< תהילים 30 >
מזמור שיר חנכת הבית לדוד ארוממך יהוה כי דליתני ולא שמחת איבי לי׃ | 1 |
౧ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.
יהוה אלהי שועתי אליך ותרפאני׃ | 2 |
౨యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.
יהוה העלית מן שאול נפשי חייתני מיורדי בור׃ (Sheol ) | 3 |
౩యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు. (Sheol )
זמרו ליהוה חסידיו והודו לזכר קדשו׃ | 4 |
౪యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
כי רגע באפו חיים ברצונו בערב ילין בכי ולבקר רנה׃ | 5 |
౫ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.
ואני אמרתי בשלוי בל אמוט לעולם׃ | 6 |
౬నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను.
יהוה ברצונך העמדתה להררי עז הסתרת פניך הייתי נבהל׃ | 7 |
౭యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.
אליך יהוה אקרא ואל אדני אתחנן׃ | 8 |
౮యెహోవా, నీకే నేను మొరపెట్టాను, నా ప్రభువును బతిమాలుకున్నాను.
מה בצע בדמי ברדתי אל שחת היודך עפר היגיד אמתך׃ | 9 |
౯నేను చనిపోయి సమాధిలోకి దిగిపోతే ప్రయోజనం ఏముంది? మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ నమ్మకత్వాన్ని అది వివరిస్తుందా?
שמע יהוה וחנני יהוה היה עזר לי׃ | 10 |
౧౦యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి.
הפכת מספדי למחול לי פתחת שקי ותאזרני שמחה׃ | 11 |
౧౧నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.
למען יזמרך כבוד ולא ידם יהוה אלהי לעולם אודך׃ | 12 |
౧౨అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.