< דברים 17 >
לֹא־תִזְבַּח לַיהֹוָה אֱלֹהֶיךָ שׁוֹר וָשֶׂה אֲשֶׁר יִהְיֶה בוֹ מוּם כֹּל דָּבָר רָע כִּי תוֹעֲבַת יְהֹוָה אֱלֹהֶיךָ הֽוּא׃ | 1 |
౧“ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెలు మీ యెహోవా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవా దేవునికి అసహ్యం.
כִּֽי־יִמָּצֵא בְקִרְבְּךָ בְּאַחַד שְׁעָרֶיךָ אֲשֶׁר־יְהֹוָה אֱלֹהֶיךָ נֹתֵן לָךְ אִישׁ אוֹ־אִשָּׁה אֲשֶׁר יַעֲשֶׂה אֶת־הָרַע בְּעֵינֵי יְהֹוָה־אֱלֹהֶיךָ לַעֲבֹר בְּרִיתֽוֹ׃ | 2 |
౨మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు,
וַיֵּלֶךְ וַֽיַּעֲבֹד אֱלֹהִים אֲחֵרִים וַיִּשְׁתַּחוּ לָהֶם וְלַשֶּׁמֶשׁ ׀ אוֹ לַיָּרֵחַ אוֹ לְכׇל־צְבָא הַשָּׁמַיִם אֲשֶׁר לֹא־צִוִּֽיתִי׃ | 3 |
౩ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే
וְהֻֽגַּד־לְךָ וְשָׁמָעְתָּ וְדָרַשְׁתָּ הֵיטֵב וְהִנֵּה אֱמֶת נָכוֹן הַדָּבָר נֶעֶשְׂתָה הַתּוֹעֵבָה הַזֹּאת בְּיִשְׂרָאֵֽל׃ | 4 |
౪ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి.
וְהֽוֹצֵאתָ אֶת־הָאִישׁ הַהוּא אוֹ אֶת־הָאִשָּׁה הַהִוא אֲשֶׁר עָשׂוּ אֶת־הַדָּבָר הָרָע הַזֶּה אֶל־שְׁעָרֶיךָ אֶת־הָאִישׁ אוֹ אֶת־הָאִשָּׁה וּסְקַלְתָּם בָּאֲבָנִים וָמֵֽתוּ׃ | 5 |
౫అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది.
עַל־פִּי ׀ שְׁנַיִם עֵדִים אוֹ שְׁלֹשָׁה עֵדִים יוּמַת הַמֵּת לֹא יוּמַת עַל־פִּי עֵד אֶחָֽד׃ | 6 |
౬కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు.
יַד הָעֵדִים תִּֽהְיֶה־בּוֹ בָרִאשֹׁנָה לַהֲמִיתוֹ וְיַד כׇּל־הָעָם בָּאַחֲרֹנָה וּבִֽעַרְתָּ הָרָע מִקִּרְבֶּֽךָ׃ | 7 |
౭అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి.
כִּי יִפָּלֵא מִמְּךָ דָבָר לַמִּשְׁפָּט בֵּֽין־דָּם ׀ לְדָם בֵּֽין־דִּין לְדִין וּבֵין נֶגַע לָנֶגַע דִּבְרֵי רִיבֹת בִּשְׁעָרֶיךָ וְקַמְתָּ וְעָלִיתָ אֶל־הַמָּקוֹם אֲשֶׁר יִבְחַר יְהֹוָה אֱלֹהֶיךָ בּֽוֹ׃ | 8 |
౮హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే
וּבָאתָ אֶל־הַכֹּהֲנִים הַלְוִיִּם וְאֶל־הַשֹּׁפֵט אֲשֶׁר יִהְיֶה בַּיָּמִים הָהֵם וְדָרַשְׁתָּ וְהִגִּידוּ לְךָ אֵת דְּבַר הַמִּשְׁפָּֽט׃ | 9 |
౯మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.
וְעָשִׂיתָ עַל־פִּי הַדָּבָר אֲשֶׁר יַגִּידֽוּ לְךָ מִן־הַמָּקוֹם הַהוּא אֲשֶׁר יִבְחַר יְהֹוָה וְשָׁמַרְתָּ לַעֲשׂוֹת כְּכֹל אֲשֶׁר יוֹרֽוּךָ׃ | 10 |
౧౦యెహోవా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి.
עַל־פִּי הַתּוֹרָה אֲשֶׁר יוֹרוּךָ וְעַל־הַמִּשְׁפָּט אֲשֶׁר־יֹאמְרוּ לְךָ תַּעֲשֶׂה לֹא תָסוּר מִן־הַדָּבָר אֲשֶׁר־יַגִּידֽוּ לְךָ יָמִין וּשְׂמֹֽאל׃ | 11 |
౧౧వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.
וְהָאִישׁ אֲשֶׁר־יַעֲשֶׂה בְזָדוֹן לְבִלְתִּי שְׁמֹעַ אֶל־הַכֹּהֵן הָעֹמֵד לְשָׁרֶת שָׁם אֶת־יְהֹוָה אֱלֹהֶיךָ אוֹ אֶל־הַשֹּׁפֵט וּמֵת הָאִישׁ הַהוּא וּבִֽעַרְתָּ הָרָע מִיִּשְׂרָאֵֽל׃ | 12 |
౧౨ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.
וְכׇל־הָעָם יִשְׁמְעוּ וְיִרָאוּ וְלֹא יְזִידוּן עֽוֹד׃ | 13 |
౧౩అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు.
כִּֽי־תָבֹא אֶל־הָאָרֶץ אֲשֶׁר יְהֹוָה אֱלֹהֶיךָ נֹתֵן לָךְ וִֽירִשְׁתָּהּ וְיָשַׁבְתָּה בָּהּ וְאָמַרְתָּ אָשִׂימָה עָלַי מֶלֶךְ כְּכׇל־הַגּוֹיִם אֲשֶׁר סְבִיבֹתָֽי׃ | 14 |
౧౪మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి.
שׂוֹם תָּשִׂים עָלֶיךָ מֶלֶךְ אֲשֶׁר יִבְחַר יְהֹוָה אֱלֹהֶיךָ בּוֹ מִקֶּרֶב אַחֶיךָ תָּשִׂים עָלֶיךָ מֶלֶךְ לֹא תוּכַל לָתֵת עָלֶיךָ אִישׁ נׇכְרִי אֲשֶׁר לֹֽא־אָחִיךָ הֽוּא׃ | 15 |
౧౫మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు.
רַק לֹא־יַרְבֶּה־לּוֹ סוּסִים וְלֹֽא־יָשִׁיב אֶת־הָעָם מִצְרַיְמָה לְמַעַן הַרְבּוֹת סוּס וַֽיהֹוָה אָמַר לָכֶם לֹא תֹסִפוּן לָשׁוּב בַּדֶּרֶךְ הַזֶּה עֽוֹד׃ | 16 |
౧౬అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు.
וְלֹא יַרְבֶּה־לּוֹ נָשִׁים וְלֹא יָסוּר לְבָבוֹ וְכֶסֶף וְזָהָב לֹא יַרְבֶּה־לּוֹ מְאֹֽד׃ | 17 |
౧౭తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.
וְהָיָה כְשִׁבְתּוֹ עַל כִּסֵּא מַמְלַכְתּוֹ וְכָתַב לוֹ אֶת־מִשְׁנֵה הַתּוֹרָה הַזֹּאת עַל־סֵפֶר מִלִּפְנֵי הַכֹּהֲנִים הַלְוִיִּֽם׃ | 18 |
౧౮అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.
וְהָיְתָה עִמּוֹ וְקָרָא בוֹ כׇּל־יְמֵי חַיָּיו לְמַעַן יִלְמַד לְיִרְאָה אֶת־יְהֹוָה אֱלֹהָיו לִשְׁמֹר אֶֽת־כׇּל־דִּבְרֵי הַתּוֹרָה הַזֹּאת וְאֶת־הַחֻקִּים הָאֵלֶּה לַעֲשֹׂתָֽם׃ | 19 |
౧౯అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.
לְבִלְתִּי רוּם־לְבָבוֹ מֵֽאֶחָיו וּלְבִלְתִּי סוּר מִן־הַמִּצְוָה יָמִין וּשְׂמֹאול לְמַעַן יַאֲרִיךְ יָמִים עַל־מַמְלַכְתּוֹ הוּא וּבָנָיו בְּקֶרֶב יִשְׂרָאֵֽל׃ | 20 |
౨౦అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.”