< תהילים 82 >

מזמור לאסף אלהים נצב בעדת אל בקרב אלהים ישפט׃ 1
ఆసాపు కీర్తన దివ్య సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు. దేవుళ్ళగా చెప్పుకొనేవారు వారి మధ్య ఆయన తీర్పు తీర్చేవాడు.
עד מתי תשפטו עול ופני רשעים תשאו סלה׃ 2
ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం మీరు దుర్మార్గుల పట్ల పక్షపాతం చూపుతారు? (సెలా)
שפטו דל ויתום עני ורש הצדיקו׃ 3
పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
פלטו דל ואביון מיד רשעים הצילו׃ 4
పేదలనూ దరిద్రులనూ విడిపించండి. దుర్మార్గుల చేతిలోనుంచి వాళ్ళను తప్పించండి.
לא ידעו ולא יבינו בחשכה יתהלכו ימוטו כל מוסדי ארץ׃ 5
వాళ్లకు తెలివి లేదు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు చీకట్లో తిరుగుతుంటారు. భూమి పునాదులన్నీ చితికి పోతున్నాయి.
אני אמרתי אלהים אתם ובני עליון כלכם׃ 6
మీరు దేవుళ్ళు, మీరంతా సర్వోన్నతుని కుమారులు, అని నేను అన్నాను.
אכן כאדם תמותון וכאחד השרים תפלו׃ 7
అయినా ఇతరుల్లాగే మీరూ చనిపోతారు అధికారుల్లోని ఒకరిలాగా కూలిపోతారు.
קומה אלהים שפטה הארץ כי אתה תנחל בכל הגוים׃ 8
దేవా, లేచి భూమికి తీర్పు తీర్చు. నువ్వు రాజ్యాలన్నిటినీ వారసత్వంగా పొందుతావు.

< תהילים 82 >