< תהילים 90 >
תפלה למשה איש-האלהים אדני--מעון אתה היית לנו בדר ודר | 1 |
౧దేవుని మనిషి మోషే ప్రార్థన. ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
בטרם הרים ילדו-- ותחולל ארץ ותבל ומעולם עד-עולם אתה אל | 2 |
౨పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
תשב אנוש עד-דכא ותאמר שובו בני-אדם | 3 |
౩నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.
כי אלף שנים בעיניך-- כיום אתמול כי יעבר ואשמורה בלילה | 4 |
౪నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
זרמתם שנה יהיו בבקר כחציר יחלף | 5 |
౫వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.
בבקר יציץ וחלף לערב ימולל ויבש | 6 |
౬ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.
כי-כלינו באפך ובחמתך נבהלנו | 7 |
౭నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.
שת (שתה) עונתינו לנגדך עלמנו למאור פניך | 8 |
౮మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.
כי כל-ימינו פנו בעברתך כלינו שנינו כמו-הגה | 9 |
౯నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.
ימי-שנותינו בהם שבעים שנה ואם בגבורת שמונים שנה-- ורהבם עמל ואון כי-גז חיש ונעפה | 10 |
౧౦మా బలము డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.
מי-יודע עז אפך וכיראתך עברתך | 11 |
౧౧నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?
למנות ימינו כן הודע ונבא לבב חכמה | 12 |
౧౨కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
שובה יהוה עד-מתי והנחם על-עבדיך | 13 |
౧౩యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.
שבענו בבקר חסדך ונרננה ונשמחה בכל-ימינו | 14 |
౧౪ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.
שמחנו כימות עניתנו שנות ראינו רעה | 15 |
౧౫నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.
יראה אל-עבדיך פעלך והדרך על-בניהם | 16 |
౧౬నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
ויהי נעם אדני אלהינו-- עלינו ומעשה ידינו כוננה עלינו ומעשה ידינו כוננהו | 17 |
౧౭మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.