< תהילים 35 >
לדוד ריבה יהוה את יריבי לחם את לחמי׃ | 1 |
౧దావీదు కీర్తన యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి.
החזק מגן וצנה וקומה בעזרתי׃ | 2 |
౨నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.
והרק חנית וסגר לקראת רדפי אמר לנפשי ישעתך אני׃ | 3 |
౩నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.
יבשו ויכלמו מבקשי נפשי יסגו אחור ויחפרו חשבי רעתי׃ | 4 |
౪నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక!
יהיו כמץ לפני רוח ומלאך יהוה דוחה׃ | 5 |
౫యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక!
יהי דרכם חשך וחלקלקות ומלאך יהוה רדפם׃ | 6 |
౬యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!
כי חנם טמנו לי שחת רשתם חנם חפרו לנפשי׃ | 7 |
౭కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.
תבואהו שואה לא ידע ורשתו אשר טמן תלכדו בשואה יפל בה׃ | 8 |
౮వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ.
ונפשי תגיל ביהוה תשיש בישועתו׃ | 9 |
౯అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను.
כל עצמותי תאמרנה יהוה מי כמוך מציל עני מחזק ממנו ועני ואביון מגזלו׃ | 10 |
౧౦అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?
יקומון עדי חמס אשר לא ידעתי ישאלוני׃ | 11 |
౧౧అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.
ישלמוני רעה תחת טובה שכול לנפשי׃ | 12 |
౧౨నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.
ואני בחלותם לבושי שק עניתי בצום נפשי ותפלתי על חיקי תשוב׃ | 13 |
౧౩అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.
כרע כאח לי התהלכתי כאבל אם קדר שחותי׃ | 14 |
౧౪అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.
ובצלעי שמחו ונאספו נאספו עלי נכים ולא ידעתי קרעו ולא דמו׃ | 15 |
౧౫కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు.
בחנפי לעגי מעוג חרק עלי שנימו׃ | 16 |
౧౬గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.
אדני כמה תראה השיבה נפשי משאיהם מכפירים יחידתי׃ | 17 |
౧౭ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు.
אודך בקהל רב בעם עצום אהללך׃ | 18 |
౧౮అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.
אל ישמחו לי איבי שקר שנאי חנם יקרצו עין׃ | 19 |
౧౯నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.
כי לא שלום ידברו ועל רגעי ארץ דברי מרמות יחשבון׃ | 20 |
౨౦వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.
וירחיבו עלי פיהם אמרו האח האח ראתה עינינו׃ | 21 |
౨౧నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
ראיתה יהוה אל תחרש אדני אל תרחק ממני׃ | 22 |
౨౨యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు.
העירה והקיצה למשפטי אלהי ואדני לריבי׃ | 23 |
౨౩నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు.
שפטני כצדקך יהוה אלהי ואל ישמחו לי׃ | 24 |
౨౪యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు.
אל יאמרו בלבם האח נפשנו אל יאמרו בלענוהו׃ | 25 |
౨౫వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం, అని చెప్పనివ్వకు.
יבשו ויחפרו יחדו שמחי רעתי ילבשו בשת וכלמה המגדילים עלי׃ | 26 |
౨౬వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!
ירנו וישמחו חפצי צדקי ויאמרו תמיד יגדל יהוה החפץ שלום עבדו׃ | 27 |
౨౭నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక!
ולשוני תהגה צדקך כל היום תהלתך׃ | 28 |
౨౮అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.