< בראשית 10 >
ואלה תולדת בני נח שם חם ויפת ויולדו להם בנים אחר המבול׃ | 1 |
౧నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
בני יפת גמר ומגוג ומדי ויון ותבל ומשך ותירס׃ | 2 |
౨యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
ובני גמר אשכנז וריפת ותגרמה׃ | 3 |
౩గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
ובני יון אלישה ותרשיש כתים ודדנים׃ | 4 |
౪యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
מאלה נפרדו איי הגוים בארצתם איש ללשנו למשפחתם בגויהם׃ | 5 |
౫వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
ובני חם כוש ומצרים ופוט וכנען׃ | 6 |
౬హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
ובני כוש סבא וחוילה וסבתה ורעמה וסבתכא ובני רעמה שבא ודדן׃ | 7 |
౭కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
וכוש ילד את נמרד הוא החל להיות גבר בארץ׃ | 8 |
౮కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
הוא היה גבר ציד לפני יהוה על כן יאמר כנמרד גבור ציד לפני יהוה׃ | 9 |
౯అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
ותהי ראשית ממלכתו בבל וארך ואכד וכלנה בארץ שנער׃ | 10 |
౧౦షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
מן הארץ ההוא יצא אשור ויבן את נינוה ואת רחבת עיר ואת כלח׃ | 11 |
౧౧ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
ואת רסן בין נינוה ובין כלח הוא העיר הגדלה׃ | 12 |
౧౨నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
ומצרים ילד את לודים ואת ענמים ואת להבים ואת נפתחים׃ | 13 |
౧౩మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
ואת פתרסים ואת כסלחים אשר יצאו משם פלשתים ואת כפתרים׃ | 14 |
౧౪పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
וכנען ילד את צידן בכרו ואת חת׃ | 15 |
౧౫కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
ואת היבוסי ואת האמרי ואת הגרגשי׃ | 16 |
౧౬హివ్వీ, అర్కీయు, సినీయ,
ואת החוי ואת הערקי ואת הסיני׃ | 17 |
౧౭అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
ואת הארודי ואת הצמרי ואת החמתי ואחר נפצו משפחות הכנעני׃ | 18 |
౧౮ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
ויהי גבול הכנעני מצידן באכה גררה עד עזה באכה סדמה ועמרה ואדמה וצבים עד לשע׃ | 19 |
౧౯కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
אלה בני חם למשפחתם ללשנתם בארצתם בגויהם׃ | 20 |
౨౦వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
ולשם ילד גם הוא אבי כל בני עבר אחי יפת הגדול׃ | 21 |
౨౧యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
בני שם עילם ואשור וארפכשד ולוד וארם׃ | 22 |
౨౨షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
ובני ארם עוץ וחול וגתר ומש׃ | 23 |
౨౩అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
וארפכשד ילד את שלח ושלח ילד את עבר׃ | 24 |
౨౪అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
ולעבר ילד שני בנים שם האחד פלג כי בימיו נפלגה הארץ ושם אחיו יקטן׃ | 25 |
౨౫ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
ויקטן ילד את אלמודד ואת שלף ואת חצרמות ואת ירח׃ | 26 |
౨౬యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
ואת הדורם ואת אוזל ואת דקלה׃ | 27 |
౨౭హదోరము, ఊజాలు, దిక్లా,
ואת עובל ואת אבימאל ואת שבא׃ | 28 |
౨౮ఓబాలు, అబీమాయెలు, షేబ,
ואת אופר ואת חוילה ואת יובב כל אלה בני יקטן׃ | 29 |
౨౯ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
ויהי מושבם ממשא באכה ספרה הר הקדם׃ | 30 |
౩౦వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
אלה בני שם למשפחתם ללשנתם בארצתם לגויהם׃ | 31 |
౩౧వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
אלה משפחת בני נח לתולדתם בגויהם ומאלה נפרדו הגוים בארץ אחר המבול׃ | 32 |
౩౨తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.