< תהילים 83 >
שיר מזמור לאסף ב אלהים אל-דמי-לך אל-תחרש ואל-תשקט אל | 1 |
౧ఒక పాట. ఆసాపు కీర్తన. దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.
כי-הנה אויביך יהמיון ומשנאיך נשאו ראש | 2 |
౨నీ శత్రువులు నీకు ఎదురు తిరుగుతున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.
על-עמך יערימו סוד ויתיעצו על-צפוניך | 3 |
౩నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.
אמרו--לכו ונכחידם מגוי ולא-יזכר שם-ישראל עוד | 4 |
౪వాళ్ళిలా చెబుతున్నారు, వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేద్దాం రండి. అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇక గుర్తుకు రాకుండా ఉంటుంది.
כי נועצו לב יחדו עליך ברית יכרתו | 5 |
౫ఏకగ్రీవంగా వాళ్ళు ఆలోచన చేశారు. నీకు విరోధంగా ఒప్పందాలు చేసుకున్నారు.
אהלי אדום וישמעאלים מואב והגרים | 6 |
౬గుడారాల్లో జీవించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
גבל ועמון ועמלק פלשת עם-ישבי צור | 7 |
౭గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు,
גם-אשור נלוה עמם היו זרוע לבני-לוט סלה | 8 |
౮అష్షూరు దేశస్థులు వాళ్ళ పక్షాన చేరారు. లోతు వంశస్థులకు వాళ్ళు సాయం చేస్తున్నారు. (సెలా)
עשה-להם כמדין כסיסרא כיבין בנחל קישון | 9 |
౯నువ్వు మిద్యానుకు ఏమి చేశావో కీషోను వాగు దగ్గర నువ్వు సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే వారికి చెయ్యి.
נשמדו בעין-דאר היו דמן לאדמה | 10 |
౧౦వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.
שיתמו נדיבימו כערב וכזאב וכזבח וכצלמנע כל-נסיכימו | 11 |
౧౧ఓరేబు, జెయేబు నాయకులకు నువ్వు చేసినట్టు వారి ప్రధానులకు చెయ్యి. జెబహు సల్మున్నా అనే వారికి నువ్వు చేసినట్టు వాళ్ళ రాజులందరికీ చెయ్యి.
אשר אמרו נירשה לנו-- את נאות אלהים | 12 |
౧౨దేవుని పచ్చిక భూములను మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు అంటున్నారు.
אלהי שיתמו כגלגל כקש לפני-רוח | 13 |
౧౩నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి.
כאש תבער-יער וכלהבה תלהט הרים | 14 |
౧౪మంటలు అడవిని కాల్చివేసినట్టు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్టు,
כן תרדפם בסערך ובסופתך תבהלם | 15 |
౧౫నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు.
מלא פניהם קלון ויבקשו שמך יהוה | 16 |
౧౬యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు.
יבשו ויבהלו עדי-עד ויחפרו ויאבדו | 17 |
౧౭వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి.
וידעו-- כי-אתה שמך יהוה לבדך עליון על-כל-הארץ | 18 |
౧౮యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.