< תהילים 71 >
בך-יהוה חסיתי אל-אבושה לעולם | 1 |
౧యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు.
בצדקתך תצילני ותפלטני הטה-אלי אזנך והושיעני | 2 |
౨నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు.
היה לי לצור מעון לבוא-- תמיד צוית להושיעני כי-סלעי ומצודתי אתה | 3 |
౩నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు.
אלהי--פלטני מיד רשע מכף מעול וחומץ | 4 |
౪నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు.
כי-אתה תקותי אדני יהוה מבטחי מנעורי | 5 |
౫నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే.
עליך נסמכתי מבטן--ממעי אמי אתה גוזי בך תהלתי תמיד | 6 |
౬నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను.
כמופת הייתי לרבים ואתה מחסי-עז | 7 |
౭నేను అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నాను. అయినా నాకు బలమైన ఆశ్రయం నువ్వే.
ימלא פי תהלתך כל-היום תפארתך | 8 |
౮నీ కీర్తితో, ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండిపోయింది.
אל-תשליכני לעת זקנה ככלות כחי אל-תעזבני | 9 |
౯ముసలితనంలో నన్ను విడిచిపెట్టకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదలకు.
כי-אמרו אויבי לי ושמרי נפשי נועצו יחדו | 10 |
౧౦నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు.
לאמר אלהים עזבו רדפו ותפשוהו כי-אין מציל | 11 |
౧౧దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, వాణ్ణి తప్పించేవాడు ఎవరూ లేరు. వాణ్ణి తరిమి పట్టుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు.
אלהים אל-תרחק ממני אלהי לעזרתי חישה (חושה) | 12 |
౧౨దేవా, నాకు దూరంగా ఉండవద్దు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా బయలుదేరు.
יבשו יכלו שטני נפשי יעטו חרפה וכלמה--מבקשי רעתי | 13 |
౧౩నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.
ואני תמיד איחל והוספתי על-כל-תהלתך | 14 |
౧౪నేను అన్నివేళలా నిరీక్షణ కలిగి ఉంటాను. మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను.
פי יספר צדקתך--כל-היום תשועתך כי לא ידעתי ספרות | 15 |
౧౫నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.
אבוא--בגברות אדני יהוה אזכיר צדקתך לבדך | 16 |
౧౬ప్రభువైన యెహోవా బలమైన కార్యాలను నేను వర్ణించడం మొదలు పెడతాను. నీ నీతిని మాత్రమే నేను వివరిస్తాను.
אלהים למדתני מנעורי ועד-הנה אגיד נפלאותיך | 17 |
౧౭దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.
וגם עד-זקנה ושיבה-- אלהים אל-תעזבני עד-אגיד זרועך לדור לכל-יבוא גבורתך | 18 |
౧౮దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను.
וצדקתך אלהים עד-מרום אשר-עשית גדלות אלהים מי כמוך | 19 |
౧౯దేవా, నీ నీతి ఎత్తయిన ఆకాశాలకన్నా ఉన్నతమైనది. ఘన కార్యాలు చేసిన దేవా, నీకు సాటి ఎవరు?
אשר הראיתנו (הראיתני) צרות רבות-- ורעות תשוב תחינו (תחיני) ומתהמות הארץ תשוב תעלני | 20 |
౨౦ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.
౨౧నా గొప్పతనాన్ని వృద్ధిచెయ్యి. నావైపు తిరిగి నన్ను ఆదరించు.
גם-אני אודך בכלי-נבל-- אמתך אלהי אזמרה לך בכנור-- קדוש ישראל | 22 |
౨౨నా దేవా, నేను నీ యథార్థ క్రియలను బట్టి స్వరమండల వాయిద్యంతో నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తిస్తాను.
תרננה שפתי כי אזמרה-לך ונפשי אשר פדית | 23 |
౨౩నేను నిన్ను కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదాలు, నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేస్తాయి. నాకు హాని కలిగించాలని ప్రయత్నించే వాళ్ళు అవమానం పాలై అయోమయంలో ఉన్నారు.
גם-לשוני-- כל-היום תהגה צדקתך כי-בשו כי-חפרו מבקשי רעתי | 24 |
౨౪అయితే నా నాలుక రోజంతా నీ నీతిని వివరిస్తూ ఉంది.