< תהילים 89 >
משכיל לאיתן האזרחי ב חסדי יהוה עולם אשירה לדר ודר אודיע אמונתך בפי | 1 |
౧ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం. యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.
כי-אמרתי--עולם חסד יבנה שמים תכן אמונתך בהם | 2 |
౨నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.
כרתי ברית לבחירי נשבעתי לדוד עבדי | 3 |
౩నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.
עד-עולם אכין זרעך ובניתי לדר-ודור כסאך סלה | 4 |
౪శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. (సెలా)
ויודו שמים פלאך יהוה אף-אמונתך בקהל קדשים | 5 |
౫యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.
כי מי בשחק יערך ליהוה ידמה ליהוה בבני אלים | 6 |
౬ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?
אל נערץ בסוד-קדשים רבה ונורא על-כל-סביביו | 7 |
౭పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.
יהוה אלהי צבאות--מי-כמוך חסין יה ואמונתך סביבותיך | 8 |
౮యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.
אתה מושל בגאות הים בשוא גליו אתה תשבחם | 9 |
౯ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.
אתה דכאת כחלל רהב בזרוע עזך פזרת אויביך | 10 |
౧౦చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.
לך שמים אף-לך ארץ תבל ומלאה אתה יסדתם | 11 |
౧౧ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.
צפון וימין אתה בראתם תבור וחרמון בשמך ירננו | 12 |
౧౨ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.
לך זרוע עם-גבורה תעז ידך תרום ימינך | 13 |
౧౩నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.
צדק ומשפט מכון כסאך חסד ואמת יקדמו פניך | 14 |
౧౪నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.
אשרי העם ידעי תרועה יהוה באור-פניך יהלכון | 15 |
౧౫నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.
בשמך יגילון כל-היום ובצדקתך ירומו | 16 |
౧౬నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.
כי-תפארת עזמו אתה וברצונך תרים (תרום) קרנינו | 17 |
౧౭వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.
כי ליהוה מגננו ולקדוש ישראל מלכנו | 18 |
౧౮మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
אז דברת בחזון לחסידיך-- ותאמר שויתי עזר על-גבור הרימותי בחור מעם | 19 |
౧౯ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.
מצאתי דוד עבדי בשמן קדשי משחתיו | 20 |
౨౦నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
אשר ידי תכון עמו אף-זרועי תאמצנו | 21 |
౨౧నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.
לא-ישיא אויב בו ובן-עולה לא יעננו | 22 |
౨౨ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.
וכתותי מפניו צריו ומשנאיו אגוף | 23 |
౨౩అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.
ואמונתי וחסדי עמו ובשמי תרום קרנו | 24 |
౨౪నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.
ושמתי בים ידו ובנהרות ימינו | 25 |
౨౫సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.
הוא יקראני אבי אתה אלי וצור ישועתי | 26 |
౨౬నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.
אף-אני בכור אתנהו עליון למלכי-ארץ | 27 |
౨౭నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.
לעולם אשמור- (אשמר-) לו חסדי ובריתי נאמנת לו | 28 |
౨౮నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
ושמתי לעד זרעו וכסאו כימי שמים | 29 |
౨౯అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.
אם-יעזבו בניו תורתי ובמשפטי לא ילכון | 30 |
౩౦అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,
אם-חקתי יחללו ומצותי לא ישמרו | 31 |
౩౧వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,
ופקדתי בשבט פשעם ובנגעים עונם | 32 |
౩౨నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.
וחסדי לא-אפיר מעמו ולא-אשקר באמונתי | 33 |
౩౩అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.
לא-אחלל בריתי ומוצא שפתי לא אשנה | 34 |
౩౪నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
אחת נשבעתי בקדשי אם-לדוד אכזב | 35 |
౩౫అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది
זרעו לעולם יהיה וכסאו כשמש נגדי | 36 |
౩౬చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.
כירח יכון עולם ועד בשחק נאמן סלה | 37 |
౩౭నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. (సెలా)
ואתה זנחת ותמאס התעברת עם-משיחך | 38 |
౩౮అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.
נארתה ברית עבדך חללת לארץ נזרו | 39 |
౩౯నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.
פרצת כל-גדרתיו שמת מבצריו מחתה | 40 |
౪౦అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.
שסהו כל-עברי דרך היה חרפה לשכניו | 41 |
౪౧దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.
הרימות ימין צריו השמחת כל-אויביו | 42 |
౪౨అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.
אף-תשיב צור חרבו ולא הקימתו במלחמה | 43 |
౪౩అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.
השבת מטהרו וכסאו לארץ מגרתה | 44 |
౪౪అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
הקצרת ימי עלומיו העטית עליו בושה סלה | 45 |
౪౫అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. (సెలా)
עד-מה יהוה תסתר לנצח תבער כמו-אש חמתך | 46 |
౪౬యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?
זכר-אני מה-חלד על-מה-שוא בראת כל-בני-אדם | 47 |
౪౭నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
מי גבר יחיה ולא יראה-מות ימלט נפשו מיד-שאול סלה (Sheol ) | 48 |
౪౮చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? (సెలా) (Sheol )
איה חסדיך הראשנים אדני נשבעת לדוד באמונתך | 49 |
౪౯ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?
זכר אדני חרפת עבדיך שאתי בחיקי כל-רבים עמים | 50 |
౫౦ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.
אשר חרפו אויביך יהוה אשר חרפו עקבות משיחך | 51 |
౫౧యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.
ברוך יהוה לעולם אמן ואמן | 52 |
౫౨యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్, ఆమేన్.