< תהילים 48 >
שיר מזמור לבני קרח גדול יהוה ומהלל מאד בעיר אלהינו הר קדשו׃ | 1 |
౧ఒక పాట, కోరహు వారసుల కీర్తన. మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
יפה נוף משוש כל הארץ הר ציון ירכתי צפון קרית מלך רב׃ | 2 |
౨అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
אלהים בארמנותיה נודע למשגב׃ | 3 |
౩దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.
כי הנה המלכים נועדו עברו יחדו׃ | 4 |
౪చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
המה ראו כן תמהו נבהלו נחפזו׃ | 5 |
౫వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
רעדה אחזתם שם חיל כיולדה׃ | 6 |
౬వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.
ברוח קדים תשבר אניות תרשיש׃ | 7 |
౭తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
כאשר שמענו כן ראינו בעיר יהוה צבאות בעיר אלהינו אלהים יכוננה עד עולם סלה׃ | 8 |
౮సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
דמינו אלהים חסדך בקרב היכלך׃ | 9 |
౯దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.
כשמך אלהים כן תהלתך על קצוי ארץ צדק מלאה ימינך׃ | 10 |
౧౦దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
ישמח הר ציון תגלנה בנות יהודה למען משפטיך׃ | 11 |
౧౧న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ.
סבו ציון והקיפוה ספרו מגדליה׃ | 12 |
౧౨సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.
שיתו לבכם לחילה פסגו ארמנותיה למען תספרו לדור אחרון׃ | 13 |
౧౩తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.
כי זה אלהים אלהינו עולם ועד הוא ינהגנו על מות׃ | 14 |
౧౪ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.