< מלכים ב 3 >

וִיהוֹרָם בֶּן־אַחְאָב מָלַךְ עַל־יִשְׂרָאֵל בְּשֹׁמְרוֹן בִּשְׁנַת שְׁמֹנֶה עֶשְׂרֵה לִיהוֹשָׁפָט מֶלֶךְ יְהוּדָה וַיִּמְלֹךְ שְׁתֵּים־עֶשְׂרֵה שָׁנָֽה׃ 1
యూదా రాజు యెహోషాపాతు పాలన పద్దెనిమిదో సంవత్సరంలో అహాబు కొడుకు యెహోరాము ఇశ్రాయేలుకి రాజయ్యాడు. ఇతడు షోమ్రోనులో పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు.
וַיַּעֲשֶׂה הָרַע בְּעֵינֵי יְהוָה רַק לֹא כְאָבִיו וּכְאִמּוֹ וַיָּסַר אֶת־מַצְּבַת הַבַּעַל אֲשֶׁר עָשָׂה אָבִֽיו׃ 2
తన తల్లిదండ్రుల తీరును పూర్తిగా అనుసరించక పోయినా ఇతడు దేవుని దృష్టిలో చెడ్డ పనులే చేశాడు. అయితే బయలు దేవుణ్ణి పూజించడం కోసం అతని తండ్రి కట్టించిన రాతి స్తంభాన్ని తీసివేశాడు.
רַק בְּחַטֹּאות יָרָבְעָם בֶּֽן־נְבָט אֲשֶׁר־הֶחֱטִיא אֶת־יִשְׂרָאֵל דָּבֵק לֹא־סָר מִמֶּֽנָּה׃ 3
నెబాతు కొడుకు యరొబాము ఏ ఏ అక్రమాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడో అవే అక్రమాలు ఇతడూ చేశాడు.
וּמֵישַׁע מֶֽלֶךְ־מוֹאָב הָיָה נֹקֵד וְהֵשִׁיב לְמֶֽלֶךְ־יִשְׂרָאֵל מֵאָה־אֶלֶף כָּרִים וּמֵאָה אֶלֶף אֵילִים צָֽמֶר׃ 4
మోయాబు రాజు మేషాకు విస్తారమైన మేకల, గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి ఒక లక్ష గొర్రె పిల్లలనూ, లక్ష గొర్రె పొట్టేళ్ల ఉన్నినీ పన్నుగా కడుతుండేవాడు.
וַיְהִי כְּמוֹת אַחְאָב וַיִּפְשַׁע מֶֽלֶךְ־מוֹאָב בְּמֶלֶךְ יִשְׂרָאֵֽל׃ 5
కానీ అహాబు చనిపోయిన తరువాత ఈ మోయాబు రాజు మేషాఇశ్రాయేలు రాజుపై తిరుగుబాటు చేశాడు.
וַיֵּצֵא הַמֶּלֶךְ יְהוֹרָם בַּיּוֹם הַהוּא מִשֹּׁמְרוֹן וַיִּפְקֹד אֶת־כָּל־יִשְׂרָאֵֽל׃ 6
దాంతో ఇశ్రాయేలు ప్రజలందర్నీ యుద్ధానికి సిద్ధం చేయడానికి యెహోరాము షోమ్రోనులో నుండి ప్రయాణమయ్యాడు.
וַיֵּלֶךְ וַיִּשְׁלַח אֶל־יְהוֹשָׁפָט מֶֽלֶךְ־יְהוּדָה לֵאמֹר מֶלֶךְ מוֹאָב פָּשַׁע בִּי הֲתֵלֵךְ אִתִּי אֶל־מוֹאָב לַמִּלְחָמָה וַיֹּאמֶר אֶעֱלֶה כָּמוֹנִי כָמוֹךָ כְּעַמִּי כְעַמֶּךָ כְּסוּסַי כְּסוּסֶֽיךָ׃ 7
ఇతడు యూదా దేశానికి రాజుగా ఉన్న యెహోషాపాతుకు ఒక సందేశం పంపించాడు. ఆ సందేశంలో “మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు. మోయాబుపై నేను చేయబోయే యుద్ధంలో నాతో కలిసి వస్తావా?” అని అడిగాడు. దానికి యెహోషాపాతు “నేను యుద్ధానికి వస్తాను. నేనే నువ్వూ, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అనుకో” అని జవాబిచ్చాడు.
וַיֹּאמֶר אֵי־זֶה הַדֶּרֶךְ נַעֲלֶה וַיֹּאמֶר דֶּרֶךְ מִדְבַּר אֱדֽוֹם׃ 8
అప్పుడు యెహోరాము “దాడి చేయడానికి మనం ఏ దారి గుండా వెళ్దాం?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు “ఎదోము అడవి దారి గుండా వెళ్దాం” అన్నాడు.
וַיֵּלֶךְ מֶלֶךְ יִשְׂרָאֵל וּמֶֽלֶך־יְהוּדָה וּמֶלֶךְ אֱדוֹם וַיָּסֹבּוּ דֶּרֶךְ שִׁבְעַת יָמִים וְלֹא־הָיָה מַיִם לַֽמַּחֲנֶה וְלַבְּהֵמָה אֲשֶׁר בְּרַגְלֵיהֶֽם׃ 9
కాబట్టి ఇశ్రాయేలు, యూదా, ఎదోము దేశాల రాజులు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికీ, గుర్రాలకూ మిగిలిన పశువులకూ నీళ్ళు లేకుండా పోయాయి.
וַיֹּאמֶר מֶלֶךְ יִשְׂרָאֵל אֲהָהּ כִּֽי־קָרָא יְהוָה לִשְׁלֹשֶׁת הַמְּלָכִים הָאֵלֶּה לָתֵת אוֹתָם בְּיַד־מוֹאָֽב׃ 10
౧౦కాబట్టి ఇశ్రాయేలు రాజు “అయ్యోయ్యో, ఎందుకిలా జరిగింది? మోయాబు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి రాజులైన మన ముగ్గుర్నీ యెహోవా పిలిచాడా ఏమిటి?” అన్నాడు.
וַיֹּאמֶר יְהוֹשָׁפָט הַאֵין פֹּה נָבִיא לַֽיהוָה וְנִדְרְשָׁה אֶת־יְהוָה מֵאוֹתוֹ וַיַּעַן אֶחָד מֵעַבְדֵי מֶֽלֶךְ־יִשְׂרָאֵל וַיֹּאמֶר פֹּה אֱלִישָׁע בֶּן־שָׁפָט אֲשֶׁר־יָצַק מַיִם עַל־יְדֵי אֵלִיָּֽהוּ׃ 11
౧౧కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు.
וַיֹּאמֶר יְהוֹשָׁפָט יֵשׁ אוֹתוֹ דְּבַר־יְהוָה וַיֵּרְדוּ אֵלָיו מֶלֶךְ יִשְׂרָאֵל וִיהוֹשָׁפָט וּמֶלֶךְ אֱדֽוֹם׃ 12
౧౨దానికి యెహోషాపాతు “యెహోవా వాక్కు అతని దగ్గర ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యెహోషాపాతూ కలసి అతని దగ్గరికి వెళ్ళారు.
וַיֹּאמֶר אֱלִישָׁע אֶל־מֶלֶךְ יִשְׂרָאֵל מַה־לִּי וָלָךְ לֵךְ אֶל־נְבִיאֵי אָבִיךָ וְאֶל־נְבִיאֵי אִמֶּךָ וַיֹּאמֶר לוֹ מֶלֶךְ יִשְׂרָאֵל אַל כִּֽי־קָרָא יְהוָה לִשְׁלֹשֶׁת הַמְּלָכִים הָאֵלֶּה לָתֵת אוֹתָם בְּיַד־מוֹאָֽב׃ 13
౧౩ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి “నీతో నాకేం పని? నీ తల్లీ తండ్రీ పెట్టుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు అతనితో “మోయాబు వారు మమ్మల్ని ఓడించాలని యెహోవా మా ముగ్గురు రాజులను పిలిచాడు” అన్నాడు.
וַיֹּאמֶר אֱלִישָׁע חַי־יְהוָה צְבָאוֹת אֲשֶׁר עָמַדְתִּי לְפָנָיו כִּי לוּלֵי פְּנֵי יְהוֹשָׁפָט מֶֽלֶךְ־יְהוּדָה אֲנִי נֹשֵׂא אִם־אַבִּיט אֵלֶיךָ וְאִם־אֶרְאֶֽךָּ׃ 14
౧౪అప్పుడు ఎలీషా “నేను సైన్యాలకు ప్రభువు అయిన యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నాను. ఆ యెహోవా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదా రాజు యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్నసలు లక్ష్యపెట్టేవాణ్ణి కాదు. నీ వైపు చూసే వాణ్ణి కాదు.
וְעַתָּה קְחוּ־לִי מְנַגֵּן וְהָיָה כְּנַגֵּן הַֽמְנַגֵּן וַתְּהִי עָלָיו יַד־יְהוָֽה׃ 15
౧౫అయితే ఇప్పుడు తీగ వాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. తీగ వాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషా పైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు.
וַיֹּאמֶר כֹּה אָמַר יְהוָה עָשֹׂה הַנַּחַל הַזֶּה גֵּבִים ׀ גֵּבִֽים׃ 16
౧౬“యెహోవా ఇలా చెప్తున్నాడు, ఎండిన ఈ నదీ లోయలో అంతటా కందకాలు తవ్వించండి.
כִּֽי־כֹה ׀ אָמַר יְהוָה לֹֽא־תִרְאוּ רוּחַ וְלֹֽא־תִרְאוּ גֶשֶׁם וְהַנַּחַל הַהוּא יִמָּלֵא מָיִם וּשְׁתִיתֶם אַתֶּם וּמִקְנֵיכֶם וּֽבְהֶמְתְּכֶֽם׃ 17
౧౭ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, గాలీ ఉండదు, వర్షమూ రాదు. ఈ లోయ అంతా నీటితో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగుతారు. మీ పశువులూ, మీ దగ్గర ఉన్న జంతువులూ తాగుతాయి.
וְנָקַל זֹאת בְּעֵינֵי יְהוָה וְנָתַן אֶת־מוֹאָב בְּיֶדְכֶֽם׃ 18
౧౮యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు.
וְהִכִּיתֶם כָּל־עִיר מִבְצָר וְכָל־עִיר מִבְחוֹר וְכָל־עֵץ טוֹב תַּפִּילוּ וְכָל־מַעְיְנֵי־מַיִם תִּסְתֹּמוּ וְכֹל הַחֶלְקָה הַטּוֹבָה תַּכְאִבוּ בָּאֲבָנִֽים׃ 19
౧౯మీరు ప్రాకారాలున్న ప్రతి పట్టణాన్నీ, ప్రతి మంచి పట్టణాన్నీ వశం చేసుకోవాలి. అక్కడ మీరు ప్రతి మంచి చెట్టునీ నరికి వేయాలి. నీళ్ళ ఊటలను పూడ్చి వేయాలి. మంచి భూములను రాళ్ళతో నింపి పాడు చేయాలి.”
וַיְהִי בַבֹּקֶר כַּעֲלוֹת הַמִּנְחָה וְהִנֵּה־מַיִם בָּאִים מִדֶּרֶךְ אֱדוֹם וַתִּמָּלֵא הָאָרֶץ אֶת־הַמָּֽיִם׃ 20
౨౦కాబట్టి మరుసటి ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి ఎదోము వైపు నుండి నీళ్ళు పారుతూ వచ్చాయి. వారున్న ఆ ప్రాంతమంతా జలమయం అయింది.
וְכָל־מוֹאָב שָֽׁמְעוּ כִּֽי־עָלוּ הַמְּלָכִים לְהִלָּחֶם בָּם וַיִּצָּעֲקוּ מִכֹּל חֹגֵר חֲגֹרָה וָמַעְלָה וַיַּעַמְדוּ עַֽל־הַגְּבֽוּל׃ 21
౨౧తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబు వారు విన్నారు. వాళ్ళలో యువకులు మొదలు వృద్ధుల వరకూ ఆయుధాలు ధరించ గలిగిన వాళ్ళంతా ఆ దేశం సరిహద్దులో సమకూడారు.
וַיַּשְׁכִּימוּ בַבֹּקֶר וְהַשֶּׁמֶשׁ זָרְחָה עַל־הַמָּיִם וַיִּרְאוּ מוֹאָב מִנֶּגֶד אֶת־הַמַּיִם אֲדֻמִּים כַּדָּֽם׃ 22
౨౨ఉదయాన్నే వారు లేచి చూసినప్పుడు సూర్య కాంతి ఆ నీళ్ల మీద ప్రతిబింబిస్తూ ఉంది. అవతల నుండి మోయాబు వాళ్ళకు ఆ నీళ్లు రక్తంలా కనిపించాయి.
וַיֹּֽאמְרוּ דָּם זֶה הָחֳרֵב נֶֽחֶרְבוּ הַמְּלָכִים וַיַּכּוּ אִישׁ אֶת־רֵעֵהוּ וְעַתָּה לַשָּׁלָל מוֹאָֽב׃ 23
౨౩“అదంతా రక్తం! రాజులు నాశనమయ్యారు. వారు ఒకళ్లనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి, మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాము” అని చెప్పుకున్నారు.
וַיָּבֹאוּ אֶל־מַחֲנֵה יִשְׂרָאֵל וַיָּקֻמוּ יִשְׂרָאֵל וַיַּכּוּ אֶת־מוֹאָב וַיָּנֻסוּ מִפְּנֵיהֶם ויבו־וַיַּכּוּ־בָהּ וְהַכּוֹת אֶת־מוֹאָֽב׃ 24
౨౪వారు ఇశ్రాయేలు శిబిరం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మోయాబు వాళ్ళపై మెరుపు దాడి చేశారు. మోయాబు వారు ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలవలేక కాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇశ్రాయేలు సైన్యం మోయాబులో చొరబడి వాళ్ళను తరిమి చంపారు.
וְהֶעָרִים יַהֲרֹסוּ וְכָל־חֶלְקָה טוֹבָה יַשְׁלִיכוּ אִישׁ־אַבְנוֹ וּמִלְאוּהָ וְכָל־מַעְיַן־מַיִם יִסְתֹּמוּ וְכָל־עֵֽץ־טוֹב יַפִּילוּ עַד־הִשְׁאִיר אֲבָנֶיהָ בַּקִּיר חֲרָשֶׂת וַיָּסֹבּוּ הַקַּלָּעִים וַיַּכּֽוּהָ׃ 25
౨౫వాళ్ళ పట్టణాలను ధ్వంసం చేశారు. అంతా తలో రాయి వేసి సారవంతమైన భూములను రాళ్ళతోనింపారు. నీళ్ళ ఊటలు పూడ్చివేశారు. మంచి చెట్లు అన్నిటినీ నరికి వేశారు. ఒక్క కీర్హరెశెతు అనే పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కానీ ఒడిసెల విసిరే వారు దాన్ని కూడా చుట్టుముట్టి రాళ్ళు విసురుతూ దానిపై దాడి చేశారు.
וַיַּרְא מֶלֶךְ מוֹאָב כִּֽי־חָזַק מִמֶּנּוּ הַמִּלְחָמָה וַיִּקַּח אוֹתוֹ שְׁבַע־מֵאוֹת אִישׁ שֹׁלֵֽף חֶרֶב לְהַבְקִיעַ אֶל־מֶלֶךְ אֱדוֹם וְלֹא יָכֹֽלוּ׃ 26
౨౬మోయాబు రాజు మేషా, యుద్ధంలో ఓడిపోయామని గ్రహించి ఏడువందల మంది ఖడ్గధారులను తనతో తీసుకుని సైన్యాన్ని ఛేదించుకుంటూ ఎదోము రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాని అది వాళ్ళకు సాధ్యం కాలేదు.
וַיִּקַּח אֶת־בְּנוֹ הַבְּכוֹר אֲשֶׁר־יִמְלֹךְ תַּחְתָּיו וַיַּעֲלֵהוּ עֹלָה עַל־הַחֹמָה וַיְהִי קֶצֶף־גָּדוֹל עַל־יִשְׂרָאֵל וַיִּסְעוּ מֵֽעָלָיו וַיָּשֻׁבוּ לָאָֽרֶץ׃ 27
౨౭అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషా రాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.

< מלכים ב 3 >