< איוב 8 >

וַיַּעַן בִּלְדַּד הַשּׁוּחִי וַיֹּאמַֽר׃ 1
అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు.
עַד־אָן תְּמַלֶּל־אֵלֶּה וְרוּחַ כַּבִּיר אִמְרֵי־פִֽיךָ׃ 2
నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి.
הַאֵל יְעַוֵּת מִשְׁפָּט וְאִם־שַׁדַּי יְעַוֵּת־צֶֽדֶק׃ 3
దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా?
אִם־בָּנֶיךָ חָֽטְאוּ־לוֹ וַֽיְשַׁלְּחֵם בְּיַד־פִּשְׁעָֽם׃ 4
ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో.
אִם־אַתָּה תְּשַׁחֵר אֶל־אֵל וְאֶל־שַׁדַּי תִּתְחַנָּֽן׃ 5
నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.
אִם־זַךְ וְיָשָׁר אָתָּה כִּֽי־עַתָּה יָעִיר עָלֶיךָ וְשִׁלַּם נְוַת צִדְקֶֽךָ׃ 6
నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.
וְהָיָה רֵאשִׁיתְךָ מִצְעָר וְאַחֲרִֽיתְךָ יִשְׂגֶּה מְאֹֽד׃ 7
నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
כִּֽי־שְׁאַל־נָא לְדֹר רִישׁוֹן וְכוֹנֵן לְחֵקֶר אֲבוֹתָֽם׃ 8
మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి.
כִּֽי־תְמוֹל אֲנַחְנוּ וְלֹא נֵדָע כִּי צֵל יָמֵינוּ עֲלֵי־אָֽרֶץ׃ 9
గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో.
הֲלֹא־הֵם יוֹרוּךָ יֹאמְרוּ לָךְ וּמִלִּבָּם יוֹצִאוּ מִלִּֽים׃ 10
౧౦వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా.
הֲיִֽגְאֶה־גֹּמֶא בְּלֹא בִצָּה יִשְׂגֶּה־אָחוּ בְלִי־מָֽיִם׃ 11
౧౧బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా?
עֹדֶנּוּ בְאִבּוֹ לֹא יִקָּטֵף וְלִפְנֵי כׇל־חָצִיר יִיבָֽשׁ׃ 12
౧౨దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది.
כֵּן אׇרְחוֹת כׇּל־שֹׁכְחֵי אֵל וְתִקְוַת חָנֵף תֹּאבֵֽד׃ 13
౧౩దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.
אֲשֶׁר־יָקוֹט כִּסְלוֹ וּבֵית עַכָּבִישׁ מִבְטַחֽוֹ׃ 14
౧౪ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది.
יִשָּׁעֵן עַל־בֵּיתוֹ וְלֹא יַעֲמֹד יַחֲזִיק בּוֹ וְלֹא יָקֽוּם׃ 15
౧౫అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
רָטֹב הוּא לִפְנֵי־שָׁמֶשׁ וְעַל גַּנָּתוֹ יֹנַקְתּוֹ תֵצֵֽא׃ 16
౧౬భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి.
עַל־גַּל שׇׁרָשָׁיו יְסֻבָּכוּ בֵּית אֲבָנִים יֶחֱזֶֽה׃ 17
౧౭అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
אִם־יְבַלְּעֶנּוּ מִמְּקֹמוֹ וְכִחֶשׁ בּוֹ לֹא רְאִיתִֽיךָ׃ 18
౧౮అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.
הֶן־הוּא מְשׂוֹשׂ דַּרְכּוֹ וּמֵעָפָר אַחֵר יִצְמָֽחוּ׃ 19
౧౯అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
הֶן־אֵל לֹא יִמְאַס־תָּם וְלֹֽא־יַחֲזִיק בְּיַד־מְרֵעִֽים׃ 20
౨౦ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
עַד־יְמַלֵּה שְׂחוֹק פִּיךָ וּשְׂפָתֶיךָ תְרוּעָֽה׃ 21
౨౧ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు.
שֹׂנְאֶיךָ יִלְבְּשׁוּ־בֹשֶׁת וְאֹהֶל רְשָׁעִים אֵינֶֽנּוּ׃ 22
౨౨నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.

< איוב 8 >