< תהילים 94 >
אל-נקמות יהוה אל נקמות הופיע | 1 |
౧ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
הנשא שפט הארץ השב גמול על-גאים | 2 |
౨లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
עד-מתי רשעים יהוה עד-מתי רשעים יעלזו | 3 |
౩యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
יביעו ידברו עתק יתאמרו כל-פעלי און | 4 |
౪వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
עמך יהוה ידכאו ונחלתך יענו | 5 |
౫యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
אלמנה וגר יהרגו ויתומים ירצחו | 6 |
౬వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
ויאמרו לא יראה-יה ולא-יבין אלהי יעקב | 7 |
౭వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
בינו בערים בעם וכסילים מתי תשכילו | 8 |
౮బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
הנטע אזן הלא ישמע אם-יצר עין הלא יביט | 9 |
౯చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
היסר גוים הלא יוכיח המלמד אדם דעת | 10 |
౧౦రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
יהוה--ידע מחשבות אדם כי-המה הבל | 11 |
౧౧మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
אשרי הגבר אשר-תיסרנו יה ומתורתך תלמדנו | 12 |
౧౨యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
להשקיט לו מימי רע-- עד יכרה לרשע שחת | 13 |
౧౩దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
כי לא-יטש יהוה עמו ונחלתו לא יעזב | 14 |
౧౪యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
כי-עד-צדק ישוב משפט ואחריו כל-ישרי-לב | 15 |
౧౫న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
מי-יקום לי עם-מרעים מי-יתיצב לי עם-פעלי און | 16 |
౧౬దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
לולי יהוה עזרתה לי-- כמעט שכנה דומה נפשי | 17 |
౧౭యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
אם-אמרתי מטה רגלי חסדך יהוה יסעדני | 18 |
౧౮నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
ברב שרעפי בקרבי-- תנחומיך ישעשעו נפשי | 19 |
౧౯నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
היחברך כסא הוות יצר עמל עלי-חק | 20 |
౨౦దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
יגודו על-נפש צדיק ודם נקי ירשיעו | 21 |
౨౧వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
ויהי יהוה לי למשגב ואלהי לצור מחסי | 22 |
౨౨అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
וישב עליהם את אונם-- וברעתם יצמיתם יצמיתם יהוה אלהינו | 23 |
౨౩ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.