< איוב 23 >
וַיַּעַן אִיּוֹב וַיֹּאמַֽר׃ | 1 |
౧అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు.
גַּם־הַיּוֹם מְרִי שִׂחִי יָדִי כָּבְדָה עַל־אַנְחָתִֽי׃ | 2 |
౨నేటివరకూ నేను రోషంతో మొర పెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది.
מִֽי־יִתֵּן יָדַעְתִּי וְאֶמְצָאֵהוּ אָבוֹא עַד־תְּכוּנָתֽוֹ׃ | 3 |
౩ఆయన నివాసస్థానం దగ్గరికి నేను చేరేలా ఆయనను ఎక్కడ కనుగొంటానో అది నాకు తెలిస్తే ఎంత బావుణ్ను.
אֶעֶרְכָה לְפָנָיו מִשְׁפָּט וּפִי אֲמַלֵּא תוֹכָחֽוֹת׃ | 4 |
౪ఆయన సమక్షంలో నేను నా వాదన వినిపిస్తాను. వాదోపవాదాలతో నా నోరు నింపుకుంటాను.
אֵדְעָה מִלִּים יַעֲנֵנִי וְאָבִינָה מַה־יֹּאמַר־לִֽי׃ | 5 |
౫ఆయన నాకు జవాబుగా ఏమి పలుకుతాడో అది నేను తెలుసుకుంటాను. ఆయన నాతో పలికే మాటలను అర్థం చేసుకుంటాను.
הַבְּרׇב־כֹּחַ יָרִיב עִמָּדִי לֹא אַךְ־הוּא יָשִׂם בִּֽי׃ | 6 |
౬ఆయన తన అధికబలంతో నాతో వ్యాజ్యెమాడుతాడా? ఆయన అలా చేయడు. నా మనవి ఆలకిస్తాడు.
שָׁם יָשָׁר נוֹכָח עִמּוֹ וַאֲפַלְּטָה לָנֶצַח מִשֹּׁפְטִֽי׃ | 7 |
౭అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడగలుగుతాడు. కాబట్టి నేను నా న్యాయాధిపతి ఇచ్చే శిక్ష శాశ్వతంగా తప్పించుకుంటాను.
הֵן קֶדֶם אֶהֱלֹךְ וְאֵינֶנּוּ וְאָחוֹר וְֽלֹא־אָבִין לֽוֹ׃ | 8 |
౮నేను తూర్పు దిశకు వెళ్లినా ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్లినా ఆయన కనబడడం లేదు.
שְׂמֹאול בַּעֲשֹׂתוֹ וְלֹא־אָחַז יַעְטֹף יָמִין וְלֹא אֶרְאֶֽה׃ | 9 |
౯ఆయన పనులు జరిగించే ఉత్తరదిశకు పోయినా ఆయన నాకు కానరావడం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖం తిప్పుకున్నాడు. నేనాయనను చూడలేను.
כִּֽי־יָדַע דֶּרֶךְ עִמָּדִי בְּחָנַנִי כַּזָּהָב אֵצֵֽא׃ | 10 |
౧౦నేను నడిచే దారి ఆయనకు తెలుసు. ఆయన నన్ను పరీక్షించిన తరవాత నేను బంగారంలాగా కనిపిస్తాను.
בַּאֲשֻׁרוֹ אָחֲזָה רַגְלִי דַּרְכּוֹ שָׁמַרְתִּי וְלֹא־אָֽט׃ | 11 |
౧౧నా పాదాలు ఆయన అడుగు జాడలను వదలకుండా నడిచాయి. నేను ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాను.
מִצְוַת שְׂפָתָיו וְלֹא אָמִישׁ מֵחֻקִּי צָפַנְתִּי אִמְרֵי־פִֽיו׃ | 12 |
౧౨ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను.
וְהוּא בְאֶחָד וּמִי יְשִׁיבֶנּוּ וְנַפְשׁוֹ אִוְּתָה וַיָּֽעַשׂ׃ | 13 |
౧౩అయితే మార్పు లేనివాడు. ఆయనను దారి మళ్ళించ గలవాడెవడు? ఆయన తనకు ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు.
כִּי יַשְׁלִים חֻקִּי וְכָהֵנָּה רַבּוֹת עִמּֽוֹ׃ | 14 |
౧౪నా కోసం తాను సంకల్పించిన దాన్ని ఆయన నెరవేరుస్తాడు. అలాటి పనులను ఆయన అసంఖ్యాకంగా జరిగిస్తాడు.
עַל־כֵּן מִפָּנָיו אֶבָּהֵל אֶתְבּוֹנֵן וְאֶפְחַד מִמֶּֽנּוּ׃ | 15 |
౧౫కాబట్టి ఆయన సన్నిధిలో నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించిన ప్రతిసారీ ఆయనకు భయపడుతున్నాను.
וְאֵל הֵרַךְ לִבִּי וְשַׁדַּי הִבְהִילָֽנִי׃ | 16 |
౧౬దేవుడు నా హృదయాన్ని కుంగజేశాడు. సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు.
כִּֽי־לֹא נִצְמַתִּי מִפְּנֵי־חֹשֶׁךְ וּמִפָּנַי כִּסָּה־אֹֽפֶל׃ | 17 |
౧౭అంధకారం కమ్మినా గాఢాంధకారం నన్ను కమ్మినా నేను నాశనమైపోలేదు.