< יִרְמְיָהוּ 6 >

הָעִ֣זוּ ׀ בְּנֵ֣י בִניָמִ֗ן מִקֶּ֙רֶב֙ יְר֣וּשָׁלַ֔͏ִם וּבִתְקֹ֙ועַ֙ תִּקְע֣וּ שֹׁופָ֔ר וְעַל־בֵּ֥ית הַכֶּ֖רֶם שְׂא֣וּ מַשְׂאֵ֑ת כִּ֥י רָעָ֛ה נִשְׁקְפָ֥ה מִצָּפֹ֖ון וְשֶׁ֥בֶר גָּדֹֽול׃ 1
“బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి. ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.
הַנָּוָה֙ וְהַמְּעֻנָּגָ֔ה דָּמִ֖יתִי בַּת־צִיֹּֽון׃ 2
సుందరసుకుమారి సీయోను కన్యను పూర్తిగా నాశనం చేస్తాను.
אֵלֶ֛יהָ יָבֹ֥אוּ רֹעִ֖ים וְעֶדְרֵיהֶ֑ם תָּקְע֨וּ עָלֶ֤יהָ אֹהָלִים֙ סָבִ֔יב רָע֖וּ אִ֥ישׁ אֶת־יָדֹֽו׃ 3
కాపరులు తమ గొర్రెల మందలతో దానిలోకి వస్తారు. దాని చుట్టూ గుడారాలు వేస్తారు. ప్రతివాడూ తన కిష్టమైన చోట మందను మేపుతాడు.
קַדְּשׁ֤וּ עָלֶ֙יהָ֙ מִלְחָמָ֔ה ק֖וּמוּ וְנַעֲלֶ֣ה בַֽצָּהֳרָ֑יִם אֹ֥וי לָ֙נוּ֙ כִּי־פָנָ֣ה הַיֹּ֔ום כִּ֥י יִנָּט֖וּ צִלְלֵי־עָֽרֶב׃ 4
యెహోవా పేరున ఆమెతో యుద్ధానికి సిద్ధపడండి. లెండి, మధ్యాహ్న సమయంలో దాడి చేద్దాం. అయ్యో, పొద్దుగుంకిపోతున్నది. సాయంకాలపు నీడలు సాగిపోతున్నాయి.
ק֚וּמוּ וְנַעֲלֶ֣ה בַלָּ֔יְלָה וְנַשְׁחִ֖יתָה אַרְמְנֹותֶֽיהָ׃ ס 5
కాబట్టి రాత్రిపూట వెళ్ళి ఆమె కోటలు నాశనం చేద్దాం.
כִּ֣י כֹ֤ה אָמַר֙ יְהוָ֣ה צְבָאֹ֔ות כִּרְת֣וּ עֵצָ֔ה וְשִׁפְכ֥וּ עַל־יְרוּשָׁלַ֖͏ִם סֹלְלָ֑ה הִ֚יא הָעִ֣יר הָפְקַ֔ד כֻּלָּ֖הּ עֹ֥שֶׁק בְּקִרְבָּֽהּ׃ 6
సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘చెట్లు నరికి యెరూషలేమును చుట్టూ ముట్టడించండి. ఈ పట్టణం నిండా అన్యాయమే జరుగుతున్నది. కాబట్టి దాన్ని శిక్షించడం న్యాయమే.
כְּהָקִ֥יר בְּוֵר (בַּ֙יִר֙) מֵימֶ֔יהָ כֵּ֖ן הֵקֵ֣רָה רָעָתָ֑הּ חָמָ֣ס וָ֠שֹׁד יִשָּׁ֨מַע בָּ֧הּ עַל־פָּנַ֛י תָּמִ֖יד חֳלִ֥י וּמַכָּֽה׃ 7
ఊటలో నీరు ఏవిధంగా పైకి ఉబికి వస్తుందో ఆ విధంగా దాని దుష్టత్వం పైకి ఉబుకుతూ ఉంది. దానిలో బలాత్కారం, అక్రమం జరగడం వినబడుతున్నది, ఎప్పుడూ గాయాలు, దెబ్బలు నాకు కనబడుతున్నాయి.
הִוָּסְרִי֙ יְר֣וּשָׁלַ֔͏ִם פֶּן־תֵּקַ֥ע נַפְשִׁ֖י מִמֵּ֑ךְ פֶּן־אֲשִׂימֵ֣ךְ שְׁמָמָ֔ה אֶ֖רֶץ לֹ֥וא נֹושָֽׁבָה׃ פ 8
యెరూషలేమా, నేను నీ దగ్గర నుండి తొలగి పోకుండేలా, నేను నిన్ను నిర్జనమైన ప్రదేశంగా చేయకుండేలా దిద్దుబాటుకు లోబడు.’
כֹּ֤ה אָמַר֙ יְהֹוָ֣ה צְבָאֹ֔ות עֹולֵ֛ל יְעֹולְל֥וּ כַגֶּ֖פֶן שְׁאֵרִ֣ית יִשְׂרָאֵ֑ל הָשֵׁב֙ יָדְךָ֔ כְּבֹוצֵ֖ר עַל־סַלְסִלֹּֽות׃ 9
సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు. ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’”
עַל־מִ֨י אֲדַבְּרָ֤ה וְאָעִ֙ידָה֙ וְיִשְׁמָ֔עוּ הִנֵּה֙ עֲרֵלָ֣ה אָזְנָ֔ם וְלֹ֥א יוּכְל֖וּ לְהַקְשִׁ֑יב הִנֵּ֣ה דְבַר־יְהוָ֗ה הָיָ֥ה לָהֶ֛ם לְחֶרְפָּ֖ה לֹ֥א יַחְפְּצוּ־בֹֽו׃ 10
౧౦నేనెవరితో మాట్లాడి హెచ్చరించాలి? వారు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వినలేదు. ఇదిగో, యెహోవా వాక్యం వారిని సరిదిద్దడానికి వారి దగ్గరికి వచ్చింది కానీ దాన్ని వారు తృణీకరిస్తారు.
וְאֵת֩ חֲמַ֨ת יְהוָ֤ה ׀ מָלֵ֙אתִי֙ נִלְאֵ֣יתִי הָכִ֔יל שְׁפֹ֤ךְ עַל־עֹולָל֙ בַּח֔וּץ וְעַ֛ל סֹ֥וד בַּחוּרִ֖ים יַחְדָּ֑ו כִּֽי־גַם־אִ֤ישׁ עִם־אִשָּׁה֙ יִלָּכֵ֔דוּ זָקֵ֖ן עִם־מְלֵ֥א יָמִֽים׃ 11
౧౧కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను. వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది. భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.
וְנָסַ֤בּוּ בָֽתֵּיהֶם֙ לַאֲחֵרִ֔ים שָׂדֹ֥ות וְנָשִׁ֖ים יַחְדָּ֑ו כִּֽי־אַטֶּ֧ה אֶת־יָדִ֛י עַל־יֹשְׁבֵ֥י הָאָ֖רֶץ נְאֻם־יְהוָֽה׃ 12
౧౨వారికిక ఏమీ మిగలదు. వారి ఇళ్ళు, వారి పొలాలు, వారి భార్యలు, మొత్తాన్ని ఇతరులు తీసుకు వెళ్లి పోతారు. ఎందుకంటే ఈ దేశ ప్రజల మీద నేను నా చెయ్యి చాపి వారిని ఎదిరిస్తాను. ఇదే యెహోవా వాక్కు
כִּ֤י מִקְּטַנָּם֙ וְעַד־גְּדֹולָ֔ם כֻּלֹּ֖ו בֹּוצֵ֣עַ בָּ֑צַע וּמִנָּבִיא֙ וְעַד־כֹּהֵ֔ן כֻּלֹּ֖ו עֹ֥שֶׂה שָּֽׁקֶר׃ 13
౧౩“వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
וַֽיְרַפְּא֞וּ אֶת־שֶׁ֤בֶר עַמִּי֙ עַל־נְקַלָּ֔ה לֵאמֹ֖ר שָׁלֹ֣ום ׀ שָׁלֹ֑ום וְאֵ֖ין שָׁלֹֽום׃ 14
౧౪శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.
הֹבִ֕ישׁוּ כִּ֥י תֹועֵבָ֖ה עָשׂ֑וּ גַּם־בֹּ֣ושׁ לֹֽא־יֵבֹ֗ושׁוּ גַּם־הַכְלִים֙ לֹ֣א יָדָ֔עוּ לָכֵ֞ן יִפְּל֧וּ בַנֹּפְלִ֛ים בְּעֵת־פְּקַדְתִּ֥ים יִכָּשְׁל֖וּ אָמַ֥ר יְהוָֽה׃ ס 15
౧౫వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు. తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు. కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు. వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.
כֹּ֣ה אָמַ֣ר יְהוָ֡ה עִמְדוּ֩ עַל־דְּרָכִ֨ים וּרְא֜וּ וְשַׁאֲל֣וּ ׀ לִנְתִבֹ֣ות עֹולָ֗ם אֵי־זֶ֨ה דֶ֤רֶךְ הַטֹּוב֙ וּלְכוּ־בָ֔הּ וּמִצְא֥וּ מַרְגֹּ֖ועַ לְנַפְשְׁכֶ֑ם וַיֹּאמְר֖וּ לֹ֥א נֵלֵֽךְ׃ 16
౧౬యెహోవా చెప్పేదేమంటే, రహదారుల్లో నిలబడి చూడండి. పురాతన మార్గాలు ఏవో వాకబు చేయండి. “ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది?” అని అడిగి అందులో నడవండి. అప్పుడు మీ మనస్సుకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు “మేము అందులో నడవం” అని చెబుతున్నారు.
וַהֲקִמֹתִ֤י עֲלֵיכֶם֙ צֹפִ֔ים הַקְשִׁ֖יבוּ לְקֹ֣ול שֹׁופָ֑ר וַיֹּאמְר֖וּ לֹ֥א נַקְשִֽׁיב׃ 17
౧౭మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.
לָכֵ֖ן שִׁמְע֣וּ הַגֹּויִ֑ם וּדְעִ֥י עֵדָ֖ה אֶת־אֲשֶׁר־בָּֽם׃ 18
౧౮అయితే “మేము వినం” అని వారంటున్నారు. కాబట్టి, అన్యజనులారా, వినండి. సాక్షులారా, వారికేం జరగబోతున్నదో చూడండి.
שִׁמְעִ֣י הָאָ֔רֶץ הִנֵּ֨ה אָנֹכִ֜י מֵבִ֥יא רָעָ֛ה אֶל־הָעָ֥ם הַזֶּ֖ה פְּרִ֣י מַחְשְׁבֹותָ֑ם כִּ֤י עַל־דְּבָרַי֙ לֹ֣א הִקְשִׁ֔יבוּ וְתֹורָתִ֖י וַיִּמְאֲסוּ־בָֽהּ׃ 19
౧౯భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.
לָמָּה־זֶּ֨ה לִ֤י לְבֹונָה֙ מִשְּׁבָ֣א תָבֹ֔וא וְקָנֶ֥ה הַטֹּ֖וב מֵאֶ֣רֶץ מֶרְחָ֑ק עֹלֹֽותֵיכֶם֙ לֹ֣א לְרָצֹ֔ון וְזִבְחֵיכֶ֖ם לֹא־עָ֥רְבוּ לִֽי׃ ס 20
౨౦షేబ దేశం నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు? సుదూర దేశం నుండి తీసుకొచ్చిన మధురమైన సువాసన గల నూనె నాకెందుకు? మీ దహనబలులు నాకిష్టం లేదు. మీ బలులు నాకు సంతోషం కలిగించడం లేదు.
לָכֵ֗ן כֹּ֚ה אָמַ֣ר יְהוָ֔ה הִנְנִ֥י נֹתֵ֛ן אֶל־הָעָ֥ם הַזֶּ֖ה מִכְשֹׁלִ֑ים וְכָ֣שְׁלוּ בָ֠ם אָבֹ֨ות וּבָנִ֥ים יַחְדָּ֛ו שָׁכֵ֥ן וְרֵעֹ֖ו יֹאבֵדוּ (וְאָבָֽדוּ)׃ פ 21
౨౧కాబట్టి యెహోవా చెప్పేదేమంటే, చూడండి, ఈ ప్రజలకు వ్యతిరేకంగా ఒక అడ్డుబండను వేయబోతున్నాను. తండ్రులూ కొడుకులూ అందరూ అది తగిలి కూలిపోతారు. అక్కడి నివాసులు, వారి పొరుగువారు కూడా నశిస్తారు.
כֹּ֚ה אָמַ֣ר יְהוָ֔ה הִנֵּ֛ה עַ֥ם בָּ֖א מֵאֶ֣רֶץ צָפֹ֑ון וְגֹ֣וי גָּדֹ֔ול יֵעֹ֖ור מִיַּרְכְּתֵי־אָֽרֶץ׃ 22
౨౨యెహోవా చెప్పేదేమంటే, ఉత్తర దిక్కునుండి ఒక జనాంగం వస్తూ ఉంది. ఎక్కడో దూర ప్రాంతం నుండి ఒక మహా గొప్ప రాజ్యం బయలు దేరింది.
קֶ֣שֶׁת וְכִידֹ֞ון יַחֲזִ֗יקוּ אַכְזָרִ֥י הוּא֙ וְלֹ֣א יְרַחֵ֔מוּ קֹולָם֙ כַּיָּ֣ם יֶהֱמֶ֔ה וְעַל־סוּסִ֖ים יִרְכָּ֑בוּ עָר֗וּךְ כְּאִישׁ֙ לַמִּלְחָמָ֔ה עָלַ֖יִךְ בַּת־צִיֹּֽון׃ 23
౨౩వారు బాణాలు, ఈటెలు వాడతారు. వారు జాలిలేని క్రూర జనాంగం. వారి స్వరం సముద్ర ఘోషలాగా ఉంటుంది. సీయోను కుమార్తెలారా, వారు గుర్రాలపై స్వారీ చేస్తూ వస్తారు. నీతో యుద్ధం చేయడానికి వారు యోధుల్లాగా బారులు తీరి ఉన్నారు.
שָׁמַ֥עְנוּ אֶת־שָׁמְעֹ֖ו רָפ֣וּ יָדֵ֑ינוּ צָרָה֙ הֶחֱזִיקַ֔תְנוּ חִ֖יל כַּיֹּולֵדָֽה׃ 24
౨౪వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.
אַל־תֵּצְאִי (תֵּֽצְאוּ֙) הַשָּׂדֶ֔ה וּבַדֶּ֖רֶךְ אַל־תֵּלֵכִי (תֵּלֵ֑כוּ) כִּ֚י חֶ֣רֶב לְאֹיֵ֔ב מָגֹ֖ור מִסָּבִֽיב׃ 25
౨౫బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.
בַּת־עַמִּ֤י חִגְרִי־שָׂק֙ וְהִתְפַּלְּשִׁ֣י בָאֵ֔פֶר אֵ֤בֶל יָחִיד֙ עֲשִׂ֣י לָ֔ךְ מִסְפַּ֖ד תַּמְרוּרִ֑ים כִּ֣י פִתְאֹ֔ם יָבֹ֥א הַשֹּׁדֵ֖ד עָלֵֽינוּ׃ 26
౨౬నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి. ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.
בָּחֹ֛ון נְתַתִּ֥יךָ בְעַמִּ֖י מִבְצָ֑ר וְתֵדַ֕ע וּבָחַנְתָּ֖ אֶת־דַּרְכָּֽם׃ 27
౨౭యిర్మీయా, నిన్ను నా ప్రజలకు మెరుగు పెట్టేవాడిగా, వారిని నీకు లోహపు ముద్దగా నేను నియమించాను. ఎందుకంటే నువ్వు వారి ప్రవర్తనను పరిశీలించి తెలుసుకోవాలి.
כֻּלָּם֙ סָרֵ֣י סֹֽורְרִ֔ים הֹלְכֵ֥י רָכִ֖יל נְחֹ֣שֶׁת וּבַרְזֶ֑ל כֻּלָּ֥ם מַשְׁחִיתִ֖ים הֵֽמָּה׃ 28
౨౮వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.
נָחַ֣ר מַפֻּ֔חַ מֵאִשְׁתַּם (מֵאֵ֖שׁ תַּ֣ם) עֹפָ֑רֶת לַשָּׁוְא֙ צָרַ֣ף צָרֹ֔וף וְרָעִ֖ים לֹ֥א נִתָּֽקוּ׃ 29
౨౯కొలిమి తిత్తులు మంటల్లో కాలిపోతున్నాయి. ఆ జ్వాలల్లో సీసం తగలబడి పోతున్నది. అలా మండిస్తూ ఉండడం నిష్ప్రయోజనం. దుష్టులను వేరు చేయడం వీలు కాదు.
כֶּ֣סֶף נִמְאָ֔ס קָרְא֖וּ לָהֶ֑ם כִּֽי־מָאַ֥ס יְהוָ֖ה בָּהֶֽם׃ פ 30
౩౦వారిని “పారవేయాల్సిన వెండి” అని పిలవాలి. ఎందుకంటే యెహోవా వారిని పూర్తిగా తోసిపుచ్చాడు.

< יִרְמְיָהוּ 6 >