< תהילים 91 >
ישב בסתר עליון בצל שדי יתלונן | 1 |
౧సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.
אמר--ליהוה מחסי ומצודתי אלהי אבטח-בו | 2 |
౨ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.
כי הוא יצילך מפח יקוש מדבר הוות | 3 |
౩వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
באברתו יסך לך--ותחת-כנפיו תחסה צנה וסחרה אמתו | 4 |
౪ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది.
לא-תירא מפחד לילה מחץ יעוף יומם | 5 |
౫రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు.
מדבר באפל יהלך מקטב ישוד צהרים | 6 |
౬చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు.
יפל מצדך אלף--ורבבה מימינך אליך לא יגש | 7 |
౭నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు.
רק בעיניך תביט ושלמת רשעים תראה | 8 |
౮దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు.
כי-אתה יהוה מחסי עליון שמת מעונך | 9 |
౯యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో.
לא-תאנה אליך רעה ונגע לא-יקרב באהלך | 10 |
౧౦ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు.
כי מלאכיו יצוה-לך לשמרך בכל-דרכיך | 11 |
౧౧నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు.
על-כפים ישאונך פן-תגף באבן רגלך | 12 |
౧౨నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.
על-שחל ופתן תדרך תרמס כפיר ותנין | 13 |
౧౩నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.
כי בי חשק ואפלטהו אשגבהו כי-ידע שמי | 14 |
౧౪అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను.
יקראני ואענהו--עמו-אנכי בצרה אחלצהו ואכבדהו | 15 |
౧౫అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.
ארך ימים אשביעהו ואראהו בישועתי | 16 |
౧౬దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను.