fölvonultak mind a filiszteusok, hogy keressék Dávidot; meghallotta Dávid és kivonult eléjük.
౮దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
9 A filiszteusok pedig elérkeztek s elterültek Refáim völgyében.
౯ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
10 Ekkor megkérdezte Dávid az Istent, mondván: Vonuljak-e a filiszteusok ellen, a kezembe adod-e őket? Mondta neki az Örökkévaló: Vonulj és kezedbe adom őket.
౧౦“ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
11 És felvonultak Báal-Perácimba s megverte őket ott Dávid és mondta Dávid: Szétszakasztotta Isten ellenségeimet kezem által, mint vízszakadás, azért így nevezték el ama helyet: Báal-Perácim.
౧౧వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
12 Ott hagyták isteneiket; s megparancsolta Dávid és elégettettek tűzben.
౧౨ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
13 Még tovább is tették a filiszteusok és elterültek a völgyben.
౧౩ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
14 Ekkor ismét megkérdezte Dávid az Istent. És mondta neki Isten: ne vonulj fel utánuk, fordulj el tőlük és támadj rájuk a szederfák felől;
౧౪దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
15 s lesz, mikor lépés neszét hallod a szederfák csúcsain, akkor vonulj ki a harcra, mert az Isten kivonult eléd, hogy megverje a filiszteusok táborát.
౧౫కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు.
16 És cselekedett Dávid, amint neki megparancsolta az Isten és megverték a filiszteusok táborát Gibeóntól Gézerig.
౧౬దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
17 És elterjedt Dávid neve mind az országokba, és rátette az Örökkévaló rettegését mind a nemzetekre.
౧౭కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.