< תְהִלִּים 93 >
יְהוָ֣ה מָלָךְ֮ גֵּא֪וּת לָ֫בֵ֥שׁ לָבֵ֣שׁ יְ֭הוָה עֹ֣ז הִתְאַזָּ֑ר אַף־תִּכֹּ֥ון תֵּ֝בֵ֗ל בַּל־תִּמֹּֽוט׃ | 1 |
౧యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.
נָכֹ֣ון כִּסְאֲךָ֣ מֵאָ֑ז מֵֽעֹולָ֣ם אָֽתָּה׃ | 2 |
౨ప్రాచీన కాలంనుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది. నువ్వు శాశ్వతకాలం ఉన్నావు.
נָשְׂא֤וּ נְהָרֹ֨ות ׀ יְֽהוָ֗ה נָשְׂא֣וּ נְהָרֹ֣ות קֹולָ֑ם יִשְׂא֖וּ נְהָרֹ֣ות דָּכְיָֽם׃ | 3 |
౩యెహోవా, మహా సముద్రాలు పైకి లేచాయి, అవి తమ గొంతెత్తాయి, మహా సముద్రాల అలలు ఎగిసిపడి హోరెత్తుతున్నాయి.
מִקֹּלֹ֨ות ׀ מַ֤יִם רַבִּ֗ים אַדִּירִ֣ים מִשְׁבְּרֵי־יָ֑ם אַדִּ֖יר בַּמָּרֹ֣ום יְהוָֽה׃ | 4 |
౪అనేక అలల ఘోషకు మించి, బలమైన సముద్ర తరంగాలను మించి, పైనున్న యెహోవా శక్తిశాలి.
עֵֽדֹתֶ֨יךָ ׀ נֶאֶמְנ֬וּ מְאֹ֗ד לְבֵיתְךָ֥ נַאֲוָה־קֹ֑דֶשׁ יְ֝הוָ֗ה לְאֹ֣רֶךְ יָמִֽים׃ | 5 |
౫యెహోవా, నీ శాసనాలు నమ్మదగినవి, పరిశుద్ధత నీ ఇంటికి శాశ్వత అలంకారంగా ఉంది.