< איוב 13 >
הן כל ראתה עיני שמעה אזני ותבן לה׃ | 1 |
౧ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది,
כדעתכם ידעתי גם אני לא נפל אנכי מכם׃ | 2 |
౨మీకు తెలిసిన విషయాలన్నీ నాక్కూడా తెలుసు. నాకున్న జ్ఞానం కంటే మీకున్న జ్ఞానం ఎక్కువేమీ కాదు.
אולם אני אל שדי אדבר והוכח אל אל אחפץ׃ | 3 |
౩నేను సర్వశక్తుడైన దేవునితోనే మాట్లాడాలని చూస్తున్నాను. ఆయనతోనే నేను వాదిస్తాను.
ואולם אתם טפלי שקר רפאי אלל כלכם׃ | 4 |
౪మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
מי יתן החרש תחרישון ותהי לכם לחכמה׃ | 5 |
౫మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం.
שמעו נא תוכחתי ורבות שפתי הקשיבו׃ | 6 |
౬దయచేసి నేను చెప్పేది వినండి. నా పక్షంగా నేను చేసుకుంటున్న వాదన ఆలకించండి.
הלאל תדברו עולה ולו תדברו רמיה׃ | 7 |
౭మీరు దేవుని పక్షంగా నిలబడి అన్యాయంగా వాదించ వచ్చా? ఆయన తరపున వంచన మాటలు పలక వచ్చా?
הפניו תשאון אם לאל תריבון׃ | 8 |
౮ఆయన పట్ల పక్షపాత వైఖరి ప్రదర్శిస్తారా? మీరు దేవుని పక్షాన నిలబడి వాదిస్తారా?
הטוב כי יחקר אתכם אם כהתל באנוש תהתלו בו׃ | 9 |
౯ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమకరమా? ఒకడు ఇతరులను మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేస్తారా?
הוכח יוכיח אתכם אם בסתר פנים תשאון׃ | 10 |
౧౦మీరు రహస్యంగా పక్షపాతం చూపిస్తే ఆయన తప్పకుండా మిమ్మల్ని గద్దిస్తాడు.
הלא שאתו תבעת אתכם ופחדו יפל עליכם׃ | 11 |
౧౧ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
זכרניכם משלי אפר לגבי חמר גביכם׃ | 12 |
౧౨మీరు చెప్పే గద్దింపు మాటలు బూడిదలాంటి సామెతలు. మీరు చేస్తున్న వాదాలు మట్టిగోడలవంటివి.
החרישו ממני ואדברה אני ויעבר עלי מה׃ | 13 |
౧౩నా జోలికి రాకుండా మౌనంగా ఉండండి. నేను చెప్పేది వినండి. నాకు ఏమి జరగాలని ఉందో అదే జరుగు గాక.
על מה אשא בשרי בשני ונפשי אשים בכפי׃ | 14 |
౧౪నా ప్రాణాన్ని నేనే ఎరగా ఎందుకు చేసుకోవాలి? నా ప్రాణానికి తెగించి మాట్లాడతాను.
הן יקטלני לא איחל אך דרכי אל פניו אוכיח׃ | 15 |
౧౫వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన కోసం ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆయన సమక్షంలో నా న్యాయ ప్రవర్తనను రుజువు పరుచుకుంటాను.
גם הוא לי לישועה כי לא לפניו חנף יבוא׃ | 16 |
౧౬దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.
שמעו שמוע מלתי ואחותי באזניכם׃ | 17 |
౧౭నా సాక్షం జాగ్రత్తగా వినండి. నేను చేసే ప్రమాణాలు మీ చెవుల్లో మారుమ్రోగనియ్యండి.
הנה נא ערכתי משפט ידעתי כי אני אצדק׃ | 18 |
౧౮ఆలోచించండి, నేను నా వివాదాన్ని చక్కబరచుకున్నాను. నేను నిర్దోషిగా తీర్చబడతానని నాకు తెలుసు.
מי הוא יריב עמדי כי עתה אחריש ואגוע׃ | 19 |
౧౯నాతో వాదం పెట్టుకుని గెలవ గలిగేవాడు ఎవరు? ఎవరైనా ఎదుటికి వస్తే నేను నోరు మూసుకుని ప్రాణం విడిచిపెడతాను.
אך שתים אל תעש עמדי אז מפניך לא אסתר׃ | 20 |
౨౦దేవా, ఈ రెండు విషయాలు నా పక్షంగా జరిగించు. అప్పుడు నేను దాక్కోకుండా నీ ఎదుట కనపడతాను.
כפך מעלי הרחק ואמתך אל תבעתני׃ | 21 |
౨౧నీ బలమైన చెయ్యి నా మీద నుండి తొలగించు. నీ భయం వల్ల నేను బెదిరిపోయేలా చెయ్యకు.
וקרא ואנכי אענה או אדבר והשיבני׃ | 22 |
౨౨అప్పుడు నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. లేదా నేను పిలుస్తాను, నాకు జవాబు చెప్పు.
כמה לי עונות וחטאות פשעי וחטאתי הדיעני׃ | 23 |
౨౩నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.
למה פניך תסתיר ותחשבני לאויב לך׃ | 24 |
౨౪నీ ముఖాన్ని నాకు చాటు చేసుకుంటున్నావెందుకు? నన్నెందుకు నీ శత్రువుగా భావిస్తున్నావు?
העלה נדף תערוץ ואת קש יבש תרדף׃ | 25 |
౨౫అటూ ఇటూ కొట్టుకుపోయే ఆకులాంటి నన్ను భయపెడతావా? ఎండిపోయిన చెత్త వెంటబడతావా?
כי תכתב עלי מררות ותורישני עונות נעורי׃ | 26 |
౨౬నువ్వు నాకు కఠినమైన శిక్ష విధించావు. నేను చిన్నతనంలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేశావు.
ותשם בסד רגלי ותשמור כל ארחותי על שרשי רגלי תתחקה׃ | 27 |
౨౭నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడవడి అంతా నువ్వు కనిపెడుతున్నావు. నా అడుగులకు నువ్వే గిరి గీశావు.
והוא כרקב יבלה כבגד אכלו עש׃ | 28 |
౨౮కుళ్ళిపోయిన శవంలాగా ఉన్నవాడి చుట్టూ, చిమ్మటలు తినివేసిన గుడ్డపేలికలాంటివాడి చుట్టూ గిరి గీసి కాపు కాస్తున్నావు.