< מִשְׁלֵי 3 >
בני תורתי אל תשכח ומצותי יצר לבך׃ | 1 |
౧కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.
כי ארך ימים ושנות חיים ושלום יוסיפו לך׃ | 2 |
౨అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.
חסד ואמת אל יעזבך קשרם על גרגרותיך כתבם על לוח לבך׃ | 3 |
౩అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.
ומצא חן ושכל טוב בעיני אלהים ואדם׃ | 4 |
౪అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.
בטח אל יהוה בכל לבך ואל בינתך אל תשען׃ | 5 |
౫నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
בכל דרכיך דעהו והוא יישר ארחתיך׃ | 6 |
౬ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
אל תהי חכם בעיניך ירא את יהוה וסור מרע׃ | 7 |
౭నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
רפאות תהי לשרך ושקוי לעצמותיך׃ | 8 |
౮అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
כבד את יהוה מהונך ומראשית כל תבואתך׃ | 9 |
౯యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.
וימלאו אסמיך שבע ותירוש יקביך יפרצו׃ | 10 |
౧౦అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.
מוסר יהוה בני אל תמאס ואל תקץ בתוכחתו׃ | 11 |
౧౧కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.
כי את אשר יאהב יהוה יוכיח וכאב את בן ירצה׃ | 12 |
౧౨ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.
אשרי אדם מצא חכמה ואדם יפיק תבונה׃ | 13 |
౧౩జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.
כי טוב סחרה מסחר כסף ומחרוץ תבואתה׃ | 14 |
౧౪వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.
יקרה היא מפניים וכל חפציך לא ישוו בה׃ | 15 |
౧౫రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.
ארך ימים בימינה בשמאולה עשר וכבוד׃ | 16 |
౧౬జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
דרכיה דרכי נעם וכל נתיבותיה שלום׃ | 17 |
౧౭అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.
עץ חיים היא למחזיקים בה ותמכיה מאשר׃ | 18 |
౧౮దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.
יהוה בחכמה יסד ארץ כונן שמים בתבונה׃ | 19 |
౧౯తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.
בדעתו תהומות נבקעו ושחקים ירעפו טל׃ | 20 |
౨౦ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.
בני אל ילזו מעיניך נצר תשיה ומזמה׃ | 21 |
౨౧కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.
ויהיו חיים לנפשך וחן לגרגרתיך׃ | 22 |
౨౨జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.
אז תלך לבטח דרכך ורגלך לא תגוף׃ | 23 |
౨౩అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.
אם תשכב לא תפחד ושכבת וערבה שנתך׃ | 24 |
౨౪పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
אל תירא מפחד פתאם ומשאת רשעים כי תבא׃ | 25 |
౨౫అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.
כי יהוה יהיה בכסלך ושמר רגלך מלכד׃ | 26 |
౨౬యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.
אל תמנע טוב מבעליו בהיות לאל ידיך לעשות׃ | 27 |
౨౭అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.
אל תאמר לרעיך לך ושוב ומחר אתן ויש אתך׃ | 28 |
౨౮నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.
אל תחרש על רעך רעה והוא יושב לבטח אתך׃ | 29 |
౨౯నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.
אל תרוב עם אדם חנם אם לא גמלך רעה׃ | 30 |
౩౦నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.
אל תקנא באיש חמס ואל תבחר בכל דרכיו׃ | 31 |
౩౧దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.
כי תועבת יהוה נלוז ואת ישרים סודו׃ | 32 |
౩౨కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.
מארת יהוה בבית רשע ונוה צדיקים יברך׃ | 33 |
౩౩దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.
אם ללצים הוא יליץ ולעניים יתן חן׃ | 34 |
౩౪ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
כבוד חכמים ינחלו וכסילים מרים קלון׃ | 35 |
౩౫జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.