< यिर्मयाह 24 >
1 १ जब बाबेल का राजा नबूकदनेस्सर, यहोयाकीम के पुत्र यहूदा के राजा यकोन्याह को, और यहूदा के हाकिमों और लोहारों और अन्य कारीगरों को बन्दी बनाकर यरूशलेम से बाबेल को ले गया, तो उसके बाद यहोवा ने मुझ को अपने मन्दिर के सामने रखे हुए अंजीरों के दो टोकरे दिखाए।
౧బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజు యెహోయాకీము కొడుకు యెకోన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను, యెరూషలేము నుంచి బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత యెహోవా మందిరం ముందున్న రెండు గంపల అంజూరు పళ్ళు యెహోవా నాకు చూపించాడు.
2 २ एक टोकरे में तो पहले से पके अच्छे-अच्छे अंजीर थे, और दूसरे टोकरे में बहुत निकम्मे अंजीर थे, वरन् वे ऐसे निकम्मे थे कि खाने के योग्य भी न थे।
౨ఒక గంపలో మగ్గిన అంజూరు పళ్ళు ఉన్నాయి. రెండవ గంపలో తినడానికి వీలు లేకుండా బాగా కుళ్ళిపోయిన అంజూరు పళ్ళు ఉన్నాయి.
3 ३ फिर यहोवा ने मुझसे पूछा, “हे यिर्मयाह, तुझे क्या देख पड़ता है?” मैंने कहा, “अंजीर; जो अंजीर अच्छे हैं वह तो बहुत ही अच्छे हैं, परन्तु जो निकम्मे हैं, वह बहुत ही निकम्मे हैं; वरन् ऐसे निकम्मे हैं कि खाने के योग्य भी नहीं हैं।”
౩“యిర్మీయా! నువ్వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను ఆడిగాడు. అందుకు నేను “అంజూరు పళ్ళు. మంచివి చాలా బాగున్నాన్నాయి. చెడ్డవి బాగా కుళ్ళిపోయాయి. తినడానికి పనికి రావు.” అన్నాను.
4 ४ तब यहोवा का यह वचन मेरे पास पहुँचा,
౪అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
5 ५ “इस्राएल का परमेश्वर यहोवा यह कहता है, जैसे अच्छे अंजीरों को, वैसे ही मैं यहूदी बन्दियों को जिन्हें मैंने इस स्थान से कसदियों के देश में भेज दिया है, देखकर प्रसन्न होऊँगा।
౫“ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలం నుంచి నేను కల్దీయుల దేశానికి పంపించాను. వాళ్ళను ఈ మంచి అంజూరు పళ్ళలాగా ఎంచుతాను.
6 ६ मैं उन पर कृपादृष्टि रखूँगा और उनको इस देश में लौटा ले आऊँगा; और उन्हें नाश न करूँगा, परन्तु बनाऊँगा; उन्हें उखाड़ न डालूँगा, परन्तु लगाए रखूँगा।
౬వాళ్లకు మేలు కలగడానికి నేను వాళ్ళ మీద దృష్టి పెడతాను. ఈ దేశానికి వాళ్ళను మళ్ళీ తీసుకువస్తాను. నేను వాళ్ళను పడగొట్టకుండా కడతాను. పెళ్లగించకుండా నాటుతాను.
7 ७ मैं उनका ऐसा मन कर दूँगा कि वे मुझे जानेंगे कि मैं यहोवा हूँ; और वे मेरी प्रजा ठहरेंगे और मैं उनका परमेश्वर ठहरूँगा, क्योंकि वे मेरी ओर सारे मन से फिरेंगे।
౭నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”
8 ८ “परन्तु जैसे निकम्मे अंजीर, निकम्मे होने के कारण खाए नहीं जाते, उसी प्रकार से मैं यहूदा के राजा सिदकिय्याह और उसके हाकिमों और बचे हुए यरूशलेमियों को, जो इस देश में या मिस्र में रह गए हैं, छोड़ दूँगा।
౮“యూదా రాజు సిద్కియానూ అతని అధికారులనూ దేశంలో మిగిలిన వాళ్ళనూ ఐగుప్తు దేశంలో నివసించే వాళ్ళనూ బాగా చెడిపోయి తినడానికి పనికిరాని ఆ కుళ్ళిపోయిన అంజూరు పళ్ళలాగా ఉంచుతానని యెహోవా చెబుతున్నాడు.
9 ९ इस कारण वे पृथ्वी के राज्य-राज्य में मारे-मारे फिरते हुए दुःख भोगते रहेंगे; और जितने स्थानों में मैं उन्हें जबरन निकाल दूँगा, उन सभी में वे नामधराई और दृष्टांत और श्राप का विषय होंगे।
౯వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
10 १० और मैं उनमें तलवार चलाऊँगा, और अकाल और मरी फैलाऊँगा, और अन्त में इस देश में से जिसे मैंने उनके पुरखाओं को और उनको दिया, वे मिट जाएँगे।”
౧౦నేను వారికీ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన దేశంలో ఉండకుండా వాళ్ళు నాశనమయ్యే వరకూ నేను కత్తినీ కరువునూ అంటు వ్యాధుల్నీ వాళ్లలోకి పంపుతాను.”