< איוב 35 >
౧ఎలీహు ఇలా జవాబు ఇచ్చాడు.
הזאת חשבת למשפט אמרת צדקי מאל׃ | 2 |
౨నువ్వు నిర్దోషివని అనుకుంటున్నావా? “నేను దేవుడి కన్నా నీతిపరుణ్ణి” అనుకుంటున్నావా?
כי תאמר מה יסכן לך מה אעיל מחטאתי׃ | 3 |
౩“నేను నీతిగా ఉంటే ప్రయోజనం ఏమిటి? పాపం చేస్తే నాకు కలిగిన లాభం కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమిటి?” అని నువ్వు చెబుతున్నావే.
אני אשיבך מלין ואת רעיך עמך׃ | 4 |
౪నీకూ నీ మిత్రులకు కూడా నేను సమాధానం చెబుతాను.
הבט שמים וראה ושור שחקים גבהו ממך׃ | 5 |
౫ఆకాశం వైపు తేరి చూడు. నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు.
אם חטאת מה תפעל בו ורבו פשעיך מה תעשה לו׃ | 6 |
౬నువ్వు పాపం చేసినా ఆయనకు నష్టమేమిటి? నీ అతిక్రమాలు పోగుపడినా ఆయనకి నువ్వు చేసిందేమిటి?
אם צדקת מה תתן לו או מה מידך יקח׃ | 7 |
౭నువ్వు నీతిమంతుడివైతే ఆయనకు నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ దగ్గర నుండి ఏమైనా తీసుకుంటాడా?
לאיש כמוך רשעך ולבן אדם צדקתך׃ | 8 |
౮నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది. నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది.
מרב עשוקים יזעיקו ישועו מזרוע רבים׃ | 9 |
౯అనేకమైన అణచివేత క్రియల వలన ప్రజలు అక్రోశిస్తారు. బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కోసం కేకలు పెడతారు.
ולא אמר איה אלוה עשי נתן זמרות בלילה׃ | 10 |
౧౦అయితే “రాత్రిలో మనకు పాటలు ఇస్తూ,
מלפנו מבהמות ארץ ומעוף השמים יחכמנו׃ | 11 |
౧౧భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుతూ, ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలగజేస్తూ నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు?” అనుకునే వారెవరూ లేరు.
שם יצעקו ולא יענה מפני גאון רעים׃ | 12 |
౧౨వారు దుష్టుల గర్వాన్ని బట్టి మొర పెడతారు గాని ఆయన జవాబివ్వడం లేదు.
אך שוא לא ישמע אל ושדי לא ישורנה׃ | 13 |
౧౩దేవుడు ఒక్కనాటికీ వ్యర్థమైన మాటలు ఆలకించడు. సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు.
אף כי תאמר לא תשורנו דין לפניו ותחולל לו׃ | 14 |
౧౪ఆయన కనిపించడం లేదని నువ్వు చెబితే మరి ఇంకెంతగా ఆయన పెడచెవిన పెడతాడు! వాదం ఆయన ఎదుటనే ఉంది. ఆయన కోసం నువ్వు కనిపెట్టవలసిందే.
ועתה כי אין פקד אפו ולא ידע בפש מאד׃ | 15 |
౧౫“ఆయన ఎవరినీ కోపంతో దండించడు, మనుషుల అహంకారాన్ని ఆయన పట్టించుకోడు” అని నీవంటే మరి ఇంకెంతో నిశ్చయంగా ఆయన జవాబు చెప్పకుండా మౌనం దాలుస్తాడు గదా.
ואיוב הבל יפצה פיהו בבלי דעת מלין יכבר׃ | 16 |
౧౬కాబట్టి యోబు కేవలం బుద్ధితక్కువ మాటలు పలకడానికే తన నోరు తెరిచాడు. జ్ఞానం లేని మాటలనే రాసులు పోస్తున్నాడు.